AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎల్లలు దాటిన ప్రేమ.. సత్యదేవుని సన్నిధిలో ఒక్కటైన కొరియా అమ్మాయి, విశాఖ అబ్బాయి.

దేశాలు, భాషలు, సంస్కృతులకు సరిహద్దులు ఉంటాయేమో కానీ.. ప్రేమకు మాత్రం అవేవి అవసరం లేదని ఇక్కడో జంట నిరూపించింది. దక్షిణ కొరియాకు చెందిన యువతి, విశాఖపట్నం యువకుడు అన్నవరం దేవస్థానంలో హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. సత్యదేవుని సన్నిధిలో ఇరుకుటుంబాల సమక్షంలో వీరి వివాహం వైభవంగా జరిగింది.

ఎల్లలు దాటిన ప్రేమ.. సత్యదేవుని సన్నిధిలో  ఒక్కటైన కొరియా అమ్మాయి, విశాఖ అబ్బాయి.
South Korean Woman Marries Visakha Man
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Nov 23, 2026 | 12:15 PM

Share

సరిహద్దులు దేశాలకు మాత్రమే ఉంటాయి. ప్రమేమకు కాదని మరోసారి ఈ జంట నిరూపించింది. దేశం వేరైనా.. భాషలు వేరైనా.. సంస్కృతులు వేరైనా.. తమ మనసులు మాత్రం ఒక్కటేనని చాటి చెప్పింది. వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ కొరియాకు చెందిన యువతి, విశాఖపట్నానికి చెందిన యువకుడు భారతీయ హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కాకినాడ జిల్లా అన్నవరం రత్నగిరిపై ఉన్న శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో సత్యదేవుని సన్నిధిలో వేదమంత్రాలు, సంప్రదాయాల నడుమ వీరి వివాహ వేడుక వైభవంగా జరిగింది.

రెండు దేశాలకు చెందిన కుటుంబాలు, బంధువుల సమక్షంలో నూతన వధూవరులు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. భారతీయ హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వివాహం అక్కడికి వచ్చిన భక్తులను ఆకట్టుకుంది. వివాహం అనంతరం నూతన దంపతులు స్వామివారి సన్నిధిలో రూ.2 వేల సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించారు. అనంతరం స్వామివారి ఆశీర్వచనాలు స్వీకరించారు.

దక్షిణ కొరియాకు చెందిన యువతి భారతీయ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విదేశీ వధువు భారతీయ హిందూ వివాహ పద్ధతిని అనుసరించడం అక్కడికి వచ్చిన భక్తులను ఆకట్టుకుంది. దేశాల మధ్య దూరం ఉన్నా.. మనసుల మధ్య అనుబంధం ప్రేమతో కలిస్తే సరిహద్దులు అడ్డుకావని ఈ జంట చాటిచెప్పింది. రెండు దేశాలకు చెందిన కుటుంబాలు, బంధువుల సమక్షంలో జరిగిన ఈ వివాహం స్థానికంగా ఆసక్తికర చర్చగా మారింది.

అన్నవరం రత్నగిరిపై జరిగిన ఈ అంతర్జాతీయ వివాహ వేడుకతో సత్యదేవుని క్షేత్ర విశిష్టత మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కొరియా వధువు, విశాఖ వరుడి వివాహం భక్తుల దృష్టిని ఆకర్షించింది. దేశాలు, భాషలు, సంస్కృతులు వేరైనా ప్రేమతో ఒక్కటైన ఈ జంట వివాహం స్థానికంగా ఆసక్తికరంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us