AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చలి నుంచి మొక్కలను రక్షించాలి.. ఈ టిప్స్‌ పాటిస్తేనే హెల్తీగా ఎదుగుతాయి..!

శీతాకాలంలో చల్లని వాతావరణం, తక్కువ సూర్యరశ్మి కారణంగా మొక్కలపై తెల్లని బూజు, పేనుబంక, చిన్న పురుగులు, గొంగళి పురుగులు చేరే ప్రమాదం పెరుగుతుంది. వీటిని నివారించడానికి బయట ఖరీదైన రసాయన క్రిమిసంహారకాలు కొనాల్సిన అవసరం లేదు. ఒక గ్లాసు నీటిలో గుప్పెడు బియ్యం వేసి, దానికి అర చెంచా బేకింగ్ సోడా, ఒక చెంచా వెనిగర్ కలిపి 10 నుంచి 12 గంటల పాటు మూత పెట్టి ఉంచాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని వడకట్టి, ఒక లీటరు సాధారణ నీటిలో కలపాలి. ఈ సహజ ద్రావణాన్ని మొక్కలపై పిచికారీ చేస్తే చీడపీడలు దూరమవడమే కాకుండా, మొక్కలు ఆరోగ్యంగా ఎదిగి పూలు, పండ్లు బాగా కాస్తాయి.

చలి నుంచి మొక్కలను రక్షించాలి.. ఈ టిప్స్‌ పాటిస్తేనే హెల్తీగా ఎదుగుతాయి..!
Winter Plant Care
Jyothi Gadda
|

Updated on: Nov 20, 2026 | 3:53 PM

Share

చలికాలం రాగానే ప్రకృతిలో వాతావరణం మారుతుంది. ఈ సీజన్‌లో చలి తీవ్రతతో పాటు సూర్యరశ్మి లభించే సమయం కూడా కొంత తగ్గుతుంది. దీని ప్రభావం ఇంటి పెరటి లేదా బాల్కనీలోని మొక్కలపై స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా శీతాకాలంలో మొక్కల ఆకులు, కాండాలపై తెల్లని బూజు పట్టడం, పేనుబంక వంటి సూక్ష్మ పురుగులు, చిన్న అడవి పురుగులు చేరడం సాధారణ సమస్యగా మారుతుంది. సరైన సమయంలో వీటిని అరికట్టకపోతే మొక్కలు క్రమంగా దెబ్బతిని ఎండిపోయే ప్రమాదం ఉంటుంది.

ఇటువంటి సమస్యలను తగ్గించడానికి మార్కెట్‌లో దొరికే ఖరీదైన రసాయన క్రిమిసంహారకాలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా, ఇంట్లో సులభంగా దొరికే పదార్థాలతోనే చక్కని సహజ ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు.

ఇంట్లోనే సహజ క్రిమిసంహారకం తయారీ విధానం

ముందుగా ఒక గ్లాసు నీటిని తీసుకుని, అందులో సుమారు ఒక గుప్పెడు బియ్యం వేయాలి. బియ్యం నానిన నీరు మొక్కలకు పోషకంగా ఉపయోగపడుతుంది.

ఇవి కూడా చదవండి

ఆ నీటిలో అర చెంచా బేకింగ్ సోడా కలపాలి. బేకింగ్ సోడా మట్టి స్వభావాన్ని మెరుగుపరచడానికి, ఫంగస్ సమస్యను తగ్గించడానికి తోడ్పడుతుంది.

అనంతరం అందులో ఒక చెంచా వెనిగర్ వేసి, పదార్థాలన్నీ బాగా కలిసేలా కలపాలి.

ఈ మిశ్రమాన్ని మూత పెట్టి 10 నుంచి 12 గంటల పాటు అలాగే ఉంచాలి.

ఎలా ఉపయోగించాలి?

10 నుంచి 12 గంటల తర్వాత ఆ మిశ్రమాన్ని శుభ్రంగా వడకట్టాలి. వడకట్టిన ద్రావణానికి సుమారు ఒక లీటరు సాధారణ నీటిని కలపాలి. ఇలా సిద్ధమైన ద్రావణాన్ని స్ప్రే బాటిల్ సహాయంతో మొక్కల ఆకులు, రెమ్మలపై తేలికగా పిచికారీ చేయాలి.

ఈ సహజ ద్రావణాన్ని క్రమం తప్పకుండా పిచికారీ చేయడం వల్ల శీతాకాలంలో వచ్చే తెల్లని బూజు, చిన్న పురుగుల బెడద తగ్గుతుంది. అంతేకాకుండా మొక్కల ఎదుగుదల మెరుగుపడి, పూలు మరియు పండ్లు కూడా సమృద్ధిగా వచ్చేందుకు ఇది సహాయపడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us