AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aishwarya Rajesh: ఐశ్వర్యా రాజేష్‌ తండ్రి, ఇద్దరు అన్నయ్యలు ఎలా చనిపోయారో తెలుసా? పాపం చిన్న వయసులోనే..

  అందం, అభినయం పుష్కలంగా ఉన్నా అదృష్టం లేని హీరోయిన్లలో ఐశ్వర్యా రాజేష్ ఒకరు. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కూడా ఈ అమ్మడు ఒక్క తెలుగు సినిమాలోనూ కనిపించలేదు. ఈ బ్యూటీ ప్రొఫెషనల్ లైఫ్ తో పాటు పర్సనల్ లైఫ్ కూడా ఒడిదొడుకుల మయయే అని చెప్పుకోవచ్చు.

Aishwarya Rajesh: ఐశ్వర్యా రాజేష్‌ తండ్రి, ఇద్దరు అన్నయ్యలు ఎలా చనిపోయారో తెలుసా? పాపం చిన్న వయసులోనే..
Actress Aishwarya Rajesh
Basha Shek
|

Updated on: May 26, 2026 | 9:49 PM

Share

ఐశ్వర్యా రాజేష్‌ పక్కా తెలుగు అమ్మాయి. అయినా తమిళంలోనే స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది. అక్కడే ఆమెకు స్టార్‌డమ్, పాపులారిటీ ఎక్కువగా ఉంది. అప్పుడప్పుడు తెలుగులోనూ సినిమాలు చేస్తున్నా స్టార్ హీరోయిన్ రేంజ్ కు మాత్రం ఎదగలేకపోతోంది. విక్టరీ వెంకటేష్ తో కలసి ఆమె నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఐశ్వర్య నటన కూడా అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా రిలీజై ఏడాదిన్నర గడుస్తున్నా ఐశ్వర్య నుంచి మరో తెలుగు సినిమా రాలేదు. అయితే తమిళంలో మాత్రం మూడు, నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోందీ అందాల తార. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఐశ్వర్య రాజేష్ తన పర్సనల్ లైఫ్ లో ఎన్నో ఒడిదొడుకులు ఎదర్కొంది. 8 ఏళ్ల వయసులోనే తండ్రి ప్రేమకు దూరమైంది. ఆ తర్వాత టీనేజ్ లో ఇద్దరు అన్నయ్యలను కోల్పోయింది. దీంతో ఆమె మేనత్త, ప్రముఖ కమెడియన్ శ్రీలక్ష్మి ఐశ్వర్యను చేరదీసింది.

ఐశ్వర్యా రాజేష్‌ తండ్రి రాజేష్‌ కూడా తెలుగులో హీరోగా చేశారు. పలు సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేశార. నెలవంకతో మొదలైంది రాజేష్ ప్రయాణం. ఆ తర్వా రెండు జళ్ల సీత, ఆనంద భైరవి సినిమాల్లోనూ హీరోగా నటించారు. కేవలం హీరోగానే కాకుండా పలు సూపర్ హిట్ సినిమాల్లో విలన్ గానూ, సహాయక నటుడిగానూ కనిపించారు రాజేష్. మొత్తానికి యాభైకి పైగా సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారాయన. అయితే నటుడిగా రాణిస్తున్న సమయంలోనే తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు రాజేష్. కాలేయ సమస్యలతో కేవలం 38 ఏళ్ల వయసులోనే కన్నుమూశారు. అప్పటికి ఐశ్వర్య రాజేష్‌ వయసు కేవలం‌ ఎనిమిదేళ్లు మాత్రమే. దీంతో ఐశ్వర్య తల్లి LIC ఏజెంట్ గా మారి ఇంటిని పోషిస్తూ వచ్చింది. నలుగురు పిల్లల్ని పోషించి పెద్దవాళ్లను చేసింది. అయితే ఫ్యామిలీ అంతా కుదురుకుంటున్న సమయంలోనే ఉద్యోగం చేస్తోన్న ఐశ్వర్యా రాజేష్ సోదరుడు రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. ఆ మరసటి ఏడాదే మరో అన్నయ్య కూడా చనిపోవడంతో ఐశ్వర్య తీవ్ర మనోవేదనకు గురైంది. అయినా అన్నిటినీ అధిగమించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఐశ్వర్య. నిజంగా ఆమె ప్రయాణం నేటి తరం అమ్మాయిలకు స్ఫూర్తి దాయకం అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఐశ్వర్యా రాజేష్‌ తండ్రి, ఇద్దరు అన్నయ్యలు ఎలా చనిపోయారో తెలుసా?
ఐశ్వర్యా రాజేష్‌ తండ్రి, ఇద్దరు అన్నయ్యలు ఎలా చనిపోయారో తెలుసా?
ఇంటికి ఈ దిశల్లో బంతి మొక్కలు పెంచితే.. లక్ష్మీదేవి అనుగ్రహంతో
ఇంటికి ఈ దిశల్లో బంతి మొక్కలు పెంచితే.. లక్ష్మీదేవి అనుగ్రహంతో
వర్కౌట్స్ చేసేప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. లేదంటే
వర్కౌట్స్ చేసేప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. లేదంటే
IPL చరిత్రలోనే సంచలనం.. తోపు రికార్డ్‌ను బద్దలు కొట్టిన రబాడా
IPL చరిత్రలోనే సంచలనం.. తోపు రికార్డ్‌ను బద్దలు కొట్టిన రబాడా
90 కేజీల నుంచి 45 కేజీలు తగ్గిన హీరోయిన్..
90 కేజీల నుంచి 45 కేజీలు తగ్గిన హీరోయిన్..
వేరుశనగ పొట్టును పారేస్తున్నారా? ఈ 7 అద్భుతమైన ఉపయోగాలు తెలిస్తే
వేరుశనగ పొట్టును పారేస్తున్నారా? ఈ 7 అద్భుతమైన ఉపయోగాలు తెలిస్తే
ఖాకీ ఓవర్ యాక్షన్.. న్యాయం కోసం వస్తే అడవిలో వదిలేసిన ఎస్సై..
ఖాకీ ఓవర్ యాక్షన్.. న్యాయం కోసం వస్తే అడవిలో వదిలేసిన ఎస్సై..
లక్ష్మీదేవిని దూరం చేసి దరిద్రాన్ని తెచ్చే పెద్ద తప్పు ఇదే!
లక్ష్మీదేవిని దూరం చేసి దరిద్రాన్ని తెచ్చే పెద్ద తప్పు ఇదే!
ఫేమస్ అయ్యేందుకు రోడ్లపై స్టంట్స్ చేస్తూ రెచ్చిపోయాడు..కట్‌చేస్తే
ఫేమస్ అయ్యేందుకు రోడ్లపై స్టంట్స్ చేస్తూ రెచ్చిపోయాడు..కట్‌చేస్తే
రూ.200 కోట్లకు పైగా ఆస్తులు.. సొంతంగా ప్రైవేట్ జెట్..
రూ.200 కోట్లకు పైగా ఆస్తులు.. సొంతంగా ప్రైవేట్ జెట్..