AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: 150 ఎన్‌కౌంటర్ల రియల్ పోలీస్ స్టోరీ.. OTT ట్రెండింగ్‌లో క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు

గత వారమే ఓటీటీలోకి వచ్చిన ఈ రియల్ క్రైమ్ స్టోరీ ఇప్పుడు ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. మొత్తం 10 ఎపిసోడ్లతో ఊహించని ట్విస్టులతో సాగే ఈ సిరీస్ తెలుగుతో సహా మొత్తం 7 భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుండడం విశేషం.

OTT Movie: 150 ఎన్‌కౌంటర్ల రియల్ పోలీస్ స్టోరీ.. OTT ట్రెండింగ్‌లో క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
OTT Movie
Basha Shek
|

Updated on: May 23, 2026 | 7:15 PM

Share

ఈ మధ్యన ప్రముఖ వ్యక్తుల జీవిత కథల ఆధారంగా బయోపిక్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అలాగే దేశంలో సంచలనం రేపిన కొన్ని నిజ జీవిత సంఘటనలు, నేరాల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ఓటీటీలో ఈ రియల్ స్టోరీలకు మంచి ఆదరణ దక్కుతోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఓ రియల్ పోలీస్ స్టోరీనే. ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖలో కరుడు గట్టిన గ్యాంగ్‌స్టర్లకు నిద్రలేకుండా చేసిన ఓ రియల్ సూపర్ కాప్ జీవితం ఆధారంగా ఈ సిరీస్ ను తెరకెక్కించాడు. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా గుర్తింపు పొందిన అతను తన సుదీర్ఘ కెరీర్‌లో దాదాపు 150 మంది మాఫియా డాన్లు, రౌడీలను ఎన్‌కౌంటర్ చేసి రికార్డు సృష్టించాడు. ఆ రియల్ పోలీస్ స్టోరీనే ఇప్పుడు వెబ్ సిరీస్ గా మన ముందుకు తీసుకొచ్చారు. గత వారమే ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన ఓ వెబ్ సిరీస్ ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఒరిజినల్ హిందీనే అయినా దక్షిణాది ఆడియెన్స్ కు తగ్గట్టుగానే ఇందులో మాస్ మసాలా ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. అలాగే అబ్బురపరిచే యాక్షన్ సీక్వెన్స్ లు కూడా ఉన్నాయి. మొత్తం 10 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ వంటి మొత్తం 7 భాషల్లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది.

ప్రస్తుతం ఓటటీలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోన్న ఈ వెబ్ సిరీస్ పేరు ఇన్ స్పెక్టర్ అవినాష్ సీజన్ 2. గతంలో వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన ఇన్‌స్పెక్టర్ అవినాష్ వెబ్ సిరీస్ కు ఇది రెండో భాగం. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అవినాష్ మిశ్రా నిజ జీవిత ఆధారంగా దీనిని తెరకెక్కించారు. నీరజ్ పాఠక్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణదీప్ హుడా లీడ్ రోల్ పోషించారు. అలాగే ఊర్వశి రౌటేలా అమిత్ సియాల్, అభిమన్యు సింగ్, జాకీర్ హుస్సేన్, రజనీష్ దుగ్గల్, ఫ్రెడ్డీ దారువాలా స్టార్స్ ఇందులో నటించారు. ప్రస్తుతం ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. వీకెండ్ లో ఓ మంచి క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ చూడాలనుకునేవారికి ఇన్ స్పెక్టర్ అవినాష్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

జియో హాట్ స్టార్ లో ఇన్ స్పెక్టర్ అవినాష్ సీజన్ 2.. తెలుగులోనూ స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us