AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌లో కేంద్రమంత్రి పాదయాత్ర.. ఈ రూట్లలో ట్రాఫిక్ అంక్షలు..

హైదరాబాద్‌ వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టనున్న నషా ముక్త్ భారత్ పాదయాత్ర సందర్భంగా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి కోరారు.

Hyderabad: హైదరాబాద్‌లో కేంద్రమంత్రి పాదయాత్ర.. ఈ రూట్లలో ట్రాఫిక్ అంక్షలు..
Hyderabad Traffic Alert
Anand T
|

Updated on: Nov 26, 2026 | 7:39 AM

Share

నగరవాసులకు హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టనున్న నషా ముక్త్ భారత్ పాదయాత్ర సందర్భంగా పాదయాత్రం జరిగే రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్టు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి పాదయాత్ర ప్రారంభం కాగా.. పాదయాత్ర కొనసాగే మార్గాల్లో అవసరాన్ని బట్టి వాహనాల రాకపోకలను నిలిపివేయడం లేదా దారి మళ్లించడం చేయనున్నారు. దీంతో ఆయా మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పాదయాత్ర?

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర.. అశోక్ నగర్‌లోని కాశిష్ ఫంక్షన్ హాల్ నుంచి అమీర్‌పేటలోని సత్యం థియేటర్ వరకు కొనసాగనుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నంచి స్టార్ట్ అయిన పాదయాత్రం అశోక్ నగర్, హిమాయత్‌నగర్, లిబర్టీ మీదుగా సచివాలయం, ఇక్బాల్ మినార్, ఖైరతాబాద్, బడా గణేష్ చౌరస్తా వరకు చేరుకోనుంది.

అక్కడి నుంచి రాజీవ్ గాంధీ విగ్రహం, షాదన్ యూటర్న్, వీవీ విగ్రహం, ఈనాడు ఆఫీస్, ఎర్రమంజిల్, నిమ్స్, పంజాగుట్ట క్రాస్ రోడ్స్ మీదుగా అమీర్‌పేట చేరుకుని, చివరగా సత్యం థియేటర్ వద్ద పాదయాత్ర ముగియనుంది.

ట్రాఫిక్ పోలీసుల సూచనలు

పాదయాత్ర జరిగే మార్గాల్లో అవసరాన్ని బట్టి ట్రాఫిక్ నిలిపివేత లేదా దారి మళ్లింపు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులు పాదయాత్ర మార్గాలను వీలైనంత వరకు నివారించి, ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

ట్రాఫిక్‌కు సంబంధించిన తాజా సమాచారం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఫేస్‌బుక్ పేజీ @HYDTPను ఫాలో కావాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us