AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karuppu Movie: ఏంటి! ‘కరుప్పు’ సినిమాలో ఆ స్టార్ హీరో నటించాల్సిందా? 300 కోట్ల సినిమా మిస్ చేసుకున్నాడు

కోలీవుడ్ స్టార్ హీరో నటించిన లేటెస్ట్ సినిమా కరుప్పు. తెలుగులో వీరభద్రుడిగా రిలీజైంది. ఇప్పటికే 250 కోట్లకు పైగా సాధించి 300 కోట్ల వైపు వేగంగా అడుగులు వేస్తోన్న ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే..

Karuppu Movie: ఏంటి! 'కరుప్పు' సినిమాలో ఆ స్టార్ హీరో నటించాల్సిందా? 300 కోట్ల సినిమా మిస్ చేసుకున్నాడు
Karuppu Movie
Basha Shek
|

Updated on: May 26, 2026 | 8:03 PM

Share

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చాలా రోజుల తర్వాత ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఆయన నటించిన లేటెస్ట్ సినిమా కరుప్పు ( తెలుగులో వీరభద్రుడు) బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. మే 15న రిలీజైన ఈ సినిమా ఇప్పటికే రూ. 250 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. 300 కోట్ల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో త్రిష హీరోయిన్‌గా నటించింది. దర్శకుడు ఆర్జే బాలాజీనే విలన్ గా నటించడం విశేషం. వీరితో పాటు ఇంద్రాన్స్, అనాఘా, మన్సూర్ అలీఖాన్, జార్జి మరియన్, ఆడుకలం నరేన్ తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోన్న ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. దర్శకుడు కరుప్పు సినిమా కథను మొదట టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు చెప్పినట్లు ప్రచారం జరిగింది. అందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఇప్పుడు ఈ మూవీ గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

డైరెక్టర్ ఆర్.జె. బాలాజీ ఈ కథను మొదట తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ కోసం రాసుకున్నారట. 2023 ఆగస్టులో బాలాజీ, విజయ్‌ను కలిసి కథ వినిపించారట. కథ వినగానే విజయ్ కూడా ఎంతో ఎగ్జైట్ అయ్యారట. మనమే ఈ సినిమ చేద్దాం అని గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారట. విజయ్ లాంటి స్టార్ హీరో తన కథకు ఓకే చెప్పడంతో బాలాజీ తెగ సంబరపడిపోయాడట. అయితే అసలు స్టోరీ ఇక్కడే మొదలైంది. బాలాజీ ఫుల్ స్క్రిప్ట్ కోసం చాలా టైమ్ తీసుకున్నాడట. ఇఇంతలోనే విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చేశాడట. టీవీకే పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్లారట. దీంతో బాలాజీ విజయ్ కోసం రాసుకున్న కథతో సూర్యను సంప్రదించారట. డిఫరెంట్ కాన్సెప్ట్ కావడంతో సూర్య కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. అలా కరుప్పు సినిమా పట్టాలెక్కిందట. ఇక ఆ తర్వాత తెలిసిందే. ఈ సినిమా సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

డ్రీమ్ వారియర్ బ్యానర్ పై తెరకెక్కిన కరుప్పు సినిమాలో ఇంద్రాన్స్, అనాఘా, మన్సూర్ అలీఖాన్, జార్జి మరియన్, ఆడుకలం నరేన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సాయి అభ్యంకర్ స్వరాలు సమకూర్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఏడేళ్ల చిన్నారి మహాదానం.. అవయవదానం చేసి ఆరుగురికి కొత్త జీవితం
ఏడేళ్ల చిన్నారి మహాదానం.. అవయవదానం చేసి ఆరుగురికి కొత్త జీవితం
మెరుగైన విద్యకు కేరాఫ్. ఈస్ట్ పాయింట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్
మెరుగైన విద్యకు కేరాఫ్. ఈస్ట్ పాయింట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్
విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.33 కోట్లతో కొత్త స్కూళ్లు
విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.33 కోట్లతో కొత్త స్కూళ్లు
ఆపదలో భయాన్ని దాచడమే తెలివి.. మేకపోతు గాంభీర్యం కథ
ఆపదలో భయాన్ని దాచడమే తెలివి.. మేకపోతు గాంభీర్యం కథ
సిమెంట్ స్తంభాల కింద చితికిన కూలీల బతుకులు!
సిమెంట్ స్తంభాల కింద చితికిన కూలీల బతుకులు!
పీఎఫ్ వడ్డీ ఎలా లెక్కిస్తారు..? మీ అకౌంట్లోకి ఎంత వస్తుంది..?
పీఎఫ్ వడ్డీ ఎలా లెక్కిస్తారు..? మీ అకౌంట్లోకి ఎంత వస్తుంది..?
రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ సర్కార్ సూపర్ గుడ్‌న్యూస్
రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ సర్కార్ సూపర్ గుడ్‌న్యూస్
ప్రభాస్ మూవీలో ఆ సీన్ చేయను.. నా వల్ల కాదంటూ ఏడ్చేసిన హీరోయిన్..
ప్రభాస్ మూవీలో ఆ సీన్ చేయను.. నా వల్ల కాదంటూ ఏడ్చేసిన హీరోయిన్..
గొప్ప మనసు చాటుకున్న హీరో నిఖిల్.. 1000 మంది స్కూల్ పిల్లలకు..
గొప్ప మనసు చాటుకున్న హీరో నిఖిల్.. 1000 మంది స్కూల్ పిల్లలకు..
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్. ఈ పొరపాటు చేస్తే ఖాతా ఖాళీ..
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్. ఈ పొరపాటు చేస్తే ఖాతా ఖాళీ..