AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుమలలో నీటి కష్టాలు.. 110 రోజులకే నీటి నిల్వలు! సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

తిరుమల నీటి అవసరాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. తాగునీటి సమస్యతలెత్తకుండా సీఎం యాక్షన్ ప్లాన్ తో టిటిడి అలర్ట్ అయింది. 110 రోజులకు సరిపడే నీటి నిల్వలు ఉండటంతో తిరుమలలో తాగునీటి సమస్య తలెత్తకుండా యాక్షన్ లోకి దిగింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని శాశ్వత పరిష్కారానికి చొరవ చూపాలన్న సీఎం ఆదేశంతో తిరుమలకు అదనపు పైప్ లైన్ నిర్మాణం కార్యరూపం దాల్చబోతోంది.

తిరుమలలో నీటి కష్టాలు.. 110 రోజులకే నీటి నిల్వలు! సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Tirumala Water Shortage
Raju M P R
| Edited By: |

Updated on: Nov 28, 2026 | 12:00 PM

Share

తిరుమలలో నీటి సంక్షోభం పై ప్రభుత్వం ముందుగానే అప్రమత్త మైంది. ఎల్నినో ప్రభావంతో ఖాళీ అవుతున్న తిరుమలలోని డ్యాముల్లోని నీటి నిలువలు ఆందోళన కలిగిస్తుండడంతో టీటీడీని అప్రమత్తం చేసింది. ఎక్కడా నీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో సిద్ధం కావాలన్న సీఎం ఆదేశంతో టీటీడీ కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం తిరుమలలోని రిజర్వాయర్లలో ఉన్న నీటి లభ్యత, అవసరం, వినియోగం పై లెక్కలు వేసుకున్న టీటీడీ ఈనెల 18న ఈ మేరకు నివేదిక తయారు చేసింది. 116 రోజులకు కూడా సరిపడని నీటిని నిలువలు ఉన్నట్లు గుర్తించింది. తిరుమలలోని పాప వినాశనం, గోగర్భం, ఆకాశగంగ, కుమారధార పసుపుదార డ్యాములతో కళ్యాణి డ్యాం లో ఉన్న నీటి నిలువల లెక్కలను బయటపెట్టింది.

ఈ మేరకు తిరుమల లోని 5 డ్యాముల్లో ఫుల్ స్టోరేజ్ 14304.65 లక్షల గ్యాలన్లు కాగా ప్రస్తుతం 3654.77 లక్షల గ్యాలన్లు నీటి నిలువలు ఉన్నాయి. ఇందులో డెడ్ స్టోరేజ్ 424.15 లక్షల గ్యాలన్లు మినహాయిస్తే 3230.62 లక్షల గ్యాలన్లు నెట్ స్టోరేజ్ నీటి నిలువలుగా టిటిడి లెక్కలు చెబుతున్నాయి. తిరుమల నీటి అవసరాలను తీర్చుతున్న ఆరు డ్యాముల్లో నీటి విలువలు ఆందోళన కలిగిస్తుండగా రెండు రోజుల క్రితం సీఎం తిరుమల పర్యటనలను తిరుమల నీటి కష్టాలు చర్చకు వచ్చాయి. తిరుమలలోని ఆకాశ గంగ, కుమార ధార, పసుపు ధార, గోగర్భం, పాపనాశనం డ్యామ్ లతో పాటు తిరుపతిలోని కళ్యాణి డ్యాం ద్వారా జరుగుతున్న నీటి సరఫరా, నిల్వల వివరాలను టీటీడీ సీఎం దృష్టికి తీసుకెళ్ళింది.

ఇప్పటికే ఆకాశగంగ, గోగర్భం డ్యామ్ లు డెడ్ స్టోరేజ్ కు చేరుకోగా మిగతా డ్యాముల్లో అందుబాటులో ఉన్న నీటి నిల్వలు 110 రోజులకు కూడా కష్టమన్న విషయాన్ని తీల్చి చెప్పింది. తిరుమలలో నీటి డిమాండ్ రోజు 52 లక్షల గ్యాలన్లు కాగా, ప్రస్తుతం రోజు తిరుమలలోని డ్యాంల నుంచి నుంచి 30 లక్షల గ్యాలన్లు, మిగతా 20 లక్షల గ్యాలన్ల నీటిని కళ్యాణి డాం నుంచి టీటీడీ పంపింగ్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

కళ్యాణి డ్యామ్ ఫుల్ స్టోరేజ్ 56775 లక్షల గ్యాలెన్లు కాగా 9355.50 లక్షల గ్యాలన్లు. ప్రస్తుతం నీటి నిలువలు ఉన్నట్లు ఈ నెల 18న టీటీడీ సమర్పించిన రిపోర్టు స్పష్టం చేస్తోంది. కళ్యాణి డ్యాం డెడ్ స్టోరేజ్ 2120.58 లక్షల గ్యాలన్లు మినహాయిస్తే ఇక అందుబాటులో ఉన్న నీరు 7234.92 లక్షల గ్యాలన్లు కాగా పది శాతం మేర ఆవిరి అయ్యే అవకాశం ఉంటుంది. ఇక మిగిలింది కళ్యాణి డ్యాం లో 6421.62 లక్షల గ్యాలన్లు మాత్రమే. ఇక, ఎల్ నినో ప్రభావంతో గత ఏడాది కంటే 75 శాతం అధికంగా నీరు ఆవిరి కావడం తో డ్యాములు ఖాళీ అవుతుండడంతో తిరుమలలో నీటి కష్టాలను అధిగమించేందుకు టీటీడీ ఇప్పటికే యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది. తిరుపతి నుంచి అదనంగా మరో కొత్త పైపులైన్ వేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.

