AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఒకరినొకరు చంపుకొనే పోలీసులు.. ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో టాప్ రేటింగ్

వీకెండ్ లో ఓ మంచి సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ మూవీ చూడాలనుకుంటున్నారా? అయితే ఈ మూవీ మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమా ఆద్యంతం మొత్తం చాలా ఎంగేజింగ్ గా, థ్రిల్లింగ్ గా సాగుతుంది. ట్విస్టులు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి.

OTT Movie: ఒకరినొకరు చంపుకొనే పోలీసులు.. ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో టాప్ రేటింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: May 24, 2026 | 7:44 PM

Share

ఎప్పటిలాగే గత శుక్రవారం ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన డబ్బింగ్ సినిమాలు, సిరీస్ లు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. అయితే వీటితో పాటే సీట్ ఎడ్జ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే ఓ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కూడా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లనే రాబట్టింది. ఆసక్తికరమైన కథ కథనాలు, ఉత్కంఠ రేపే సన్నివేశాలు, ఊహించని ట్విస్టులు మొత్తానికి ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని చీకటి కోణాన్ని ఆవిష్కరిస్తూ, ఒకే రాత్రిలో జరిగే కథతో ఉత్కంఠభరితంగా ఈ మూవీని తెరకెక్కించారు. కొందరు పోలీస్ అధికారులు తమ లాభం, స్వార్థం కోసం వ్యవస్థను ఎలా వాడుకున్నారన్నది ఈ సినిమాలో చూపించారు. స్టోరీ విషయానికి వస్తే.. లంచాలు, అధికార దుర్వినియోగం, సెటిల్‌మెంట్లు వంటి దారుణాలకు పాల్పడే పోలీసులను ఒక అపరిచిత వ్యక్తి టార్గెట్ చేస్తాడు. మొదట్లో పోలీసులు ఇది సాధారణమే అనుకున్నప్పటికీ ఆ తర్వాత ఇదొక రివేంజ్ ప్లాన్ అని అర్థమవుతుంది. బయట భారీ వర్షం.. దీనికి తోడు స్టేషన్ లోపల కమ్యూనికేషన్ సిస్టమ్ మొత్తం దెబ్బతినడంతో పోలీసుల్లో భయం పెరుగుతుంది. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరికి అనుమానం పెరుగుతుంది. చివరకు ప్రాణాలు దక్కించుకోవడానికి ఒకరినొకరు చంపుకొనే స్థితికి వస్తారు.

మరి పోలీసులపై పగ పెంచుకున్న ఆ అపరిచిత వ్యక్తి ఎవరు? చివరకు ఏమైంది? అన్నదే ఈ సినిమా కథ. ప్రస్తుతం ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న ఈ సినిమా పేరు శేష 2016. ఇదొక కన్నడ సినిమా. ప్రదీప్ అర్సికెరే తెరకెక్కించిన ఈ సినిమాలో దేవరాజ్, ప్రమోద్ శెట్టి, జాన్ కైప్పల్లిల్, శ్రీజిత్ రవి, దినేష్ మంగళూరు, సిడ్లింగు శ్రీధర్, శోభరాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం శేష 2016 సినిమా సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇప్పుడు కేవలం కన్నడ, మలయాళం భాషల్లోనే ఈ మూవీ అందుబాటులో ఉంది. త్వరలోనే తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడే చూడాలనుకునే వారు ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో మూవీని ఆస్వాదించవచ్చు.

ఇవి కూడా చదవండి

సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మెరుగైన విద్యకు కేరాఫ్. ఈస్ట్ పాయింట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్
మెరుగైన విద్యకు కేరాఫ్. ఈస్ట్ పాయింట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్
విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.33 కోట్లతో కొత్త స్కూళ్లు
విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.33 కోట్లతో కొత్త స్కూళ్లు
ఆపదలో భయాన్ని దాచడమే తెలివి.. మేకపోతు గాంభీర్యం కథ
ఆపదలో భయాన్ని దాచడమే తెలివి.. మేకపోతు గాంభీర్యం కథ
సిమెంట్ స్తంభాల కింద చితికిన కూలీల బతుకులు!
సిమెంట్ స్తంభాల కింద చితికిన కూలీల బతుకులు!
పీఎఫ్ వడ్డీ ఎలా లెక్కిస్తారు..? మీ అకౌంట్లోకి ఎంత వస్తుంది..?
పీఎఫ్ వడ్డీ ఎలా లెక్కిస్తారు..? మీ అకౌంట్లోకి ఎంత వస్తుంది..?
రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ సర్కార్ సూపర్ గుడ్‌న్యూస్
రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ సర్కార్ సూపర్ గుడ్‌న్యూస్
ప్రభాస్ మూవీలో ఆ సీన్ చేయను.. నా వల్ల కాదంటూ ఏడ్చేసిన హీరోయిన్..
ప్రభాస్ మూవీలో ఆ సీన్ చేయను.. నా వల్ల కాదంటూ ఏడ్చేసిన హీరోయిన్..
గొప్ప మనసు చాటుకున్న హీరో నిఖిల్.. 1000 మంది స్కూల్ పిల్లలకు..
గొప్ప మనసు చాటుకున్న హీరో నిఖిల్.. 1000 మంది స్కూల్ పిల్లలకు..
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్. ఈ పొరపాటు చేస్తే ఖాతా ఖాళీ..
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్. ఈ పొరపాటు చేస్తే ఖాతా ఖాళీ..
రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. మళ్లీ అకౌంట్లోకి డబ్బులు
రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. మళ్లీ అకౌంట్లోకి డబ్బులు