AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీని షేక్ చేస్తున్న కొత్త క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. తెలుగులోనూ చూడొచ్చు.. IMDBలో 8.7 రేటింగ్

పోలీస్ వ్యవస్థలోని విధి విధానాలు, చీకటి కోణాలు, కింది స్థాయి సిబ్బందిపై డిపార్ట్ మెంట్ ఉన్నతాధికారుల వేధింపులు ఎలా ఉంటాయో ఈ సిరీస్ లో చక్కగా చూపించారు. అలాంటి చోట నిజాయతీ గల ఒక కానిస్టేబుల్ కు కోపం వస్తే ఏం జరుగుతుందన్నదే ఈ సిరీస్ మెయిన్ పాయింట్. తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లోనూ ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.

OTT Movie: ఓటీటీని షేక్ చేస్తున్న కొత్త క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. తెలుగులోనూ చూడొచ్చు.. IMDBలో 8.7 రేటింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: May 25, 2026 | 9:40 PM

Share

ఓటీటీలో ప్రతి వారం కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు వస్తుటాయి. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ.. ఇలా ఎన్నో భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు కూడా తెలుగులోకి అనువాదమవుతుంటాయి. అలా ఒక తమిళ వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లోనూ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఐఎమ్ డీబీలోనూఈ సిరీస్ కు 8.2 రేటింగ్ దక్కడం విశేషం. స్టోరీ విషయానికి వస్తే.. ఒక చిన్న పట్టణంలో పని చేసే కోట్టై కరుప్పుసామి అనే అమాయకపు కానిస్టేబుల్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కింది స్థాయి సిబ్బంది పరిస్థితి ఎలా ఉంటుందో ఈ సిరీస్ లో కళ్లకు కట్టినట్లు చూపించారు. అలా కరుప్పు స్వామి కూడా పై స్థాయి అధికారుల నుంచి ప్రతిరోజూ తీవ్రమైన అవమానాలు, వేధింపులు ఎదుర్కొంటాడు. అయితే ఒకానొక టైంలో అతని ఓపిక కట్టలు తెంచుకుంటుంది. అప్పటిదాకా తన లోపల అణచి పెట్టుకున్న కోపం, పగను బయటకు తీస్తాడు. డిపార్ట్‌మెంట్‌లో మూలన పడేసిన, పెండింగ్‌లో ఉన్న పాత ఫైళ్లను బయటకు తీస్తాడు. ఒక్కొక్క కేసును తనదైన శైలిలో విచారిస్తాడు. ఇదే క్రమంలో నేరస్థుల పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తాడు. దీంతో అతనిని చూసి జనాలతో పాటు పోలసులు కూడా భయంతో వణికిపోతారు. ఇదే క్రమంలో పోలీస్ స్టేషన్ లో ఒక లాకప్ డెత్ జరుగుతుంది. ఇది కరుప్పు స్వామి జీవితంతో పాటు మొత్తం పోలీస్ వ్యవస్థను కుదిపేస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

ఈ హై-వోల్టేజ్ తమిళ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరే ‘వారెంట్’. గతంలో ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘విలంగు’ (2022) అనే సూపర్ హిట్ సిరీస్ కు సీక్వెల్ గా ఈ సిరీస్ తెరకెక్కింది. ప్రశాంత్ పాండియరాజ్ ఈ సిరీస్ కు క్రియేటర్ గా వ్యవహరించగా, విగ్నేష్ నటరాజన్ దర్శకత్వం వహించాడు. ఈ సిరీస్ లో కరుప్పుసామిగా ప్రశాంత్ పాండియరాజ్ నటి బాలాజీ శక్తివేల్, కాళీ వెంకట్, అరుళ్ దాస్, నమ్రిత తదితరులు కీలక పాత్రలు పోషించారు. సామ్ సి.ఎస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సిరీస్ ను నెక్ట్స్ లెవెల్ తీసుకెళ్లిందని చెప్పవచ్చు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, ఇతర దక్షిణాది భాషల్లో కూడా ఇది అందుబాటులో ఉంది. ఓటీటీలో మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా కానీ వెబ్ సిరీస్ చూడాలనుకునే వారికి ఇదొక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

జీ5 టాప్ ట్రెండింగ్ లో వారెంట్ వెబ్ సిరీస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
'డీసీ'కి100 కోట్లు.. లోకేశ్ కనగరాజ్, అనిరుధ్‌లకు ఖరీదైన గిప్ట్స్
'డీసీ'కి100 కోట్లు.. లోకేశ్ కనగరాజ్, అనిరుధ్‌లకు ఖరీదైన గిప్ట్స్
పాతాళంలో వ్యవసాయం..ఎండా వానతో పనిలేదు..భూగర్భంలో పంటలు పండించే
పాతాళంలో వ్యవసాయం..ఎండా వానతో పనిలేదు..భూగర్భంలో పంటలు పండించే
బెల్లీ ఫ్యాట్ తగ్గడం లేదా? అసలు కారణం ఇదే ఉండొచ్చు!
బెల్లీ ఫ్యాట్ తగ్గడం లేదా? అసలు కారణం ఇదే ఉండొచ్చు!
ఈ 3 ప్రదేశాల నుండి బయటికొచ్చాక వెనక్కి తిరిగి చూడకూడదు!
ఈ 3 ప్రదేశాల నుండి బయటికొచ్చాక వెనక్కి తిరిగి చూడకూడదు!
నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్..!
నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్..!
గణేష్ పండుగకు ఈ స్పెషల్ స్వీట్ తప్పక ట్రై చేయండి..
గణేష్ పండుగకు ఈ స్పెషల్ స్వీట్ తప్పక ట్రై చేయండి..
ఉదయం లేవగానే పొట్ట ఉబ్బరంగా ఉందా? రాత్రి ఈ మిస్టేక్ చేయకండి
ఉదయం లేవగానే పొట్ట ఉబ్బరంగా ఉందా? రాత్రి ఈ మిస్టేక్ చేయకండి
బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు.. ఇక ATM నుంచే కొత్త డెబిట్ కార్డు
బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు.. ఇక ATM నుంచే కొత్త డెబిట్ కార్డు
ఆన్‌లైన్‌లో టీవీ డివైజ్ ఆర్డర్ చేస్తే.. ఇంటికి వచ్చిన పార్శిల్‌లో
ఆన్‌లైన్‌లో టీవీ డివైజ్ ఆర్డర్ చేస్తే.. ఇంటికి వచ్చిన పార్శిల్‌లో
కుమారుడి ఫస్ట్ బర్త్‌ డే.. వాయువ్ తేజ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్
కుమారుడి ఫస్ట్ బర్త్‌ డే.. వాయువ్ తేజ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్