AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Deevena: జబర్దస్త్ దీవెన గుర్తుందా? ఇప్పుడు మరింత క్యూట్‌గా మారిపోయిందిగా.. ఏం చేస్తుందంటే?

ఇప్పుడంటే జబర్దస్త్ లో పెద్దగా పిల్లలు కనిపించడం లేదు కానీ మొన్నటివరకు ఈ కామెడీ షోలో ఛైల్డ్ ఆర్టిస్టులు కూడా పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా రాకింగ్ రాకేష్ టీమ్ మొత్తమంతా చిన్న పిల్లలే కనిపించే వారు. తమ ముద్దు ముద్దు మాటలతో బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించే వారు.

Jabardasth Deevena: జబర్దస్త్ దీవెన గుర్తుందా? ఇప్పుడు మరింత క్యూట్‌గా మారిపోయిందిగా.. ఏం చేస్తుందంటే?
Jabardasth Deevena
Basha Shek
|

Updated on: May 23, 2026 | 7:59 PM

Share

జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 2013లో ప్రారంభమైన ఈ టీవీ షో ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూనే ఉంది. అప్పటితో పోల్చుకుంటే ఈ షోకు ఆదరణ తగ్గినప్పటికీ ఇప్పటికీ చాలా మంది ఈ షోను క్రమం తప్పకుండా చూస్తారు. జబర్దస్త్ షోకు ఉన్న మెయిన్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే. .ఈ షో ద్వారానే ఎంతో మంది నటీనటులు వెలుగులోకి వచ్చారు. ఈ షోలో చేసిన వాళ్లలో చాలా మంది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో బిజీ బిజీగా ఉంటున్నారు. కాగా మొన్నటివరకు ఈ కామెడీ షోలో చిన్న పిల్లలు కూడా కనిపించే వారు. ముఖ్యంగా రాకింగ్ రాకేష్ టీమ్ అయితే దాదాపు చిన్న పిల్లలతోనే స్కిట్స్ చేసేది. అలా జబర్దస్త్ లో ఛైల్ట్ ఆర్టిస్టులుగా చేసిన వారిలో యోధ, నిహాంత్, దీవెన, నరేష్, నెమలి రాజు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దీవెన గురించి. మరో ఛైల్డ్ ఆర్టిస్ట్ యోధాతో కలిసి ఈ చిచ్చర పిడుగు చేసిన స్కిట్స్ ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే.. జబర్దస్త్ లోకి వచ్చినప్పుడు దీవెనకు ఇంకా పళ్లు కూడా సరిగా రాలేదట. అయినా తన ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులను భలే ఆకట్టుకుందీ చిచ్చర పిడుగు. 2018లో జబర్దస్త్ లోకి వచ్చిన ఈ అమ్మాయి సుమారు మూడేళ్ల పాటు ఈ షోలో చేసింది. రాకింగ్ రాకేష్ టీమ్ తో కలిసి ప్రయాణం చేసింది.

అయితే కరోనా కాలంలో పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జబర్దస్త్ షో మేనేజ్మెంట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే.. ఈ మహమ్మారి బారిన పడకుండా ఛైల్డ్ ఆర్టిస్టులను ఇంటికే పరిమితం చేసింది. అలా దీవెన కూడా ఇంటి దగ్గరే ఉండిపోయింది. ఆ తర్వాత ఉన్నత చదువులు చదవాల్సి ఉండడంతో పూర్తిగా ఈ జబర్దస్త్ షోకు దూరమైపోయింది దీవెన. అయితే ఇప్పుడీ చిచ్చర పిడుగు మళ్లీ ఓ టీవీ షోలో సందడి చేస్తోంది. జెమినీ టీవీ ఛానెల్ లో ప్రసారమవుతోన్న మాస్ జాతర కామెడీ షోలో పార్టిసిపేట్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి
Jabardasth Deevena 1

Jabardasth Deevena 1

మాస్ జాతర టీవీ షోలో దీవెన..

View this post on Instagram

A post shared by @directorspage006

అయితే దీవెన ఇప్పుడు పెద్దదైంది. ఆమె లుక్, డ్రెస్సింగ్ స్టైల్‌లో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఈ ఛైల్డ్ ఆర్టిస్టుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది దీవెన. తన యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ పేజీల ద్వారా తన పర్సనల్ లైఫ్, ఈవెంట్స్, స్కిట్స్ గురించి అందులో ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. కాగా దీవెన ప్రస్తుతం ఏడో తరగతి చదువుతుందని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే.. తగ్గిందా? పెరిగిందా?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే.. తగ్గిందా? పెరిగిందా?
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు