చీరలో చెన్నై లవ్ స్టోరీ బ్యూటీ.. చూడనీకి రెండు కళ్లు చాలవు
Samatha
2 August 2026
రీసెంట్‌గా రిలీజై మంచి సక్సెస్ అందుకున్న మూవీ చెన్నై లవ్ స్టోరీ. ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడమే కాకుండా, ప్రతి ఒక్కరి మనసు దోచుకుంది.
ఇక ఈ మూవీ చూసిన వారందరూ బ్యూటీ గౌరీ ప్రియ నటనకు, అందానికి ఫిదా అవుతున్నారు. అంతలా తన నటనతో ఆకట్టుకుంది.
చెన్నై లవ్ స్టోరీ మూవీతో మంచి సక్సెస్ అందుకున్న ముద్దుగుమ్మ హీరోయిన్ గౌరీ ప్రియ. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఈ చిన్నది 2018లో మిస్ హైదరాబాద్ టైటిల్ గెలుచుకుంది. తర్వాత వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ, తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.
ఇక ఆ తర్వాత నుంచి పలు సినిమాల్లో అవకాశాలు రావడంతో, హీరోయిన్‌గా కొనసాగుతూ వచ్చింది. ఈ బ్యూటీ హైదరాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్ మెంట్ స్టడీస్ పూర్తి చేసింది.
తర్వాత మిస్ హైదరాబాద్‌గా కిరీటం అందుకుంది. దీని తర్వాత వరసగా పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ తనకంటూ మంచి ఫేమ్ సంపాదించుకుంది.
అలాగే రీసెంట్‌గా చెన్నై లవ్ స్టోరీ మూవీలో హీరోయిన్‌గా చేసింది. అందులో తన నటనతో తెలుగు అభిమానుల మనసు గెలుచుకుంది. యూత్ ఫేవరెట్ అయిపోయింది.
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ, తాజాగా పట్టు చీరలో కుందనపు బొమ్మలా ఉన్న ఫొటోస్ షేర్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి.