AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 10: రెండు సార్లు బిగ్‌బాస్‌ ఆఫర్‌ను రిజెక్ట్ చేసి! ఇప్పుడు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ‘రిషి సర్’

గతంలో ఒకసారి కాదు రెండు సార్లు బిగ్ బాస్ ఆఫర్ ను రిజెక్ట్ చేశాడీ సీరియల్ నటుడు. భారీ పారితోషికం ఇస్తామన్నా 'జాన్తా నై' అంటూ బిగ్ బాస్ ఆఫర్ ను వదులుకున్నాడు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు హౌస్ లోకి అడుగు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Bigg Boss Telugu 10: రెండు సార్లు బిగ్‌బాస్‌ ఆఫర్‌ను రిజెక్ట్ చేసి! ఇప్పుడు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన 'రిషి సర్'
Bigg Boss Telugu 10
Basha Shek
|

Updated on: Sep 06, 2026 | 11:11 PM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఆఖరి పదహారో కంటెస్టెంట్ గా ప్రముఖ సీరియల్ నటుడు ముఖేష్ గౌడ ఎంట్రీ ఇచ్చారు. రెండేళ్ల క్రితం వరకు తెలుగులో ప్రసారమైన ‘గుప్పెడంత మనసు’ సీరియల్ తో తెలుగు బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడు ముఖేష్. అందులో అతను పోషించిన రిషి సర్ పాత్ర బాగా ఫేమస్ అయ్యింది. ఎంతలా అంటే ఇప్పుడు ముకేశ్ గౌడ తన సొంత పేరు కంటే రిషి సార్ పేరుతోనే బాగా పాపులారిటీ, క్రేజ్ సొంతం చేసుకున్నాడు. కాగా ముఖేష్ స్వతహాగా కన్నడ ఇండస్ట్రీకి చెందిన వాడు. అయితేనేం తన యాక్టింగ్ తో తెలుగు ఆడియెన్స్  కు ఫేవరెట్ నటుడిగా మారిపోయాడు. సీరియల్స్ తో పాటు సినిమాల్లోనూ నటించాడు ముఖేష్. హీరోగానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. కన్నడతో పాటు తెలుగులోనూ ‘గీతా శంకరం’ అనే చిత్రం చేశాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. అయితే అవేవీ ముఖేష్ కు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. కాగా గతంలో పలు సార్లు ఇతనికి బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. భారీ రెమ్యునరేషన్ ఇస్తామని కూడా చెప్పినా ఈ రియాలిటీ షోకు దూరంగా ఉండిపోయాడు ముఖేష్.  ఓసారి తెలుగు, ఇంకోసారి కన్నడ బిగ్‌బాస్ షో నుంచి ఇతడికి అవకాశాలు వచ్చాయి. కానీ అప్పట్లో గేమ్, షో కాన్సెప్ట్ పూర్తిగా అర్థం కాకపోవడం వల్ల నో చెప్పానని ఓ ఇంటర్వ్యూలో ముఖేష్ గౌడ స్వయంగా చెప్పాడు.

అయితే ఎట్టకేలకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో  కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు ముఖేష్. ఈ సందర్భంగా బిగ్ బాస్ వేదికపై కాస్త ఎమోషనల్ గా మాట్లాడాడీ సీరియల్ నటుడు.  ‘పదేళ్ల ముందు నా జీవితంలో కొన్ని పరిస్థితుల వల్ల నటుడిని అవ్వాలనుకున్నా. జూనియర్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌మొదలు పెట్టాను.  హీరోగా కూడా చేశాను. నా  ట్యాలెంట్ చూపించి, జనాల మనసు గెలుచుకోవాలి. టాస్క్‌లో 100శాతం శక్తితో పోరాడతాను.  తెలుగు సినిమా ఇండస్ట్రీ నాకు అన్నం పెట్టింది. ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి’ అని కోరాడు ముఖేష్. మరి సీరియల్స్ తో తెలుగు ఆడియెన్స్ మనసుసలు గెల్చుకున్న ముఖేష్ బిగ్ బాస్ హౌస్ లో ఏ మేర ఆకట్టుకుంటాడో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
తెలుగులో ఆ హీరో నాకు బెస్ట్ ఫ్రెండ్..
తెలుగులో ఆ హీరో నాకు బెస్ట్ ఫ్రెండ్..
గణేష్ ఉత్సవాల్లో పోలిసుల అదుపులో 2935 మంది పోకిరీలు
గణేష్ ఉత్సవాల్లో పోలిసుల అదుపులో 2935 మంది పోకిరీలు
ఇదెక్కడి కొట్లాట రా సామీ.. కోతుల మధ్య గ్యాంగ్ వార్.. వీడియో
ఇదెక్కడి కొట్లాట రా సామీ.. కోతుల మధ్య గ్యాంగ్ వార్.. వీడియో
పితృ పక్షం.. శ్రాద్ధం ఉదయం ఎందుకు చేయరు? మధ్యాహ్నమే ఎందుకు..
పితృ పక్షం.. శ్రాద్ధం ఉదయం ఎందుకు చేయరు? మధ్యాహ్నమే ఎందుకు..
పోలీసుల పేరిట వీడియోకాల్‌ చేసి రూ.10 కోట్లు దోచేశారు!
పోలీసుల పేరిట వీడియోకాల్‌ చేసి రూ.10 కోట్లు దోచేశారు!
13 ఏళ్ల బాలుడిపై టీచర్ లైంగిక దాడి.. సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు
13 ఏళ్ల బాలుడిపై టీచర్ లైంగిక దాడి.. సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు
ఐరెన్ లెగ్ అన్న హీరోయిన్‌ను గోల్డెన్ లేగ్ మార్చిన రాఘవేంద్రరావు..
ఐరెన్ లెగ్ అన్న హీరోయిన్‌ను గోల్డెన్ లేగ్ మార్చిన రాఘవేంద్రరావు..
పెరుగు పుల్లగా మారిందా? డస్ట్‌బిన్‌లో వేయకండి.. ఇలా చేయండి!
పెరుగు పుల్లగా మారిందా? డస్ట్‌బిన్‌లో వేయకండి.. ఇలా చేయండి!
సన్‌ఫ్లవర్ నూనె vs పల్లీ నూనె.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
సన్‌ఫ్లవర్ నూనె vs పల్లీ నూనె.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
పెద్ద కుమారుడే అంత్యక్రియలు ఎందుకు నిర్వహిస్తారు? గరుడ పురాణం...
పెద్ద కుమారుడే అంత్యక్రియలు ఎందుకు నిర్వహిస్తారు? గరుడ పురాణం...