AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: కన్యాకుమారిలో జరిగిన ఘటన.. ఓటీటీలోకి మరో రియల్ క్రైమ్ స్టోరీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

తమిళనాడులోని కన్యాకుమారిలో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు మేకర్స్. ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే ఈ క్రైమ్ థ్రిల్లర్ లో సస్పెన్స్, ట్విస్టింగ్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి. తెలుగు ఆడియెన్స్ కు బాగా పరిచయమైన కతిర్ ఈ సిరీస్ లో కీలక పాత్ర పోషించాడు.

OTT Movie: కన్యాకుమారిలో జరిగిన ఘటన.. ఓటీటీలోకి మరో రియల్ క్రైమ్ స్టోరీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: Jun 06, 2026 | 8:39 PM

Share
ఇవి కూడా చదవండి

ఈ మధ్యన నిజ జీవిత సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల జీవితాల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు వస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఆసక్తికర వెబ్ సిరీస్ లు తెరకెక్కుతున్నాయి. ఆడియెన్స్ కూడా వీటిని ఎగబడి చూస్తున్నారు. దీంతో ఓటీటీల్లో రియల్ స్టోరీలకు మంచి ఆదరణ దక్కుతోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక రియల్ క్రైమ్ స్టోరీనే. తమిళనాడులోని కన్యాకుమారిలో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ రియల్ క్రైమ్ స్టోరీని తెరకెక్కించారు. తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైన నటుడు కతిరన్ ఇందులో కీలక పాత్ర పోషించాడు. ట్యాలెంటెడ్ కబడ్డీ ఛాంపియన్ (కతిర్) అనుకోని విధంగా ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. తన తప్పేం లేకపోయినా అనుకోని పరిస్థితుల కారణంగా ఇబ్బందుల్లో పడతాడు. దీంతో అతను పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో అండర్ వరల్డ్ ప్రపంచంలోకి ప్రవేశిస్తాడు. ఒక భయంకరమైన గ్యాంగ్ స్టర్ గా మారిపోతాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? మాఫియా వరల్డ్ నుంచి హీరో బయటపడి కబడ్డీలో విజయాలు సాధించాడా? అనేది తెలియాలంటే ఈ రియల్ క్రైమ్ స్టోరీ చూడాల్సిందే.

ఓటీటీ ఆడియన్స్‌ను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతోన్న ఈ వెబ్ సిరీస్ పేరు లింగం. కతిర్, గెలాక్సీ స్టార్ విమల్, దివ్య భారతి, పూర్ణిమ రవి, రాధికా శరత్ కుమార్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. గతంలో ‘విళంగు’ లాంటి సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ను రూపొందించిన ప్రశాంత్ పాండియరాజ్ ఈ సిరీస్ కు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. లక్ష్మీ శరవణన్ కుమార్ ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజైన ఈ సిరీస్ టీజర్స్, ట్రైలర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో జూన్ 26 నుంచి లింగం వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు జియో హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది. తమిళంతో పాటు తెలుగు భాషలోనూ ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

జియో హాట్ స్టార్ లో లింగం వెబ్ సిరీస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us