AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG Cylinders: తెలంగాణ వ్యాప్తంగా 37 లక్షల గృహ ఎల్‌పీజీ సిలిండర్లు..!

LPG Cylinders: పెరిగిన డిమాండ్‌ను సమర్థవంతంగా అధిగమించడానికి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు నిరంతరం నిల్వల స్థితిగతులను సమీక్షిస్తున్నాయి. దీనితో పాటు రవాణా, పంపిణీ ప్రణాళికలను అవి నిశితంగా సమన్వయం చేసుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ తగినంత అందుబాటులో ఉన్నాయని..

LPG Cylinders: తెలంగాణ వ్యాప్తంగా 37 లక్షల గృహ ఎల్‌పీజీ సిలిండర్లు..!
Lpg Gas
Subhash Goud
|

Updated on: May 25, 2026 | 6:02 PM

Share

LPG Cylinders: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్న ప్రస్తుత సమయంలో ఇంధన డిమాండ్ పెరిగినప్పటికీ నిరంతర సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వ రంగ చమురు సంస్థలు..రాష్ట్రవ్యాప్తంగా అంతరాయం లేకుండా పెట్రోల్ (ఎంఎస్), డీజిల్ (హెచ్ఎస్‌డీ), ఎల్‌పీజీ అందుబాటులో ఉండేలా చూసేందుకు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లు.. తమ కార్యకలాపాలు, రవాణా ఏర్పాట్లను రాత్రింబవళ్లు సమన్వయం చేసుకుంటున్నాయని పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

వివిధ రంగాల్లో ఇంధన డిమాండ్ ఒక్కసారిగా పెరిగినప్పటికీ సరఫరా వ్యవస్థ ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగా సాగుతోందని తెలిపింది. ముఖ్యంగా 2026 మే నెలలో తెలంగాణలో పంట కోత, వ్యవసాయ పనులు ఊపందుకోవటంతో పాటు భారీ ఎత్తున ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోంది. దీనివల్ల ఇటీవల కాలంలో చమురు ఉత్పత్తులకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. ధరలు తక్కువ ఉండటంతో ప్రైవేట్ బంకుల వినియోగదారులు సైతం ప్రభుత్వ రంగ పెట్రోల్ బంకుల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ రంగ విక్రయ కేంద్రాల్లో ధరల ప్రయోజనం ఉండటంతో సంస్థాగత, వాణిజ్య వినియోగదారులు సైతం వీటి నుంచే ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Indian Railways: రైలులో ప్రయాణించే ముందు ఈ పొరపాటు అస్సలు చేయకండి.. లేకపోతే మీరు జైలుపాలే..!

ఇదిలా ఉంటే 2026 మే నెలలో తెలంగాణలో ఇంధన విక్రయాలు బలమైన వృద్ధిని నమోదు చేశాయి. సాధారణ వృద్ధి రేటు కంటే చాలా ఎక్కువగా.. డీజిల్ (రిటైల్) విక్రయాలు 12.6 శాతం, పెట్రోల్ (రిటైల్) విక్రయాలు 9 శాతం పెరిగాయి. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) పెట్రోల్ ‌బంకుల్లో జరిగిన డీజిల్ అమ్మకాలు 25 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేయగా.. 12 జిల్లాల్లో 15 నుంచి 25 శాతం మధ్య వృద్ధి నమోదైంది. మే నెలలో చమురు మార్కెటింగ్ సంస్థలు (ఓఎంసీ) తెలంగాణవ్యాప్తంగా 37 లక్షలకు పైగా గృహావసరాల ఎల్‌పీజీ సిలిండర్లను సరఫరా చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.

చమురు నిల్వలపై సమీక్ష:

పెరిగిన డిమాండ్‌ను సమర్థవంతంగా అధిగమించడానికి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు నిరంతరం నిల్వల స్థితిగతులను సమీక్షిస్తున్నాయి. దీనితో పాటు రవాణా, పంపిణీ ప్రణాళికలను అవి నిశితంగా సమన్వయం చేసుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ తగినంత అందుబాటులో ఉన్నాయని వినియోగదారులకు భరోసా ఇస్తున్న చమురు పరిశ్రమ.. కేంద్ర పెట్రోలియం శాఖ, రాష్ట్ర పరిపాలనా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ నిరంతర సరఫరాకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.

ఇంధన లభ్యతకు సంబంధించిన కచ్చితమైన తాజా సమాచారం కోసం వినియోగదారులు కేవలం అధీకృత సంస్థలు, చమురు మార్కెటింగ్ సంస్థలు (ఓఎంసీ) ఇచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని సూచిస్తోంది.

ఇది కూడా చదవండి: LPG Gas Tips: వంట గ్యాస్‌ను ఆదా చేసే రహస్యం మీకు తెలుసా? ఇలా చేస్తే 30 రోజులకు సరిపోయే సిలిండర్‌ను 45 రోజుల పాటు వాడుకోండి..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
తిరుపతిలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం
తిరుపతిలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం
భారత గడ్డపై పుట్టి, ఆస్ట్రేలియా తరపున ఎంట్రీ.. డెబ్యూలోనే అదుర్స్
భారత గడ్డపై పుట్టి, ఆస్ట్రేలియా తరపున ఎంట్రీ.. డెబ్యూలోనే అదుర్స్
ఖమ్మంలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
ఖమ్మంలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
ఫేస్‌బుక్‌లో చాటింగ్.. అడిగినంత డబ్బు ఇచ్చాడు.. తీరా కలవడానికి
ఫేస్‌బుక్‌లో చాటింగ్.. అడిగినంత డబ్బు ఇచ్చాడు.. తీరా కలవడానికి
మీ ఇంట్లో ఈ పిరమిడ్ పెట్టి చూడండి.. జాక్ పాట్ కొట్టినట్టే!
మీ ఇంట్లో ఈ పిరమిడ్ పెట్టి చూడండి.. జాక్ పాట్ కొట్టినట్టే!
ఈ నటుడు మల్టీ ట్యాలెంటెడ్.. విమానాలు నడుపుతాడు.. డెంటిస్ట్ కూడా..
ఈ నటుడు మల్టీ ట్యాలెంటెడ్.. విమానాలు నడుపుతాడు.. డెంటిస్ట్ కూడా..
రెండో విడతలో వారికే ఇందిరమ్మ ఇండ్లు.. మంత్రి కీలక ఆదేశాలు
రెండో విడతలో వారికే ఇందిరమ్మ ఇండ్లు.. మంత్రి కీలక ఆదేశాలు
2027 వరల్డ్ కప్ రేస్ నుంచి హార్దిక్‌తోపాటు తెలుగోడు ఔట్?
2027 వరల్డ్ కప్ రేస్ నుంచి హార్దిక్‌తోపాటు తెలుగోడు ఔట్?
మేష రాశిలో కుజుడు.. ఆ రాశుల వారు వైవాహిక జీవితంలో జాగ్రత్త..!
మేష రాశిలో కుజుడు.. ఆ రాశుల వారు వైవాహిక జీవితంలో జాగ్రత్త..!
అల్లం త్వరగా ఎండిపోతోందా? ఈ చిట్కాలు పాటిస్తే నెల రోజులైనా తాజాగా
అల్లం త్వరగా ఎండిపోతోందా? ఈ చిట్కాలు పాటిస్తే నెల రోజులైనా తాజాగా