AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nag Ashwin: 1200 కోట్ల సినిమా తీసిన డైరెక్టర్ సింప్లిసిటీ.. ఈవెంట్‌లో నేలపైనే కూర్చున్న నాగ్ అశ్విన్.. వీడియో ఇదిగో

ఈ రోజుల్లో ఒకటి, రెండు సినిమాలు చేసిన హీరోలు, దర్శకులు తాము పెద్ద సెలబ్రిటీలమని ఫీలవుతుంటారు. అలాంటిది 1200 కోట్ల పాన్ ఇండియా సినిమా, అందులోనూ ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్ లను డైరెక్ట్ చేసిన నాగ్ అశ్విన్ మాత్రం ఇలా సింప్లిసిటీతో అందరి మన్ననలు అందుకుంటున్నారు.

Nag Ashwin: 1200 కోట్ల సినిమా తీసిన డైరెక్టర్ సింప్లిసిటీ.. ఈవెంట్‌లో నేలపైనే కూర్చున్న నాగ్ అశ్విన్.. వీడియో ఇదిగో
Nag Ashwin
Basha Shek
|

Updated on: Jun 07, 2026 | 4:57 PM

Share

తెలుగులో ఉన్న ది మోస్ట్ ట్యాలెంటెడ్ డైరెక్టర్లలో నాగ్ అశ్విన్ ఒకరు. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో మొదలైన ఆయన ప్రస్థానం మహానటి, కల్కి సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ కు వెళ్లింది. ముఖ్యంగా కల్కి సినిమాతో నాగ్ అశ్విన్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రభాస్, అమితాబ్, దీపికా పదుకొణె, కమల్ హాసన్ వంటి ఎంతో మంది స్టార్స్ ను హ్యాండిల్ చేసిన విధానం అందరి మన్ననలు అందుకుంది. ప్రస్తుతం కల్కి 2 సినిమా పనుల్లో బిజీగా ఉంటున్నాడు నాగ్ అశ్విన్. కాగా కేవలం డైరెక్టర్ గానే కాకుండా అప్పుడప్పుడు నిర్మాతగానూ సత్తా చాటుతున్నారు అశ్విన్. అలా ఇప్పుడు వైజయంతీ మూవీస్ సమర్పణలో ‘సింగ్ గీతం’ అనే సినిమాను నిర్మిస్తున్నాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆదివారం (జూన్ 06) చెన్నైలో ఒక స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. లోకనాయకుడు, కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్ లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.

‘సింగ్ గీతం’ ఈవెంట్ కు పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు వచ్చారు. దీంతో గెస్టుల గ్యాలరీలో అతిథులకు, ప్రత్యేక ఆహ్వానితులకు కూర్చోవడానికి సీట్లు సరిపోలేదు. ఈ క్రమంలోనే తన సినిమా ఈవెంట్‌కు వచ్చిన అతిథులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని భావించిన నాగ్ అశ్విన్..ఎలాంటి భేషజాలకు పోకుండా నేల మీద కూర్చుండిపోయారు. తాను ఒక స్టార్ డైరెక్టర్ ని అనే విషయాన్ని పక్కన పెట్టి, సోఫాల పక్కనే కిందనే చాలా సేపు కూర్చుండిపోయారు. కమల్ హాసన్ లాంటి లెజెండ్స్ పక్కన కూర్చునే ఛాన్స్ ఉన్నప్పటికీ అతిథుల కోసం నాగ్ అశ్విన్ ఇలా కింద కూర్చోవడం చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నాగ్ అశ్విన్ సింప్లిసిటీపై అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్
జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్
విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు!
విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు!
హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు సర్జరీ.. ఎప్పుడు, ఎక్కడంటే?
హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు సర్జరీ.. ఎప్పుడు, ఎక్కడంటే?
పెరుగన్నం తిన్న వెంటనే కునుకు ఎందుకు వస్తుంది?.. ఇందులో నిజమెంత?
పెరుగన్నం తిన్న వెంటనే కునుకు ఎందుకు వస్తుంది?.. ఇందులో నిజమెంత?