Huawei Mate 90 Air: బ్యాటరీ, కెమెరాతో అట్రాక్ట్ చేసేస్తోందిగా.. డిజైన్ అయితే మతిపోట్టేసేలా ఉంది
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Huawei మరో కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. Huawei Mate 90 Air పేరుతో చైనాలో ఈ ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది. స్లిమ్ డిజైన్‌తో పాటు భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే, అధునాతన కెమెరా ఫీచర్లను ఇందులో అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కేవలం 6.58mm మందం, 208 గ్రాముల బరువుతో వచ్చిన ఈ ఫోన్ Mate సిరీస్‌లో ఇప్పటివరకు విడుదలైన బార్ ఫోన్లలో అత్యంత సన్నని మోడల్‌గా నిలిచింది.

సాధారణంగా స్లిమ్ స్మార్ట్‌ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే Huawei ఈ ఫోన్‌లో ఏకంగా 6500mAh బ్యాటరీని అందించింది. దీంతోపాటు 7 ఇంచుల 1.5K క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లే, Kirin 9020 ప్రాసెసర్, 50MP ప్రధాన కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రీమియం ఫోన్ కొనాలనుకునే వారిని ఆకట్టుకునేలా దీన్ని రూపొందించారు. అయితే ప్రస్తుతం ఈ ఫోన్ చైనా మార్కెట్‌కే పరిమితమైంది.
Kirin 9020 ప్రాసెసర్
Huawei Mate 90 Airలో 7 ఇంచుల 1.5K క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 4,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 2,160Hz PWM డిమ్మింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్ మొత్తం మందం 6.58mm కాగా, మిడ్ ఫ్రేమ్ మందం కేవలం 3.7mm మాత్రమే. వెనుక భాగంలో Mate 90 సిరీస్ డిజైన్‌ను పోలిన సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది.
ఈ ఫోన్‌లో Kirin 9020 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇందులోని మెమరీ టెక్నాలజీ కారణంగా 12GB RAM కొన్ని బ్యాక్‌గ్రౌండ్ టాస్క్‌లలో 16GB RAM స్థాయిలో పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. 6500mAh బ్యాటరీతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 23 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ అందిస్తుందని వెల్లడించింది. 66W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
శాటిలైట్ మెసేజింగ్ సపోర్ట్
కెమెరాల విషయానికి వస్తే వెనుకవైపు నాలుగు సెన్సార్లు ఉన్నాయి. OIS సపోర్ట్‌తో 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రావైడ్ మాక్రో లెన్స్, OISతో కూడిన 12MP 3x టెలిఫోటో కెమెరా అందించారు. వీటితో పాటు 1.5 మిలియన్ మల్టీస్పెక్ట్రల్ ఛానళ్లతో పనిచేసే Red Maple కలర్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 10.7MP కెమెరాను ఇచ్చారు. 5A సెల్యులార్ స్పీడ్స్, Wi-Fi 7+, NearLink కనెక్టివిటీతో పాటు రెండు వైపులా పనిచేసే BeiDou శాటిలైట్ మెసేజింగ్ సదుపాయం కూడా ఉంది.
ఈ ఫోన్ రోజ్ గోల్డ్, మూన్ సిల్వర్, అబ్సిడియన్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 4,999 (సుమారు $750)గా ఉంది. 12GB RAM + 512GB వేరియంట్ ధర CNY 5,999 (సుమారు $901)గా నిర్ణయించారు. చైనాలో నవంబర్ 24న సాయంత్రం 6:08 గంటలకు ప్రీ-సేల్స్ ప్రారంభమవుతాయి. డిసెంబర్ 4న ఉదయం 10:08 గంటల నుంచి సాధారణ విక్రయాలు మొదలవుతాయి. భారత్ సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలపై Huawei ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
