AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalyan Ram: నందమూరి కల్యాణ్ రామ్ కుమారుడిని చూశారా? కిక్ బాక్సింగ్‌లో అదరగొడుతున్నాడు.. వీడియో

నందమూరి కల్యాణ్ రామ్ ఓ వైపు హీరోగానే కాకుండా, మరోవైపు నిర్మాతగానూ సత్తా చాటుతున్నాడు. చివరిగా గతేడాది అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే సినిమాలో కనిపించాడు కల్యాణ్ రామ్. ఇప్పుడు తన తర్వాతి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. అయితే ఇంతలో అతని కుమారుడికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Kalyan Ram: నందమూరి కల్యాణ్ రామ్ కుమారుడిని చూశారా? కిక్ బాక్సింగ్‌లో అదరగొడుతున్నాడు.. వీడియో
Nandamuri Kalyan Ram Family
Basha Shek
|

Updated on: May 29, 2026 | 1:16 PM

Share

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తాత ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణల సినీ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు నందమూరి కల్యాణ్ రామ్. జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగానూ సక్సెస్ అయ్యాడు కల్యాణ్ రామ్. జై లవకుశ, బింబిసార, దేవర తదితర సూపర్ హిట్ సినిమాలు కల్యాణ్ రామ్ బ్యానర్ లో తెరకెక్కినవే. ఇక హీరోగా చివరిగా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతీ అనే సినిమాలో కనిపించాడు కల్యాణ్ రామ్. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. ప్రస్తుతం సూపర్ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ చేస్తున్నాడీ నందమూరి హీరో. ఇందులో అతను విక్టరీ వెంకటేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. దీంతో పాటు నిర్మాతగానూ కొన్ని సినిమాలు నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు కల్యాణ్ రామ్. ఇదిలా ఉంటే నందమూరి వంశం నుంచి వెండితెరకు మరో హీరో వస్తున్నాడంటూ నందమూరి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. కల్యాణ్ రామ్ కుమారుడు శౌర్య రామ్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు నెట్టింట తెగ ప్రచారం జరుగుతోంది.

ఈ వార్తలు రావడానికి ప్రధాన కారణం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శౌర్య రామ్ కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ వీడియోలు. ఈ వైరల్ వీడియోల్లో శౌర్య ఎంతో ఎనర్జీతో కనిపించాడు. తన పవర్‌ఫుల్ పంచ్‌లు, కిక్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు, నందమూరి అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపడానికి మరో నందమూరి హీరో లోడింగ్ అంటూ సోషల్ మీడియాలో క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. అయితే శౌర్య ప్రస్తుత ఉన్నత చదువులు అభ్యసిస్తున్నట్లు తెలుస్తోంది. అతను సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి మరికొంత సమయం పట్టవచ్చని మరికొంతమంది ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ లో నందమూరి కల్యాన్ రామ్ కుమారుడు.. వీడియో..

అనిల్ రావిపూడి దర్శకత్వంలో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us