రాత్రిపూట జామపండు ఎందుకు తినకూడదు..?
01 October 2026
TV9 Telugu
TV9 Telugu
జామపండులో విటమిన్ సి, పొటాషియం, శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి
TV9 Telugu
రోగనిరోధక శక్తిని పెంచడంలో, ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించడంలో ముందుంటుంది. చర్మ సంరక్షణలోనూ, మలబద్ధకాన్ని నివారించడంలోనూ దివ్యౌషధమే
TV9 Telugu
కానీ కొందరు ఈ పండుకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. జామలోని కొన్ని బయోయాక్టివ్ సమ్మేళనాలు అలెర్జీని కలిగిస్తాయి
TV9 Telugu
ముఖ్యంగా, సున్నితమైన చర్మం ఉన్నవాళ్లలో దురద, మంట, చర్మం ఎర్రబడటం లాంటి సమస్యలు ఎదురవుతాయి
TV9 Telugu
నిద్రపోయే ముందు జామపండు తినడం మంచిదికాదట. ఎందుకంటే, ఈ పండ్లలో ఫ్రక్టోజ్, విటమిన్ సి అధికంగా ఉంటాయి
TV9 Telugu
వీటిని ఎక్కువగా తింటే గ్యాస్, కడుపు ఉబ్బరం కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడేవారు జామపండ్లను తినకపోవడమే మంచిది
TV9 Telugu
జామపండు గింజల్లో ఆక్సలేట్లు ఉంటాయి. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారికి ఇవి మరింత ఇబ్బంది కలిగిస్తాయి
TV9 Telugu
కాబట్టి వారు జామపండ్లను ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది. ఒకవేళ తిన్నా, గింజలు లేకుండా తీసుకోవాలి
మరిన్ని వెబ్ స్టోరీస్
చూస్తేనే నోరూరుతుంది కదూ.. తింటే లాభాలూ ఉన్నాయ్
కుండ Vs ఫ్రిజ్.. ఎండల్లో ఏ నీళ్లు ఆరోగ్యానికి మంచిది?
పెరుగు త్వరగా పులుస్తుందా? మీ వంటగదిలో ఈ చిన్న మార్పు చేయండి