AP Panchayat Elections LIVE Updates: ఏపీలో పంచాయతీ పోరు.. ప్రారంభమైన పోలింగ్
AP Panchayat Elections 1st Phase Voting Live Updates in Telugu: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఇప్పుడు గ్రామాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు ఈ రోజు పోలింగ్ జరగనుండగా, అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరికాసేపట్లో ఓటింగ్ ప్రారంభం కానుంది.

LIVE NEWS & UPDATES
-
Panchayat Polling: ఏపీలో తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు
26 జిల్లాల్లో 3,949 సర్పంచ్ స్థానాలకు SEC నోటిఫికేషన్
ఏకగ్రీవం అయిన 760 పంచాయతీ స్థానాలు
3,189 సర్పంచ్ స్థానాలకు పోలింగ్
39,832 వార్డు సభ్యుల స్థానాలకు నోటిఫికేషన్
14,731 స్థానాలు ఏకగ్రీవం
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు ఈ రోజు పోలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 709 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కాగా, తొలి విడతలో 25,057 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఏర్పాట్లు చేసింది.
మరికాసేపట్లో తొలి విడత పోలింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.
ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 31,614 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Published On - Nov 26,2026 6:51 AM




