2015లో విడుదలైన కన్నడ చిత్రం వజ్రకాయ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది నభా నటేష్. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి.
2018లో సుధీర్ బాబు హీరోగా వచ్చిన నన్ను దోచుకుందువటే చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. ఈ సినిమాతో మంచి మార్కులు కొట్టేసింది.
2019లో దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ పోతినేనికి జోడీగా నటించారు. చాందిని పాత్రలో ఆమె గ్లామర్, డ్యాన్స్, ఎనర్జీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఈ సినిమా భారీ వాణిజ్య విజయం సాధించడంతో నభా నటేష్‌కు ఇస్మార్ట్ బ్యూటీ అనే గుర్తింపు వచ్చింది. ఇదే ఆమె కెరీర్‌లో అతిపెద్ద మైలురాయిగా నిలిచింది.
విజయవంతమైన చిత్రాల తర్వాత కూడా నభా నటేష్ కెరీర్ కొంతకాలం నెమ్మదించింది. ప్రమాదంలో గాయపడటంతో కొంత విరామం తీసుకోవాల్సి వచ్చింది.
2024లో డార్లింగ్ చిత్రంతో తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రీసెంట్ గా నాగబంధం సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. కానీ ఈ సినిమా హిట్ అవ్వలేదు.
ప్రస్తుతం నిఖిల్ స్వయంభు చిత్రాలో నటిస్తుంది. ఈ సినిమా పైనే నభా నటేష్ బోలెడన్ని ఆశలు పెట్టుకుంది.