గతంలో 24 గంటలపాటు నీటి సరఫరా జరుగు తున్న తిరుమలలో ప్రస్తుతం 4 గంటలపాటు మాత్రమే నీటి విడుదల చేస్తోంది.  ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటల పాటు నీటి సరఫరా చేస్తున్న టిటిడి తిరుమలలో నీటి కష్టాలు పెరగడంతో హోటల్స్, అతిథి గృహాల్లో నీటి పొదుపు పాటిస్తోంది. ఇక తిరుమలలో దాహార్తి సమస్య తలెత్తకుండా సీఎం టీటీడీకి దిశా డిద్దేశం చేశారు. కళ్యాణి డాం నుంచి పూర్తిస్థాయి నీటి వినియోగం తిరుమలకు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతోపాటు హంద్రీ నీవా నీటిని కళ్యాణి డ్యామ్ కి తరలించేలా చర్యలకు ఆదేశించారు.

…అవసరమైతే కళ్యాణిడ్యామ్ నీటి పూర్తి వినియోగం తిరుమలకే.

ఇక కండలేరు నుంచి రామాపురం లోని కైలాసగిరి రిజర్వాయర్ కు నీటిని తరలించి తిరుపతి ప్రజల నీటి అవసరాలు తీర్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. దీంతో ఒక టీఎంసీ నీటిని తిరుపతి ప్రజల నీటి అవసరాల కోసం వినియోగించుకునే అవకాశం ఉండగా సోమశిల నుంచి బాలాజీ రిజర్వాయర్ కు నీటిని తరలించేలా ప్రణాళికలను సిద్ధం చేసే పనిలో అధికార యంత్రాంగం ఉంది. తిరుమల నీటి అవసరాల కోసం కళ్యాణి డ్యామ్ నుంచి 2వ పైప్ లైన్ నిర్మాణం చేపట్టాలన్న సీఏం చంద్రబాబు ఆదేశాలతో టీటీడీ కూడా సమాయత్త మవుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
తిరుమలలో నీటి కష్టాలు,110 రోజులకే నీటి నిల్వలు! సీఎం కీలక ఆదేశాలు
తిరుమలలో నీటి కష్టాలు,110 రోజులకే నీటి నిల్వలు! సీఎం కీలక ఆదేశాలు
నాని, కళ్యాణ్ రామ్‏తో సినిమాలు.. ఇండస్ట్రీలోనే క్రేజీ హీరోయిన్..
నాని, కళ్యాణ్ రామ్‏తో సినిమాలు.. ఇండస్ట్రీలోనే క్రేజీ హీరోయిన్..
తెలంగాణలో ఇండస్ట్రియల్ పాలసీ 2.0.. తయారీ రంగానికి కొత్త దశ
తెలంగాణలో ఇండస్ట్రియల్ పాలసీ 2.0.. తయారీ రంగానికి కొత్త దశ
IPL 2027 Captains: 7 జట్ల కెప్టెన్లు ఫిక్స్.. 3 జట్లకు ఎవరంటే?
IPL 2027 Captains: 7 జట్ల కెప్టెన్లు ఫిక్స్.. 3 జట్లకు ఎవరంటే?
కార్తిక దీపం రూపంలో మృత్యువు.. చిన్న నిర్లక్ష్యం 18 ఏళ్ల యువతి
కార్తిక దీపం రూపంలో మృత్యువు.. చిన్న నిర్లక్ష్యం 18 ఏళ్ల యువతి
బ్యాంక్ లాకర్లలో బంగారం దాచుకునేవారు ఈ విషయం మర్చిపోవద్దు..
బ్యాంక్ లాకర్లలో బంగారం దాచుకునేవారు ఈ విషయం మర్చిపోవద్దు..
తెలంగాణ యువతకు గుడ్‌న్యూస్.. విదేశాల్లో ఉద్యోగం వస్తే..
తెలంగాణ యువతకు గుడ్‌న్యూస్.. విదేశాల్లో ఉద్యోగం వస్తే..
మీరు ఏ గదిని ఎంచుకుంటారు? ఈ పర్సనాలిటీ టెస్ట్ మీ అసలు స్వభావాన్ని
మీరు ఏ గదిని ఎంచుకుంటారు? ఈ పర్సనాలిటీ టెస్ట్ మీ అసలు స్వభావాన్ని
అట్టర్ ప్లాప్ సినిమా అన్నారు.. అతడు చెప్పిన ఆ ఒక్క మాటకు షాకయ్యా.
అట్టర్ ప్లాప్ సినిమా అన్నారు.. అతడు చెప్పిన ఆ ఒక్క మాటకు షాకయ్యా.
డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..
డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..