Peddi Movie: ఎన్టీఆర్‌తో సహా.. రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాను ఇంత మంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా 'పెద్ది' ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద బాగా సందడి చేస్తోంది. జూన్ 04న విడుదలైన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా కేవలం రెండు రోజుల్లోనే రూ.180 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘పెద్ది’. ‘ఉప్పెన’ సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు బుచ్చి బాబు సనా ఈ మూవీని తెరకెక్కించాడు. బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేసింది. అభిమానుల భారీ అంచనాల మధ్య జూన్ 04న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన పెద్ది సినిమాకు ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. తెలుగుతో పాటు వివిధ భాషల్లోనూ సూపర్ హిట్ అని రివ్యూలు వచ్చాయి. ఈ సినిమాలో మెయిన్ హైలెట్ అంటే రామ్ చరణ్ యాక్టింగేనని చెప్పుకోవచ్చు. క్రికెటర్ గానూ, కుస్తీ యోధుడిగానూ, రన్నర్ గానూ అద్భుతంగా నటించి మెప్పించాడు మెగా పవర్ స్టార్. ఇక క్లైమాక్స్ లో అయితే ఆడియెన్స్ తో కన్నీళ్లు పెట్టించేశాడీ మెగా హీరో. మొత్తానికి తన సూపర్బ్ యాక్టింగ్ తో పెద్ది సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాడు రామ్ చరణ్. అందుకు తగ్గట్టే ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే పెద్ది సినిమాకు రూ.180 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అయితే పెద్ది సినిమా గురించి సామాజిక మాధ్యమాల్లో కొన్ని ఆసక్తికర విషయాలు వినిపిస్తున్నాయి. అందులోనూ ప్రధానంగా పెద్ది సినిమా హీరో గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. అదేంటంటే.. ఈ సినిమాకు రామ్ చరణ్ ఫస్ట్ ఛాయిస్ కాదంట. మెగా పవర్ స్టార్ కంటే ముందే బుచ్చిబాబు ఈ కథను చాలా మంది స్టార్ హీరోలకు వినిపించారట. అయితే వివిధ కారణాలతో వాళ్లు నో చెప్పారట
కాగా పెద్ది సినిమా మొదట యంగ్ టైగర్ ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లిందట. అయితే బిజీ షెడ్యూల్, ఇతరత్రా కారణాలతో తారక్ ఈ సినిమా చేయలేకపోయాడట. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను కూడా కలిశారట బుచ్చిబాబు. కానీ అప్పటికే బన్నీ పలు పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో ఈ సినిమాకు నో చెప్పారట. ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, బాలీవుడ్ చాక్లెట్ బాయ్ యానిమల్ ఫేమ్ రణ్ బీర్ కపూర్ లు కూడా లైన్లోకి వచ్చారట. కానీ వారు కూడా వివిధ కారణాలతో ఈ సినిమాను రిజెక్ట్ చేశారట. దీంతో బుచ్చిబాబు రామ్ చరణ్ తో పాటు చిరంజీవికి కూడా ఈ కథను వినిపించి ఇంప్రెస్ చేశారట. అయితే ఇది కేవలం సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారం మాత్రమే. ఇందులో ఎంత నిజముందనేది మాత్రం తెలియదు.
ఇక మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా పెద్ది సినిమాను నిర్మించారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు త్రిపాఠి, రావు రమేష్, సత్య, చమ్మక్ చంద్ర తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించారు.
బుక్ మై షోలో పెద్ది రికార్డు..
BOX OFFICE CHAMPION #PEDDI continues his rampage 💥💥
4 MILLION+ TICKETS SOLD on Book My Show and District alone 🔥
Book your tickets now! 🎟️ https://t.co/EMhY3eM8US#PEDDI in Cinemas NOW 💥 pic.twitter.com/snpGbWUNjW
— PEDDI (@PeddiMovieOffl) June 6, 2026




