AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ వాకింగ్ బాడీకి మెడిటేషన్‌తో సమానమా? ఫిట్‌నెస్ ఫ్రీక్స్ కోసమే ఈ సీక్రెట్

సోషల్ మీడియా పుణ్యమా అని ఈ రోజుల్లో రకరకాల వర్కౌట్‌లు ట్రెండ్ అవుతున్నాయి. అందులో ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్నది 'తాయ్‌ చి వాకింగ్'. పొట్ట కొవ్వును కరిగించేస్తుందని, సులభంగా బరువు తగ్గించగలదని యూట్యూబ్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే, ఇందులో నిజమెంత? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ఈ వాకింగ్ బాడీకి మెడిటేషన్‌తో సమానమా? ఫిట్‌నెస్ ఫ్రీక్స్ కోసమే ఈ సీక్రెట్
Tai Chi Walking.jpg
Nikhil
|

Updated on: May 25, 2026 | 10:56 PM

Share

తాయ్‌ చి వాకింగ్ అనేది శరీరాన్ని నెమ్మదిగా, ఉద్దేశపూర్వకంగా కదిలించే ఒక వ్యాయామ పద్ధతి. చైనా సంస్కృతిలో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కళను భారతదేశంలోని యోగాతో పోల్చవచ్చు. ఇది సమతుల్యత, శరీర భంగిమ, సమన్వయంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ చేసే వర్కౌట్. కీళ్లపై అధిక భారం వేయకుండా నియంత్రిత పద్ధతిలో శరీర బరువును మారుస్తూ సాగే ఈ నడక, మనస్సు-శరీర సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది.

వారికి గొప్ప వరం..

వయసు పెరిగే కొద్దీ వచ్చే మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి సమస్యలతో బాధపడే వారికి ఈ వాకింగ్ ఒక వరం అని చెప్పొచ్చు. ఇది కాళ్లపై ఒత్తిడిని చాలా తగ్గిస్తుంది. ఒక కాలుపై శరీరం బరువును మోపుతూ, మరొక కాలును నెమ్మదిగా కదిలించడం ద్వారా శరీర స్థిరత్వం పెరుగుతుంది. దీనివల్ల పడిపోయే ప్రమాదం తగ్గుతుంది. నాడీ సంబంధిత సమస్యలు ఉన్నవారికి, గాయాల నుంచి కోలుకుంటున్న వారికి ఇది మెరుగైన ఫలితాలను ఇస్తుంది. అథ్లెట్లు కూడా గాయాల బారి నుంచి తప్పించుకోవడానికి దీనిని ఒక వ్యాయామంగా ఎంచుకుంటారు.

బరువు తగ్గడానికి షార్ట్‌కట్?

చాలామంది దీనిని బరువు తగ్గడానికి ఒక మ్యాజిక్ షార్ట్‌కట్‌గా భావిస్తుంటారు, కానీ అది వాస్తవం కాదు. కేవలం ఏడు నిమిషాల తాయ్‌ చి వాకింగ్‌తో పొట్టలోని కొవ్వు అద్భుతంగా కరిగిపోతుందని ఆశించడం పొరపాటు. పరుగు లేదా కార్డియో వ్యాయామాల మాదిరిగా ఇది అధిక కేలరీలను దహించే వ్యాయామం కాదు. బరువు తగ్గాలనుకునే వారు సరైన కార్డియో వర్కౌట్స్, కోర్ స్ట్రెంగ్తెనింగ్ వ్యాయామాలు, ప్రోటీన్ అధికంగా ఉండే సమతుల్య ఆహారంతో కూడిన జీవనశైలిని పాటించాలి. తాయ్‌ చి ఒక ఫిట్‌నెస్ సాధన మాత్రమే కానీ, బరువు తగ్గడానికి కేవలం ఇది సరిపోదు.

ముఖ్యంగా, ఈ వ్యాయామాన్ని సరైన మార్గదర్శకత్వంలోనే నేర్చుకోవాలి. ఇప్పటికే తీవ్రమైన వెన్నుముక సమస్యలు లేదా కీళ్లవాతం ఉన్నవారు నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. సరైన పద్ధతిలో కాకపోతే కీళ్ల అమరికలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి, ఆకర్షణీయమైన ప్రకటనలు చూసి మోసపోకుండా, ఆరోగ్యం కోసం ఒక క్రమశిక్షణతో కూడిన పద్ధతిని ఎంచుకోండి.

Follow Us
కలలో కనిపించింది.. నిజంగానే దొరికింది! 27 కేజీల రియల్ గోల్డ్
కలలో కనిపించింది.. నిజంగానే దొరికింది! 27 కేజీల రియల్ గోల్డ్
గేమర్స్‌ కోసం వన్‌ప్లస్‌ నుంచి ఇయర్‌‌ బడ్స్.. ఫీచర్లు ఇవే
గేమర్స్‌ కోసం వన్‌ప్లస్‌ నుంచి ఇయర్‌‌ బడ్స్.. ఫీచర్లు ఇవే
ఇద్దరు మాస్టార్ల కుమ్ములాట.. అసలు మేటరేంటి చెప్మా..?
ఇద్దరు మాస్టార్ల కుమ్ములాట.. అసలు మేటరేంటి చెప్మా..?
మహిళల రక్షణలో డిజిటల్ తోడు ఈ సేఫ్టీ యాప్స్.. ప్రత్యేకతలివే
మహిళల రక్షణలో డిజిటల్ తోడు ఈ సేఫ్టీ యాప్స్.. ప్రత్యేకతలివే
ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ కన్నడ మర్డర్ మిస్టరీ..
ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ కన్నడ మర్డర్ మిస్టరీ..
గూగుల్ మ్యాప్స్ దాస్తున్న ఆసక్తికరమైన నిజాలు
గూగుల్ మ్యాప్స్ దాస్తున్న ఆసక్తికరమైన నిజాలు
అద్భుతమైన హెల్త్ ఫీచర్లతో బోట్‌ నుంచి స్మార్ట్‌ వేరబుల్‌
అద్భుతమైన హెల్త్ ఫీచర్లతో బోట్‌ నుంచి స్మార్ట్‌ వేరబుల్‌
తెలుగులో బ్యాన్ చేశారు.. కట్ చేస్తే.. బిగ్ బాస్‏లోకి ఎంట్రీ..
తెలుగులో బ్యాన్ చేశారు.. కట్ చేస్తే.. బిగ్ బాస్‏లోకి ఎంట్రీ..
డీమార్ట్ ఊహించని నిర్ణయం.. వాటి దెబ్బకు 7 నగరాల్లో షట్టర్ క్లోజ్
డీమార్ట్ ఊహించని నిర్ణయం.. వాటి దెబ్బకు 7 నగరాల్లో షట్టర్ క్లోజ్
'కన్నీళ్లతో మా బాధను ముడిపెట్టొద్దు'.. జానకి మనవరాలు ఎమోషనల్
'కన్నీళ్లతో మా బాధను ముడిపెట్టొద్దు'.. జానకి మనవరాలు ఎమోషనల్
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం