AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వినియోగదారులకు Tata Motors బిగ్‌ షాక్‌..! ఆ నిర్ణయంతో డిసెంబర్‌ 1 నుంచి వచ్చే మార్పులివే

భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం Tata Motors కార్ల కొనుగోలుదారులకు కీలక ప్రకటన చేసింది. కంపెనీకి చెందిన ప్యాసింజర్ వాహనాల ధరలను మరోసారి పెంచేందుకు సిద్ధమైంది. పెట్రోల్, డీజిల్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల ధరలను కూడా సవరించనున్నట్లు ప్రకటించింది. ఈసారి అన్ని మోడళ్లపై సగటున 0.5 శాతం ధరల పెంపు ఉండనుంది. కొత్త ధరలు 2026 డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో Tata కారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నవారు కొత్త ధరలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది.

వినియోగదారులకు Tata Motors బిగ్‌ షాక్‌..! ఆ నిర్ణయంతో డిసెంబర్‌ 1 నుంచి వచ్చే మార్పులివే
Tata Motors Price Hike December 2026
Nikhil
|

Updated on: Nov 26, 2026 | 7:00 AM

Share

కారు ధరల పెంపు అనేది ప్రతి మోడల్‌కు ఒకే విధంగా ఉండదు. ఆయా కార్ల ధరలు, వేరియంట్లను బట్టి అదనపు భారం మారుతుంది. ముఖ్యంగా తక్కువ ధరలో లభించే హ్యాచ్‌బ్యాక్ కార్ల నుంచి ఖరీదైన SUVలు, ఎలక్ట్రిక్ కార్ల వరకు ఈ ధరల సవరణ ప్రభావం ఉండనుంది. డిసెంబర్ 1 కంటే ముందే కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నవారు బుకింగ్, డెలివరీ సమయంలో వర్తించే ధరల గురించి డీలర్‌ను సంప్రదించడం మంచిది.

ఏ కారు ధర ఎంత పెరగవచ్చు?

Tata Motors ప్రకటించిన సగటు 0.5 శాతం ధరల పెంపు ప్రకారం, Tata Tiago వంటి ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కార్ల ధరలు సుమారు రూ.3,000 నుంచి రూ.4,000 వరకు పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో కంపెనీకి చెందిన ఫ్లాగ్‌షిప్ SUVలు, ఎలక్ట్రిక్ కార్ల ధరలు సుమారు రూ.10,000 నుంచి రూ.13,000 వరకు పెరగవచ్చని అంచనా. అయితే ఏ మోడల్‌లో ఏ వేరియంట్ ధర ఎంత పెరుగుతుందనే పూర్తి వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించాల్సి ఉంది.

ICE కార్లతో పాటు EVలపైనా ధరల పెంపు

ఈ ధరల సవరణలో భాగంగా Tata Motors తన మొత్తం ప్యాసింజర్ వాహనాల పోర్ట్‌ఫోలియోను పరిగణనలోకి తీసుకుంది. ఇందులో పెట్రోల్, డీజిల్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఉన్నాయి. Tata Nexon, Punch, Altroz, Tiago కొనుగోలు చేయాలనుకునే వారితో పాటు Nexon EV, Punch EV వంటి ఎలక్ట్రిక్ కార్లపై ఆసక్తి ఉన్నవారిపైనా ఈ పెంపు ప్రభావం చూపనుంది.

2026 క్యాలెండర్ సంవత్సరంలో Tata Motors ధరలను సవరించడం ఇది నాలుగోసారి. వాహనాల తయారీ ఖర్చులు, ఇతర నిర్వహణ వ్యయాల్లో మార్పుల కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త ధరలు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానుండటంతో నవంబర్‌లోనే కొనుగోలు చేయాలనుకునేవారు తమ నిర్ణయం తీసుకోవచ్చు. అయితే బుకింగ్ చేసిన తేదీకి కాకుండా డెలివరీ సమయంలో అమల్లో ఉన్న ధర వర్తిస్తుందా అనే విషయాన్ని ముందుగానే డీలర్‌ను అడిగి తెలుసుకోవాలి.

Follow Us