AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Politics: గోదావరి టు కృష్ణా.. ఏపీలో మళ్లీ కాపు చిచ్చు.. ఏ పార్టీకి బిగుస్తుంది ఉచ్చు..?

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి కాపు రాజకీయాలు హాట్‌టాపిక్‌గా మారాయి. ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో టీడీపీ నేత బొండా ఉమ చేసిన వ్యాఖ్యలు కూటమిలో కలకలం రేపాయి. కాపు ఓటు బ్యాంక్‌పై అన్ని ప్రధాన పార్టీలు దృష్టి సారించిన వేళ, ఈ పరిణామం ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం చేకూరుస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

Andhra Politics: గోదావరి టు కృష్ణా.. ఏపీలో మళ్లీ కాపు చిచ్చు.. ఏ పార్టీకి బిగుస్తుంది ఉచ్చు..?
Kapu Politics
Shaik Madar Saheb
|

Updated on: Jul 27, 2026 | 9:50 PM

Share

మళ్లీ నైన్టీఫైవ్ చంద్రబాబును చూస్తారు, గీత దాటితే వాత తప్పదు.. అని చూపుడువేలితో హెచ్చరించడం, నెలలుగడుస్తున్నా క్రమశిక్షణా చర్యలు తీసుకోకుండా నాన్చడం, ఇష్యూ దానికై అదే చల్లబడ్డాక తూచ్ అనడం.. చంద్రబాబు స్టయిల్ ఆఫ్ ట్రబుల్ షూటింగ్ ఇదేనని తెలుగుదేశం పార్టీ లోపలాబైటా టాకుంది. సీబీఎన్ మార్క్ ఆఫ్ చాణక్యంలో ఇది కూడా ఒక పవర్‌ఫుల్ చాప్టర్ అని కూడా అంటారు. కానీ, సమస్య రెయిజై 24 గంటలు గడవకముందే త్రీమెన్ కమిటీ వేసి, తేల్చెయ్యండి అని హుకుం జారీ చేశారంటే, ఆ త్రీమెన్ కమిటీలో కిలారి రాజేష్‌ లాంటి కీ పర్సనాలిటికీ ఛాన్స్ ఇచ్చారంటే.. అది ఎంత జఠిలమైన సమస్య.. ఎంత త్వరగా తేల్చాల్సిన సమస్యో అర్థం చేసుకోవచ్చు. ఔను, కూటమిలో చెలరేగిన బొండా మాటల కలకలాన్ని సూపర్‌సెన్సిటివ్‌గా చూస్తోంది తెలుగుదేశం. కాపు సమాజంలో ఏర్పడ్డ డిస్టర్బెన్స్‌ని ఉన్నపళంగా డిలీట్ చెయ్యాల్సిన అవసరాన్ని గుర్తించినట్టుంది టీమ్ ఆఫ్ CBN.. జూలై 25.. గుంటూరు-వీవీ మందిర్.. ముద్రగడ సంతాప సభ…! కాపు జాయింట్ యాక్షన్ కమిటీ లీడ్ తీసుకుని, కాపు లీడర్లందరనీ ఒకచోట చేర్చే ప్రయత్నం. వేదిక కిందా, వేదిక మీదా కలిసి యాభైఅరవైమంది ప్రామినెంట్ కాపులీడర్లు హల్‌చల్ చేశారు. కాసేపు అలయ్‌బలయ్ ఆడుకున్నారు. కెమెరాలు ఫోకస్ చేసింది, సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది మాత్రం ఆ ఒక్క కార్నర్ మీదికే. టీడీపీ నేత-ప్రభుత్వ విప్ బొండా ఉమ, వైసీపీ నేత-మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆత్మీయ...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి