Podarillu Episode today: గ్రామదేవతకు రక్తతర్పణం.. భార్యను చంపిన నారాయణ.. పగతో రగులుతున్న భార్య సోదరుడు
Podarillu latest episode today: స్టార్ మా ఛానెల్‌లో మంచి పాపులారిటీ సాధిస్తున్న సీరియల్ పొదరిల్లు . ఈరోజు ఎపిసోడ్‌లో గ్రామదేవతకి మొక్కు చెల్లించాలంటే ఏ ఊరు వెళ్లాలో కనిపెడతాడు మాధవ. ముందు తండ్రినే అడుగుతాడు. తనకు తెలిసినా తెలియనట్లు నారాయణ ఎందుకు నటించాల్సి వచ్చింది?

Podarillu Serial Today Aug 11th Episode: స్టార్ మా ఛానెల్‌లో మంచి పాపులారిటీ సాధిస్తున్న సీరియల్ పొదరిల్లు . ఈరోజు ఎపిసోడ్‌లో గ్రామదేవతకి మొక్కు చెల్లించాలంటే ఏ ఊరు వెళ్లాలో కనిపెడతాడు మాధవ. ముందు తండ్రినే అడుగుతాడు. తనకు తెలిసినా తెలియనట్లు నారాయణ ఎందుకు నటించాల్సి వచ్చింది? ఆ గ్రామం వెళితే మరో రూపంలో ఘోర ప్రమాదం పొంచి ఉందని గుర్తించాడా? వెళ్లకుండా తన పిల్లలను కాపాడుకుంటాడా? నరాలు తెగే సస్పెన్స్‌తో ఎపిసోడ్‌ని దర్శకుడు ముగిస్తారు.
గ్రామదేవత మొక్కు తీర్చేస్తే అంతా మంచే జరుగుతుంది. సిద్ధాంతి చెప్పిప్పుడు మనం వెళ్లాల్సిందే కదా.. మహాలక్ష్మి పెద్దితో అంటుంది. చక్రి సంబరపడతాడు. మనం వెళ్లాల్సింది అని మహా చెప్పింది అంటే కుటుంబంలో సభ్యురాలైపోయినట్లే అని ఫిక్సయిపోతాడు. గ్రామదేవత ఎక్కడ ఏ ఊళ్ళో ఉంటుంది అని నారాయణను అడుగుతారు. సమాధానం తెలిసి కూడా చెప్పకుండా నారాయణ దాటవేస్తాడు. తనకు సొంత గ్రామం ఏదో తెలియదనీ ఊహ తెలిసినప్పటి నుంచీ ఈ ఇల్లే తెలుసుననీ బుకాయిస్తాడు. సైట్‌కి బయల్దేరిన మాధవ్‌కు పెదనాన్న ఎదురొస్తాడు. కానీ గ్రామదేవత వివరాలు ఎంత అడిగినా చెప్పడు. మన రెండు కుటుంబాలు మళ్లీ కలుస్తాయనీ అనుకోకు అంటూ కాస్త ఓవరాక్షన్ కూడా చేస్తాడు.
మరో వైపు మనీషాను వెతుక్కుంటూ ఆమె బావ టిట్లా హైదరాబాద్ వస్తాడు. బావతో పెళ్లి ఇష్టం లేక మనీషా బీహార్ నుంచి హైదరాబాద్ వచ్చేస్తుంది. ఇంటికి తాళం వేసి బన్సీ మనీషాను మాధవ్ పని చేస్తున్న సైట్‌కు తీసుకొస్తాడు. తను ఎక్కడైనా తలదాచుకుంటాననీ కానీ మనీషాని ఎక్కడ ఉంచాలని అంటాడు. ఎవరికీ అనుమానం రాకుండా మనీషాని మా ఇంట్లో ఉంచుతాం అంటాడు మాధవ్. మనీషాని కంటికి రెప్పలా కాపాడుకోవాలని తమ్ముళ్లకు ఆర్డరేస్తాడు మాధవ్.

గ్రామదేవత అడ్రస్ ఎక్కడో గాయత్రిని అడుగుతుంది మహా. చిన్నప్పుడు వెళ్లినట్లు గుర్తు గ్రామం పేరు గుర్తులేదు అంటుంది గాయత్రి. అయితే మనీషాని నువ్వు పెళ్లిచేసుకోవాలని ఆ గ్రామదేవత మనింటికి పంపించిందని చక్రి అంటాడు. ఆశ్రయం కోరి వచ్చిన వారిని పెళ్లి చేసుకోవడం తప్పు అంటాడు మాధవ్. ఆశ్రయం కోరి ఏ ఆశ్రమానికో రాలేదు కదా. అయినా నీ మనసులో మనీషా ఉందని చక్రి అంటాడు. గ్రామదేవత వరంగల్‌లోని రుద్రవరం గ్రామంలో ఉందని మాధవతో పెదనాన్న అంటాడు. రుద్రాంబిక అమ్మవారి గుడిని కాకతీయులు కట్టించారని తమ తాతముత్తాతలు కొలిచారని చెబుతాడు. అయితే నువ్వొక్కడివే వెళ్లాలి అంటాడు. పెదనాన్న ఇలా మారిపోయాడేంటనీ మాధవ్ ఆశ్చర్యపోతాడు. పెదనాన్నను భయపెట్టి నిజం కక్కించింది ఎవరో కామెడీగా చూపించారు.
నీ రక్తం కళ్లజూస్తా.. నిన్ను చంపి జైలుకెళ్లిన నీ మొగుడు ఇన్నాళ్లకి రుద్రవరం వస్తున్నాడు. రుద్రవరంలోకి అడుగుపెట్టగానే రుద్రాంబిక అమ్మవారి సాక్ష్యంగా వాడి రక్తంతో నీకు అభిషేకం చేయిస్తానంటాడు నారాయణ మొదటి భార్య సోదరుడు. కారుకి దిష్టి తీస్తాడు నారాయణ. ఏ ఆటంకం లేకుండా అంతా సవ్యంగా జరిగేలా చూడు తల్లీ అంటూ రుద్రాంబిక తల్లిని వేడుకుంటాడు. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.