AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టైల్స్‌ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ సింపుల్ చిట్కాలతో కొత్తవాటిలా మెరిపించండి!

ఇళ్లలో సాధారణంగా ఎంతగా శుభ్రం చేసినా టైళ్ల మధ్య ఉండే నల్లటి గీతలు మాత్రం అలాగే మురికిగా కనిపిస్తుంటాయి. దీనికి కేవలం దుమ్ము, ధూళి మాత్రమే కాకుండా తేమ, సబ్బు అవశేషాలు, ఫంగస్ వంటివి ప్రధాన కారణాలుగా మారుతుంటాయి. ఈ సమస్యను నివారించడానికి గోరువెచ్చని నీటిలో కొద్దిగా మైల్డ్ క్లీనర్ కలిపి, మృదువైన నైలాన్ బ్రష్‌తో స్మూత్‌గా రుద్ది శుభ్రం చేయాలి. అలాగే బాత్రూమ్ లేదా వంటింట్లో గాలి వెలుతురు సరిగ్గా ఉండేలా చూసుకోవడం, తేమ పేరుకుపోకుండా చూసుకోవడం ద్వారా టైళ్ల మధ్య గీతలు నల్లగా మారకుండా కాపాడుకోవచ్చు.

టైల్స్‌ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ సింపుల్ చిట్కాలతో కొత్తవాటిలా మెరిపించండి!
How To Clean Tile Grout
Jyothi Gadda
|

Updated on: Nov 17, 2026 | 11:43 AM

Share

ఇల్లు ఎంత శుభ్రంగా ఉన్నప్పటికీ, ఫ్లోర్ టైళ్ల మధ్య ఉండే సన్నని గీతలు మాత్రం నల్లగా మారి ఇంటి అందాన్ని పాడు చేస్తుంటాయి. వీటిని శుభ్రం చేయడానికి గంటల తరబడి బ్రష్‌తో రుద్దినా చాలాసార్లు ఆశించిన ఫలితం లభించదు. దీని వెనుక కేవలం దుమ్ము మాత్రమే కాకుండా తేమ, సబ్బు అవశేషాలు, ఫంగస్ ప్రధాన కారణాలుగా ఉంటాయి. టైళ్లతో పాటు వాటి మధ్య ఉన్న భాగాన్ని కూడా సులభంగా ఎలా మెరిపించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

టైళ్ల మధ్య గీతలు ఎందుకు నల్లగా మారుతాయి?

టైల్స్‌ మధ్య వాడే సిమెంట్ గ్రానైట్‌ సాధారణంగా రంధ్రాలను కలిగి ఉంటుంది. అంటే ఇందులో తేమ, నీరు, మురికి సులభంగా ఇంకిపోతాయి. బాత్రూమ్‌లలో నిరంతరం తేమ ఉండటం వల్ల అక్కడ ఫంగస్ లేదా బూజు త్వరగా పెరుగుతుంది. దీనికి తోడు స్నానానికి వాడే సబ్బులు, షాంపూల అవశేషాలు ఆ ప్రాంతంలో పేరుకుపోయి మురికిని మరింత ఆకర్షిస్తాయి.

శుభ్రం చేసే సరైన విధానం:

ఎప్పుడైనా సరే శుభ్రపరిచే ప్రక్రియను సున్నితంగా ప్రారంభించాలి. మొదటగా గోరువెచ్చని నీటిలో కొద్దిగా న్యూట్రల్ క్లీనర్ లేదా డిటర్జెంట్ కలపాలి. ఈ ద్రావణాన్ని నల్లగా మారిన గీతల మీద వేసి కొన్ని నిమిషాలు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత మృదువైన కానీ గట్టిగా ఉండే నైలాన్ బ్రష్‌తో ఆ లైన్ల మీద మెల్లిగా రుద్దాలి. చివరగా శుభ్రమైన నీటితో కడిగి పొడి గుడ్డతో తుడవాలి. ఫంగస్ లేదా బూజు గుర్తులు ఎక్కువగా ఉంటే, ప్రత్యేకమైన మోల్డ్‌ క్లీనర్‌లను ఉపయోగించవచ్చు. అయితే ఏకకాలంలో వేర్వేరు కెమికల్స్ లేదా బ్లీచ్‌లను మాత్రం ఎప్పుడూ కలపకూడదు.

ఇవి కూడా చదవండి

శుభ్రం చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

టైల్స్‌ మధ్య భాగాన్ని ఎప్పుడూ పొడిగా ఉంచడానికి గదిలో గాలి వెలుతురు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. బాత్రూమ్ వాడిన తర్వాత ఫ్లోర్ పై నిలిచిన నీటిని తొలగించడం ద్వారా తేమ ఎక్కువ సేపు ఉండకుండా నివారించవచ్చు. అత్యంత బలమైన యాసిడ్స్ లేదా హార్డ్ కెమికల్స్‌ను పదే పదే వాడటం వల్ల గ్రానైట్‌ దెబ్బతినే ప్రమాదం ఉంది.

గ్రానైట్ పూర్తిగా పాడైపోతే ఏం చేయాలి?

ఒకవేళ టైళ్ల మధ్య ఉన్న సిమెంట్ పూర్తిగా పగిలిపోయినా, ఊడిపోతున్నా లేదా ఎంత శుభ్రం చేసినా నలుపు పోకపోతే కేవలం రుద్దడం వల్ల ప్రయోజనం ఉండదు. అలాంటి సమయంలో పాత గ్రానైట్‌ ను పూర్తిగా తొలగించి కొత్తది వేయించుకోవడం మంచిది. పూర్తిగా ఎండిన సిమెంట్ గ్రానైట్ నాణ్యమైన గ్రానైట్‌ సీలర్ పూయడం ద్వారా భవిష్యత్తులో మురికి, తేమ లోపలికి వెళ్లకుండా కాపాడుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us