AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anil Ravipudi: అప్పుడే అయిపోయిందా.. అనిల్ రావిపూడి దూకుడు

Anil Ravipudi: అప్పుడే అయిపోయిందా.. అనిల్ రావిపూడి దూకుడు

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 27, 2026 | 8:55 PM

Share

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, కళ్యాణ్‌రామ్ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రెగ్యులర్ షూట్ ప్రారంభమైన కొద్ది రోజులకే తొలి షెడ్యూల్ పూర్తవగా, అక్టోబర్ నాటికి చిత్రీకరణ ముగించి సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇదెక్కడి స్పీడ్ సామీ.. వందేభారత్ కంటే వేగంగా ఉన్నావుగా అంటున్నారు అనిల్ రావిపూడిని చూసి అభిమానులు..! తాను తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ గురించి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు ఈ దర్శకుడు. ఈ ప్రాజెక్ట్ ఇలా మొదలైందో లేదో అప్పుడే ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే న్యూస్ చెప్పారు అనిల్ రావిపూడి. మరి అదేంటో క్లారిటీగా చూద్దామా..? షూటింగ్ మొదలుపెట్టే వరకే కాస్త స్లో.. ఒక్కసారి స్టార్ట్ అయ్యాక జెట్ స్పీడ్ అందుకుంటారు అనిల్ రావిపూడి. వెంకటేష్, కళ్యాణ్‌రామ్ హీరోలుగా ఆయన చేస్తున్న మల్టీస్టారర్ షూట్ వేగంగా జరుగుతుంది. తాజాగా ఫస్ట్‌షెడ్యూల్ అయిపోయింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి కావాల్సినంత ప్రమోషనల్ స్టఫ్ విడుదల చేసారు అనిల్. పటాస్ తర్వాత పదేళ్లు గ్యాప్ తీసుకుని కళ్యాణ్ రామ్‌తో మరోసారి వర్క్ చేస్తున్నారు అనిల్. ఇందులో వెంకీతో సమానమైన రోల్ చేస్తున్నారీయన. వెంకటేష్‌కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంటే.. కళ్యాణ్ రామ్‌కు జోడీగా కృతి శెట్టిని తీసుకున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుంది ఈ చిత్రం. జూన్ 22కు రెగ్యులర్ షూట్ మొదలైంది.. అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ పూర్తైంది. కొన్నేళ్లుగా బాక్సాఫీస్‌ దగ్గర సంక్రాంతి అల్లుడిగా మారిన అనిల్.. ఈసారి అదే చేయాలని చూస్తున్నారు. వెంకీ, కళ్యాణ్ రామ్ సినిమాపై అంచనాలైతే మామూలుగా లేవు. అక్టోబర్ నాటికి షూట్ పూర్తి చేసి.. సంక్రాంతి విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి అనిల్ రావిపూడి ఈసారి ఎలాంటి సంచలనంతో రాబోతున్నారో చూడాలిక.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

PM Modi: లీకు వీరులకు మోదీ సర్కార్ మాస్టర్ స్ట్రోక్

కెమెరామెన్‌కి బంపరాఫర్‌.. యువకుడిని పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు!

బంధువుల మెప్పు కోసం అంత ఖర్చు అవసరమా!

Weather Update: దూసుకొస్తున్న వాయు‘గండం’.. దంచికొట్టనున్న వర్షాలు.. వచ్చే మూడు రోజులు ముసురే

Cyber Crime:పార్శిల్‌ వచ్చింది.. రూ.22 పే చేయమని మెసేస్‌ వచ్చిందా.. అయితే.. బీ అలర్ట్!

Follow Us