స్టార్ పవర్ కాదు.. కంటెంట్ పవర్! రూ.100 కోట్ల క్లబ్‌ను శాసిస్తున్న మీడియం రేంజ్ సినిమాలు
ఒకప్పుడు స్టార్ హీరోలకే పరిమితమైన రూ.100 కోట్ల క్లబ్‌లో ఇప్పుడు మీడియం రేంజ్ సినిమాలు కూడా చోటు సంపాదిస్తున్నాయి. బలమైన కథ, పాజిటివ్ మౌత్ టాక్, దీర్ఘకాల ప్రదర్శనతో ‘మా ఇంటి బంగారం’, ‘లెనిన్’, ‘అనగనగా ఒక రాజు’ వంటి చిత్రాలు భారీ విజయాలు నమోదు చేశాయి. కంటెంట్ ఉంటేనే కలెక్షన్లు వస్తాయనే ట్రెండ్‌ను ఈ సినిమాలు మరోసారి నిరూపించాయి.
ఇన్నాళ్లు వంద కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చే సత్తా స్టార్ హీరోలకు మాత్రమే ఉంటుందని భావించేవారు. కానీ ట్రెండ్ మారింది. కేవలం కంటెంట్ ను నమ్ముకుని, స్లో అండ్ స్టడీగా సత్తా చాటుతున్నాయి మీడియం రేంజ్ సినిమాలు. థియేటర్లలో లాంగ్ రన్‌లో ఈజీగా వంద కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చి కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తున్నాయి. ఇంతకీ ఈ సినిమాలకు కలిసొస్తున్న అంశాలేంటి? ఈ స్టోరీలో చూద్దాం. ఒకప్పుడు వంద కోట్ల క్లబ్ అంటే కేవలం బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా రేంజ్ మూవీస్‌కే సాధ్యం అన్న టాక్ ఉండేది. కానీ ఇప్పుడు కంటెంట్ లో దమ్ముంటే చాలు, మీడియం రేంజ్ సినిమాలు కూడా వంద కోట్లు అవలీలగా కొల్లగొడుతున్నాయి. మొదటి రెండు రోజులు యావరేజ్ కలెక్షన్స్‌తో స్టార్ట్ అయినా.. స్ట్రాంగ్ మౌత్ టాక్ తో లాంగ్ రన్‌లో కుమ్మేస్తున్నాయి. పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్‌తో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ సినిమా ఈ కోవలోనే భారీ విజయాన్ని నమోదు చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవ్వడంతో, 100 కోట్ల మార్క్ ను క్రాస్ చేసి అందరికీ షాకిచ్చింది. కమర్షియల్ హంగులు లేకపోయినా కంటెంట్ ఈజ్ కింగ్ అని ప్రూవ్ చేసిన మరో సినిమా ‘లెనిన్’. భారీ సెట్టింగులు, వందల కోట్ల వీఎఫ్ఎక్స్ లేకపోయినా.. కంటెంట్ లో విషయం ఉంటే కలెక్షన్ల సునామీ సృష్టించవచ్చని ఈ మూవీ నిరూపించింది. రిలీజ్ తర్వాత వచ్చిన పాజిటివ్ రివ్యూలు, సోషల్ మీడియాలో పెరిగిన బజ్ ఈ సినిమా లాంగ్ రన్ కు ప్లస్ అయ్యాయి. దీంతో స్లో అండ్ స్టడీగా 100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ మూవీ. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించిన అనగనగా ఒక రాజు కూడా వంద కోట్ల వసూళ్లతో సత్తా చాటింది. మంచి కంటెంట్‌తో పాటు సంక్రాంతి లాంటి పర్ఫెక్ట్ సీజన్‌లో రిలీజ్ కావటం ఈ సినిమాకు కలిసొచ్చింది. అందుకే ఈజీగా వంద కోట్ల మార్క్‌ను క్రాస్ చేసింది. స్టార్ పవర్ ను పక్కన పెట్టి, బలమైన కథ, కథనాలనే నమ్ముకుని మీడియం రేంజ్ మూవీస్ లాంగ్ రన్ లో సెంచరీ కొట్టడం టాలీవుడ్ కు కొత్త ఉత్సాహాన్నిస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని సినిమాలు ఈ మ్యాజిక్ ను రిపీట్ చేస్తాయో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Burj Khalifa: గుడ్‌న్యూస్.. యూపీఐతో బుర్జ్ ఖలీఫా టికెట్లు
వింత రెస్టారెంట్.. హోటల్ లోపల 26 సమాధులు
మధ్యాహ్నం వేళ నీరసంగా అనిపిస్తోందా.. ఇదిగో సరికొత్త ట్రిక్ ‘కాఫీ నాప్’
ఇతను బస్సు డ్రైవరా.. కుబేరుడా!
మీ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ సురక్షితమేనా.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
వింత రెస్టారెంట్.. హోటల్ లోపల 26 సమాధులు
ఇతను బస్సు డ్రైవరా.. కుబేరుడా!
అరే.. ఇదేం చేప.. ప్లేస్‌ను బట్టి రంగు మార్చేస్తోంది!
ఎలుకా.. మజాకా..!
వాళ్లిద్దరి చనువు వల్లే.. భార్యాభర్తల మధ్య గొడవలు
ఇక.. జ్ఞాపకంగా మిగలనున్న విశాఖ ఎయిర్పోర్ట్
వరల్డ్ వండర్ కిడ్స్ .. చిన్న వయసు.. పెద్ద మనసు!

