AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఏడాదిన్నర తర్వాత ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు బోల్డ్ సినిమా.. IMDBలో 8.7 రేటింగ్.. పిల్లలతో చూడొద్దు

బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా యూత్ ను బాగానే ఆకట్టుకుంది. అయితే సినిమాలో మరీ బూతులు ఎక్కువగా ఉండడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ దూరమయ్యారు. ఇప్పుడీ సినిమా సుమారు ఏడాదిన్నర తర్వాత ఇవాళ్టి (మే 27) నుంచే ఓటీటీలోకి వచ్చింది.

OTT Movie: ఏడాదిన్నర తర్వాత ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు బోల్డ్ సినిమా.. IMDBలో 8.7 రేటింగ్.. పిల్లలతో చూడొద్దు
OTT Movie
Basha Shek
|

Updated on: May 27, 2026 | 3:53 PM

Share

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు రానున్నాయి. తెలుగుతో పాటు హిందీ, కన్నడం, తమిళం, మలయాళం, ఇంగ్లిష్ భాషలకు చెందిన సినిమాల, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఇప్పటికే కమెడియన్ సత్య నటించిన జెట్లీ మూవీ స్ట్రీమింగ్ అవుతుండగా.. ధనుష్ కర, లీడర్, ఫేసెస్ సినిమాలు ఈ వారమే స్ట్రీమింగ్ కు రానున్నాయి. అలాగే కజిన్స్ అండ్ కల్యాణమ్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్ లాంటి వెబ్ సిరీసులు కూడా ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. అయితే వీటి కంటే ముందే ఓ తెలుగు సినిమా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఆ మధ్యన భార్యతో గొడవపడి వార్తల్లో నిలిచిన ధర్మ మహేష్ హీరోగా నటించిన సినిమా డ్రింకర్ సాయి. ‘బ్రాండ్‌ ఆఫ్‌ బ్యాడ్‌ బాయ్స్‌’ అనేది ఈ మూవీ క్యాప్షన్. దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాడు. బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాలో ఐశ్వర్య శర్మ హీరోయిన్ గా చేసింది. 2024 డిసెంబరు 27న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఓ మోస్తరుగా ఆడింది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాను బాగానే చూశారు. ఇప్పుడీ సినిమా సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా.

డ్రింకర్ సాయి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు జీ5 ఓటీటీ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో బుధవారం (మే 27) నుంచి ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అంటే థియేటర్లలో రిలీజైన ఏడాదిన్నరకు ఈ సినిమా ఓటీటీలోకి రావడం విశేషం. డ్రింకర్ సాయి సినిమాలో హీరో, హీరోయిన్లతో పాటు పోసాని కృష్ణ మురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్ ఎస్.ఎస్. కాంచి, భద్రం, కిర్రాక్ సీత, రీతూ చౌదరి, ఫన్ బకెట్ రాజేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ ఈ సినిమాను నిర్మించారు .శ్రీవసంత్‌ స్వరాలు సమకూర్చారు. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? అయితే టైమ్ పాస్ కోసం ఒక లుక్కేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

జీ5 ఓటీటీలో డ్రింకర్ సాయి సినిమా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us