చట్టంతో మీ తాట తీస్తాం అంటూ ఓవైపు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కొరడాపట్టుకుని వాతలు పెడుతున్నా...బరితెగించిన కొన్ని రెస్టారెంట్లు కంపుకొట్టే ఆహారాన్నే మనముందు వేడివేడిగా వడ్డిస్తున్నాయి. ఒకవైపు వరుస తనిఖీలతో హోటల్స్.. రెస్టారెంట్లపై ఉక్కుపాదం మోపుతున్నా.. కొందరు నిర్వహికులు మాత్రం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూనే ఉన్నారు. సీజ్ చేస్తున్నా.. కఠిన చర్యలు తీసుకుంటున్నా.. రెస్టారెంట్లు, హోటల్స్ తీరు ఏమాత్రం మారడంలేదు.