OTT Movie: అప్పుడే ఓటీటీలోకి కన్నడ కాంట్రవర్సీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. అధికారిక ప్రకటన
ఈ ఏడాది ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో ఇదే అతిపెద్ద కాంట్రవర్సీ మూవీ అని చెప్పవచ్చు. వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచిన ఈ కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర కూడా బాగానే రచ్చ చేసింది. భారీగానే కలెక్షన్లు రాబట్టి ట్రేడ్ నిపుణులను ఆశ్చర్యపరిచింది.

కన్నడ యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా నటించిన లేటెస్ట్ సినిమా ‘కేడీ-ది డెవిల్’. ఇడియట్ హీరోయిన్ రక్షిత భర్త ప్రేమ్ తెరకెక్కించిన ఈ సినమాలో రీష్మా హీరోయిన్ గా నటించింది. అలాగే బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, శిల్పా శెట్టి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 30న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. తెలుగులో పెద్దగా స్పందన రానప్పటికీ కన్నడలో మాత్రం ఆశించిన కలెక్షన్లనే రాబట్టింది. అయితే అంతకు ముందు ఈ కేడీ సినిమా పలు వివాదాలతో వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా హిందీ వెర్షన్ సాంగ్ ‘సర్కే చునార్’ సాంగ్ తీవ్ర చర్చనీయాంశమైంది. లిరిక్స్ లో విచ్చలవిడిగా బూతులు వాడడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో యూట్యూబ్ నుంచి ఈ సాంగ్ ను తొలగించారు కూడా. ఇక పాన్ ఇండియా రేంజ్ లో రిలీజైన కేడీ సినిమాకు కన్నడలో తప్పితే ఇతర భాషల్లో పెద్దగా కలెక్షన్లు రాలేదు. ఇప్పుడీ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. కేడీ ది డెవిల్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకుంది. ఈ మేరకు జూన్ 5 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కేడీ సినిమాకు సంబంధించి ఒక వీడియోను రిలీజ్ చేసింది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ కేడీ ది డెవిల్ స్ట్రీమింగ్ కు రానుంది.
కాగా ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తోన్న కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ కేడీ సినిమాను నిర్మించారు. కన్నడ స్టార్ కిచ్చా సుదీప్, రమేష్ అరవింద్, వి. రవిచంద్రన్, జిషుసేన్ గుప్తా, పి. రవిశంకర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి ఓ స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది. మరి థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన కేడీ ది డెవిల్ ఓటీటీలో ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.
జీ5లో కేడీ ది డెవిల్..
ಹೆಜ್ಜೆ ಇಟ್ಟ ಕಡೆಯೆಲ್ಲಾ ಧೂಳ್, ಮಚ್ಚು ಬೀಸಿದ ಕಡೆಯೆಲ್ಲಾ ರಕ್ತ! ಡೆವಿಲ್ ಎಂಟ್ರಿಗೆ ಕೌಂಟ್ಡೌನ್ ಸ್ಟಾರ್ಟ್. ಜೂನ್ 5ರಿಂದ ಕನ್ನಡ ZEE5ನಲ್ಲಿ ‘KD – ದಿ ಡೆವಿಲ್’. #KDTheDevil, #DhruvaSarja, #KDTheDevilOnZEE5, #KannadaZEE5 pic.twitter.com/vYIW8jcy1m
— ZEE5 Kannada (@ZEE5Kannada) May 28, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




