Peddi Movie: ‘పెద్ది’ మేనియా.. ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన రామ్ చరణ్ కూతురు.. వీడియో చూస్తే వావ్ అంటారు
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో 'పెద్ది' మేనియా నడుస్తోంది. ఎక్కడ చూసినా ఈ సినిమా పాటలు, డ్యాన్సులే వినిపిస్తున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా ‘పెద్ది’. జూన్ 04న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. మొదటి రోజు రూ.130 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ మెగా మూవీ మొత్తం రెండు రోజులకు కలిపి రూ. 180 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఈ విషయాన్ని పెద్ది నిర్మాతలు స్వయంగా ప్రకటించారు. కేవలం తెలుగులోనే కాదు ఇతర భాషల్లోనూ పెద్ది సినిమాకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఓవర్సీస్ లోనూ ఈ మెగా మూవీకి రికార్డు వసూళ్లు వస్తున్నాయి. మొత్తానికి ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం పెద్ది మేనియాతో ఊగిపోతోంది. ఎక్కడ చూసినా ఈ సినిమా పాటలే, డ్యాన్సులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పెద్ది సినిమాకు విషెస్ చెబుతూ రామ్ చరణ్ కూతురు క్లింకార ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేసింది. ‘దిస్ ఈజ్ ఫర్ యూ నాన్న, లవ్ యూ సో మచ్’ అని మెగా డాటర్ ముద్దు ముద్దు మాటలతో ప్రారంభమైన ఈ వీడియోలో.. రామ్ చరణ్-ఉపాసన ఇంట్లోని పనివాళ్లంతా కలిసి చికిరి చికిరి పాటకు స్టెప్పులేయడం విశేషం. చివరకు చరణ్ సెక్యూరిటీ గార్డ్‌తోనూ వైరల్ బ్యాట్ స్టెప్ వేయించారు. ఉపాసన స్వయంగా ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇప్పుడిది బాగా వైరల్ అవుతోంది. క్లింకార కనిపించకపోయినా ఆమె ముద్దు ముద్దు మాటలు విని మెగాభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
ఇక పెద్ది సినిమా విషయానికి వస్తే.. బుచ్చిబాబు సనా ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాను తెరకెక్కించాడు. క్రికెటర్ గా, రెజ్లర్ గా, రన్నర్‌గా రామ్ చరణ్ అద్భుతంగా నటించాడని ప్రశంసలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించింది. అలాగే శివరాజ్ కుమార్ జగపతిబాబు, దివ్యేందు త్రిపాఠి, రావు రమేష్, బొమన్ ఇరానీ, రవి కిషన్, కమెడియన్ సత్య, చమ్మక్ చంద్ర, అజయ్ ఘోష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ ఈ మూవీకి స్వరాలు అందించారు.
ఉసాసన షేర్ చేసిన వీడియో ఇదిగో..
View this post on Instagram
పెద్ది సినిమా షూటింగ్ ఫొటోస్..
Behind the scenes of making a BOX OFFICE CHAMPION 🔥
Book your tickets now!https://t.co/EMhY3eM8US#Peddi in cinemas now💥 pic.twitter.com/JUljyfJbto
— PEDDI (@PeddiMovieOffl) June 6, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




