AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటి ముందు దీపం వెలిగించడమే శాపమైందా? 18 ఏళ్ల యువతి దుర్మరణం!

పండుగ వేళ ఆనందంగా ఉండాల్సిన ఒక కుటుంబంలో ఊహించని పెను విషాదం అలుముకుంది. ఎంతో భక్తిశ్రద్ధలతో ఇంటి ముందు వెలిగించిన కార్తిక దీపమే ఒక 18 ఏళ్ల యువతి నిండు ప్రాణాలను బలిగొంది. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.అసలు ఏం జరిగిందంటే?

ఇంటి ముందు దీపం వెలిగించడమే శాపమైందా? 18 ఏళ్ల యువతి దుర్మరణం!
Karthika Deepam Accident
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Nov 28, 2026 | 11:38 AM

Share

పండుగ వేళ ఇంటి ముందు వెలిగించిన దీపం ఓ యువతి జీవితంలో తీరని విషాదాన్ని నింపింది. ఎంతో భక్తితో వెలిగించిన కార్తిక దీపం కారణంగా 18 ఏళ్ల యువతి తీవ్రంగా గాయపడి చివరకు ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అడ్డగుట్ట వెస్ట్రన్ హిల్స్‌లో నివాసముండే సాయి వెంకట సింధు రోడ్ నంబర్ 5లో ఎస్ఎస్ బొటిక్ నిర్వహిస్తోంది. ఈ నెల 12న రాత్రి షాప్ పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఇంటి గేటు వద్ద వెలిగించి ఉంచిన కార్తిక దీపం అనుకోకుండా సింధు చీరకు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు చీరకు అంటుకుని శరీరమంతా వ్యాపించాయి. ఊహించని ఈ పరిణామంతో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే స్పందించిన కుటుంబసభ్యులు సింధును ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే, వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు. చికిత్స పొందుతూ సింధు మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

చిన్న వయసులోనే సొంతంగా బొటిక్ నిర్వహిస్తూ జీవితంలో ముందుకు సాగుతున్న యువతి ఇలా అర్ధాంతరంగా కన్నుమూయడం స్థానికులను కలచివేసింది. పండుగలు, పూజల సమయంలో దీపాలు వెలిగించేటప్పుడు చుట్టుపక్కల వస్త్రాలు, తెరలు, ఇతర మండే వస్తువులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us