AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలో ‘హల్లల్లల్లో’ అంటూ అదరగొట్టేసింది.. ఎవరీ బ్యూటిఫుల్ సింగర్?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'పెద్ది' సినిమా నుంచి మూడో పాట వచ్చేసింది. ‘హల్లల్లల్లో' అంటూ లిరిక్స్ తో సాగే ఈ హుషారైన సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ముఖ్యంగా ఈ సాంగ్ లో ఒక లేడీ సింగర్ హస్కీ వాయిస్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

Peddi Movie: 'పెద్ది' సినిమాలో ‘హల్లల్లల్లో’ అంటూ అదరగొట్టేసింది.. ఎవరీ బ్యూటిఫుల్ సింగర్?
Peddi Movie
Basha Shek
|

Updated on: May 24, 2026 | 6:15 PM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా పెద్ది. బుచ్చిబాబు సనా తెరకెక్కించిన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు త్రిపాఠి, జగపతిబాబు, సత్య తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న పెద్ది జూన్ 04న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇప్పటికే రిలీజైన సాంగ్స్ , ట్రైలర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆదివారం (మే 24) ఉదయం ‘హల్లల్లల్లో’ అంటూ మరో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమన్ స్వరపరిచిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించగా… రక్షిత సురేష్ పాడింది. అలాగే జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. అయితే ఓ డిఫరెంట్ వాయిస్ తో ఈ పాట పాడిన సింగర్ రక్షిత సురేష్ పేరు కూడా ఇప్పుడు నెట్టింట మార్మోగుతుంది.

కర్ణాటకలోని మైసూరుకు చెందిన రక్షిత కర్ణాటక సంగీతం, హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంతోపాటు లైట్‌ మ్యూజిక్‌లో శిక్షణ తీసుకుంది. కన్నడలో ‘రిథమ్‌ తధీమ్‌’, ‘లిటిల్‌ స్టార్‌ సింగర్‌-2009’ టైటిల్‌ గెలిచిన ఆమె.. తమిళంలో ‘సూపర్‌ సింగర్‌ 6’ ఫస్ట్‌ రన్నరప్‌గా నిలిచింది. ఇక రక్షిత సినీ ప్రయాణం తెలుగు పాటతోనే ప్రారంభమైంది. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ (2015)లోని ‘చల్లగాలి తాకుతున్న మేఘమైనదీ మనసిలా’ అనే పాటను ఆలపించింది రక్షితనే. అలాగే ‘లవ్‌స్టోరీ’లోని ముత్యాల చెమ్మ చెక్క పాటను కూడా ఈ బ్యూటిఫుల్ సింగర్ పాడింది. ‘జవాన్‌’లోని ‘రామయ్యా వస్తావయ్యా’, ‘ది లెజెండ్‌’లోని ‘తొలి తొలి ఆశల ఊసులే’ తెలుగు వెర్షన్స్ సాంగ్ కూడా రక్షిత గొంతు నుంచి వచ్చిందే.

ఇవి కూడా చదవండి

పెద్ది ఈవెంట్ లో రక్షితా సురేష్..

రక్షితకు ఏఆర్‌ రెహమాన్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఎక్కువగా ఆయన సంగీత దర్శకత్వంలోనే పాటలు పాడిందామె. రెహమాన్‌ సంగీతం అందించిన ‘లైఫ్‌ ఆఫ్‌ ముత్తు’, ‘కోబ్రా’, ‘పొన్నియిన్‌ సెల్వన్‌’, ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’, ‘మామన్నన్‌’, ‘ఆడు జీవితం’, ‘థగ్‌లైఫ్‌’ తదితర చిత్రాల్లో రక్షిత తన గాత్రంతో ఆకట్టుకుంది. రెహమాన్‌ కాన్సర్ట్‌ల్లోనూ ఈ బ్యూటీ సందడి చేస్తుంటుంది. అలాగే హిప్‌హాప్‌ తమిళ, జీవీ ప్రకాశ్‌కుమార్‌, యువన్‌ శంకర్‌రాజా తదితర స్టార్ మ్యూజిక్‌ డైరెక్టర్లతోనూ రక్షిత పని చేసింది. ఇప్పుడు పెద్ది సినిమాలో ఉత్తరాంధ్ర యాసతో కూడిన ‘హల్లల్లల్లో’ పాటతో మరోసారి సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది రక్షిత.

‘హల్లల్లల్లో’ సాంగ్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us