Comedian Sudhakar: కమెడియన్ సుధాకర్ కోమాలోకి వెళ్లడానికి అసలు కారణం ఇదే.. కొడుకు బెన్నీ చెప్పిన నిజాలు..
కమెడియన్ సుధాకర్ కుమారుడు మైఖేల్ బెన్నీ తన తండ్రి ఆరోగ్య సమస్యలు, మెదడులో రక్తస్రావం (బ్రెయిన్ స్ట్రోక్) అనంతరం కోమా, కోలుకున్న విధానం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సినీ పరిశ్రమ అందించిన మద్దతు, చిరంజీవి, జగపతి బాబు వంటి ప్రముఖుల సహాయాన్ని ఆయన వివరించారు. మైఖేల్ తన సినీ ప్రయాణం, ఇష్టమైన దర్శకులు, నటుల గురించి కూడా మాట్లాడారు.

కమెడియన్ సుధాకర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు హీరోగా.. ఆ తర్వాత విలన్ గా, కమెడియన్ గా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేశారు. అప్పట్లో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో బిజీ ఆర్టిస్టుగా మారారు. అయితే అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యారు. అనారోగ్య సమస్యలు, బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. ఇదిలా ఉంటే ఆయన కుమారుడు మైఖేల్ బెన్నీ తన తండ్రి ఆరోగ్య సమస్యలు, సినీ ప్రయాణం గురించి ఇటీవల ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఒక పెద్ద ఫ్లో ఉండి, మిగతా ఏ కమెడియన్ కూ సాధ్యం కానంత స్టార్‌డమ్ చూసిన వ్యక్తి సుధాకర్ అని మైఖేల్ పేర్కొన్నారు. హీరోగా కెరీర్ ప్రారంభించి, కమెడియన్ గా మారిన తర్వాత ఆయనకు అవకాశాల కొరత కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ ఎప్పుడూ రాలేదన్నారు. అయితే, 2003-04లో విడుదలైన సంక్రాంతి చిత్రం తర్వాత సుధాకర్ కు సినిమా అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయని, ఆ సమయంలో ఆయన డిప్రెషన్‌కు లోనయ్యారని, మధుమేహం (షుగర్) స్థాయిలు అసాధారణంగా పెరిగాయని మైఖేల్ వివరించారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : చిన్ననాటి నుంచే ప్రాణ స్నేహితులు.. ఒకరు రాజకీయాల్లో సెన్సేషన్.. మరొకరు పెద్ద హీరో..
ఈ పరిణామాల కారణంగా సుధాకర్ మెదడులో రక్తస్రావం (బ్రెయిన్ స్ట్రోక్) కు గురై కోమాలోకి వెళ్ళారని తెలిపారు. అప్పట్లో తను 10వ తరగతి చదువుతున్నానని, తన కుటుంబం తన తండ్రి పరిస్థితి తీవ్రతను తన నుండి దాచిందని మైఖేల్ గుర్తుచేసుకున్నారు. దాదాపు ఒక నెల రోజుల పాటు ఆయన కోమాలో ఉన్నారని, అదొక అత్యంత కఠినమైన సమయమని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో సినీ పరిశ్రమ నుంచి అనూహ్యమైన మద్దతు లభించిందని మైఖేల్ వెల్లడించారు. చిరంజీవి, జగపతి బాబు వంటి స్టార్ నటులు తమ ఇంటికి, ఆసుపత్రికి వచ్చి కుటుంబానికి అండగా నిలిచారని, చాలా సేపు సమయం గడిపారని ఆయన గుర్తుచేసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒకే పాటను 2 సినిమాల్లో పెట్టారు.. ఆ సాంగ్ కోసమే థియేటర్లకు వచ్చిన జనాలు..
సుధాకర్ ఆరోగ్యం నుంచి కోలుకున్న తర్వాత, మైఖేల్ తన సినీ ప్రయాణం, ఇష్టాలను కూడా పంచుకున్నారు. వివేక్ ఆత్రేయ సినిమాలంటే తనకు ఎంతో ఇష్టమని, అవి చాలా క్వర్కీగా ఉంటాయని తెలిపారు. దర్శకుడిగా తనకి రోమ్-కామ్ జానర్ చాలా ఇష్టమని, తాను తీసిన రెండు వెబ్ సిరీస్‌లు కూడా అదే జానర్‌కు చెందినవని చెప్పారు. తన తండ్రి సినిమాలలో సీతారామయ్య గారి మనవరాలు, పెద్దరికం, ఖుషి సినిమాలు అంటే బాగా ఇష్టమని మైఖేల్ పేర్కొన్నారు. చిరంజీవి, సుధాకర్ అడయార్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో రూమ్మేట్స్ గా ఉన్నప్పుడు డ్యూటీలు పంచుకునేవారని, చిరంజీవి కూర వండేవారని, సుధాకర్ అన్నం పెట్టేవారని తన తండ్రి చెప్పిన విషయాలను మైఖేల్ పంచుకున్నారు. ప్రస్తుత నటీనటులలో నివేదా థామస్, రామ్ నటన అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. పవన్ కళ్యాణ్ కు తాను పెద్ద అభిమానిని అని, చిన్నతనం నుంచే ఆయనను ఒక హీరోగా భావించానని మైఖేల్ చెప్పారు.
ఎక్కువ మంది చదివినవి : Ravi Babu : పెద్ద హీరోయిన్ అని నాకు తెలియదు.. బయట నిలబడిన అమ్మాయికి పిలిచి ఛాన్స్ ఇచ్చా.
ఎక్కువ మంది చదివినవి: Trending Song: ఏముంటది భయ్యా ఈ పాట.. ఇప్పట్లో ఇలాంటి సాంగ్ ఎప్పటికీ రాదు.. 26 ఏళ్లైనా తగ్గని క్రేజ్..
