AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంగన్‌వాడీ చిన్నారులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే సరికొత్త పథకం.. ఉదయాన్నే..

అంగన్‌వాడీ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని తెలంగాణలోని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు సమతుల్య పోషకాహారం అందించడమే లక్ష్యంగా ఇప్పటికే పలు కార్యక్రమాలను, పథకాలను అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే.. చిన్నారుల కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

అంగన్‌వాడీ చిన్నారులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే సరికొత్త పథకం.. ఉదయాన్నే..
Anganwadi Centre
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Feb 28, 2026 | 11:04 AM

Share

అంగన్‌వాడీ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని తెలంగాణలోని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు సమతుల్య పోషకాహారం అందించడమే లక్ష్యంగా ఇప్పటికే పలు కార్యక్రమాలను, పథకాలను అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే.. చిన్నారుల కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో చదివే చిన్నారులకు అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్‌) అందించే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. తొలుత ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లాల్లో ప్రారంభించి, అనంతరం కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.

తెలంగాణను చిన్నారుల్లో, గర్భిణుల్లో పోషక లోప రహిత రాష్ట్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని సీతక్క స్పష్టం చేశారు. మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో కౌమార బాలికల్లో రక్తహీనత సమస్యను తగ్గించేందుకు ప్రత్యేక అదనపు పోషకాహార పథకం ఇప్పటికే అమలులో ఉందని మంత్రి తెలిపారు. దీన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈనెల 20న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, శిశు సంక్షేమశాఖ కార్యాలయంలో శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, కమిషనర్ శ్రుతి ఓజా తదితరులతో కలిసి మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. అమలులో ఉన్న పథకాలు, ఖర్చులు, భవిష్యత్ కార్యాచరణపై జిల్లా అధికారులతో చర్చించారు.

రాష్ట్రంలో కొత్తగా 2,199 అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాలు మంజూరు చేసినప్పటికీ, ఇప్పటివరకు 500 మాత్రమే పూర్తయ్యాయని వెల్లడించారు. మిగతా నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ‘సాక్ష్యం అంగన్‌వాడీ’ కార్యక్రమం కింద అన్ని కేంద్రాల్లో పోషకాహారం, ప్రీ-స్కూల్ విద్య, పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ములుగు జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్‌గా చిన్నారులకు పాలు అందిస్తున్నామని చెప్పారు. అలాగే బాల్యవివాహాల నిర్మూలన కోసం ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి తెలంగాణను బాల్యవివాహాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో టీజీ ఫుడ్స్ ఛైర్మన్ ఫహీం, ఎండీ చంద్రశేఖర్ రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us