AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Sai: హీరోగా, కమెడియన్‌గా మెప్పించిన ఈ నటుడు గుర్తున్నాడా? పాపం చిన్న వయసులోనే ఎలా చనిపోయాడంటే?

హీరోగా, హీరో ఫ్రెండుగా, కమెడియన్‌గా, సహాయక నటుడిగా.. ఇలా తెలుగులో పలు విభిన్న రకాల పాత్రలు పోషించి ఫేమస్ అయ్యాడు. కానీ పర్సనల్ లైఫ్ లో మాత్రం తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. చివరకు 37 ఏళ్ల వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు..

Vijay Sai: హీరోగా, కమెడియన్‌గా మెప్పించిన ఈ నటుడు గుర్తున్నాడా? పాపం చిన్న వయసులోనే ఎలా చనిపోయాడంటే?
Tollywood Actor Vijay Sai
Basha Shek
|

Updated on: May 29, 2026 | 11:55 AM

Share

విజయ్ సాయి.. పేరు చెబితే గుర్తు పట్టకపోవచ్చు.. కానీ పై ఫొటో చూస్తే ఇట్టే ఓ అమాయకమైన ముఖం కళ్ల ముందు మెదులుతుంది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు విజయ్. హీరోగానూ, హీరో ఫ్రెండ్ గానూ ఆకట్టుకున్నాడు. మరికొన్ని సినిమాల్లో కమెడియన్ గానూ, సహాయక నటుడిగానూ మెప్పించాడు. 2000లో నువ్వే కావాలి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు విజయ్. అందులో హీరో తరుణ్ ఫ్రెండ్ పాత్రలో కనిపించాడు. ఆ మరుసటి ఏడాదే డైరెక్టర్ రవి బాబు తెరకెక్కించిన అమ్మాయిలు అబ్బాయిలు సినిమాల్లో లీడ్ రోల్ పోషించాడు విజయ్. అలాగే బ్యాక్ పాకెట్ అనే సినిమాలోనూ హీరోగా చేశాడు. అలాగే ఒకరికి ఒకరు, ప్రేమించుకున్నాం పెళ్లికి రండి, యూత్, భగీరథ, సోగ్గాడు, బొమ్మరిల్లు, పార్టీ, ఆరోజే, పైసాలో పరమాత్మ, మంత్ర, కొంటె కుర్రాళ్లు, ఏకలవ్యుడు, కరెంట్, తాజ్ మహల్, డాన్ శీను, వర ప్రసాద్ పొట్టి ప్రసాద్, డాన్ సీను, ఓమ్ త్రీడీ.. ఇలా ఎన్నో సినిమాల్లో హీరో ఫ్రెండ్ గా, కమెడియన్ గా చేశాడు విజయ్. తన డైన కామెడీతో తెలుగు ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు.

సినిమాల్లో ఎప్పుడూ నవ్వుతూ కనిపించే విజయ్ సాయి వ్యక్తిగత జీవితంలో మాత్రం తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా తన పెళ్లితో పలు సార్లు వార్తల్లో నిలిచాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. 2006లో బుల్లితెర నటి వనితా రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు విజయ్. ఆ తర్వాత వీరికి ఓ పాప జన్మించింది. అయితే ఏమైందో తెలియదు కానీ కొంతకాలానికే భార్య, భర్తల విభేదాలు వచ్చాయి. దీంతో ఇద్దరూ విడిపోయారు. 2015 నుంచే ఇద్దరూ విడివిడిగా లైఫ్ లీడ్ చేశారు. అయితే ఇది జరిగిన రెండేళ్లకే అంటే 2017లో ఆత్మహత్య చేసుకున్నాడు విజయ్. తన గదిలోనే సీలింగ్ ఫ్యాన్‌ కు ఉరేసుఉని ప్రాణాలు తీసుకున్నాడు విజయ్. అప్పటికీ అతని వయసు కేవలం 37 ఏళ్లు మాత్రమే.

అయితే విజయ్ గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది వనితా రెడ్డి. ‘ పెళ్లి కాకముందే విజయ్ కు మరో అమ్మాయితో ఎఫైర్ ఉంది. అదే నన్ను బాధించింది. అంతేకాదు నన్ను బాగా హింసించాడు. అతని వేధింపులు భరించలేక 2013లోనే విడాకులకు దరఖాస్తు చేశాను. మాకు ఓ పాప ఉంది. కోర్టు నిర్ణయం ప్రకారం ప్రతివారం పాపను చూపించాలన్నారు. అలా నా కూతురు వారంలో ఒకరోజు అతనితో ఉండేది. విజయ్ పై నా మనసు ఎప్పుడు విరిగిపోయిందంటే.. నా స్థానంలో ఇంకొకరిని తీసుకు వచ్చినప్పుడు! ఈ విషయం తెలిశాక తన ముఖం కూడా చూడాలనుకోలేదు. కానీ చనిపోయినప్పుడు అతనిని పట్టుకుని ఏడ్చాను. ఎందుకు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నావని గుండెలవిసేలా ఏడ్చాను. ఇప్పటికీ కొన్ని కేసులు కోర్టులోనే ఉన్నాయి’ అంటూ వాపోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us