AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈజీగా బరువు తగ్గేందుకు జపనీస్‌ 3-3-3 వాకింగ్ ఫార్ములా.. ఇది నిజంగా పనిచేస్తుందా?

మారుతున్న జీవనశైలి కారణంగా నేటి రోజుల్లో అధిక బరువు, ఊబకాయం పెద్ద సమస్యలుగా మారాయి. బరువు తగ్గడం కోసం చాలామంది కఠినమైన డైటింగ్స్, గంటల తరబడి జిమ్‌లలో కష్టపడటం చేస్తుంటారు. అయితే ఎలాంటి పరికరాలు, ఖరీదైన జిమ్ సభ్యత్వాలు లేకుండా కేవలం నడకతోనే వేగంగా బరువు తగ్గేందుకు జపాన్‌కు చెందిన 3-3-3 వాకింగ్ ఫార్ములా ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఏమిటీ 3-3-3 వాకింగ్ ఫార్ములా?

ఈజీగా బరువు తగ్గేందుకు జపనీస్‌ 3-3-3 వాకింగ్ ఫార్ములా.. ఇది నిజంగా పనిచేస్తుందా?
Japanese 3 3 3 Walking Method
Jyothi Gadda
|

Updated on: Oct 13, 2026 | 8:45 PM

Share

బరువు తగ్గడానికి, ఫిట్‌గా ఉండటానికి జపనీస్ 3-3-3 వాకింగ్ ఫార్ములా ప్రస్తుతం విశేష ఆదరణ పొందుతోంది. సాధారణంగా ఒకే వేగంతో గంటల తరబడి నడవడానికి బదులుగా, 3 నిమిషాలు వేగంగా 3 నిమిషాలు సాధారణ వేగంతో మార్చి మార్చి నడవడమే ఈ పద్ధతి. ఈ సైకిల్‌ను 18 నుండి 30 నిమిషాల పాటు పునరావృతం చేస్తారు. ఇది జీవక్రియను వేగవంతం చేసి ఎక్కువ క్యాలరీలను కరిగిస్తుంది. జిమ్‌కు వెళ్లే సమయం లేని వారికి, బిగినర్లకు, వయసు పైబడిన వారికి ఈ పద్ధతి ద్వారా సులువుగా బరువు తగ్గవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

జపాన్‌లోని శిన్షూ యూనివర్సిటీ పరిశోధకులు ప్రాచుర్యంలోకి తెచ్చిన ఈ పద్ధతి చాలా సులువైనది. సాధారణంగా అందరూ ఒకే వేగంతో నడుస్తారు. కానీ, దీనిలో నడిచే వేగాన్ని నిరంతరం మారుస్తూ ఉండాలి.

మొదటి 3 నిమిషాలు: సాధారణ, సౌకర్యవంతమైన వేగంతో నడవాలి.

ఇవి కూడా చదవండి

తరువాతి 3 నిమిషాలు: వేగంగా, వేగవంతమైన నడక చేయాలి (చేతులు వేగంగా కదులుతూ, గుండె వేగం పెరిగేలా).

ఈ 3+3 +3నిమిషాల సైకిల్‌ను రోజుకు కనీసం 3 నుండి 5 సార్లు (మొత్తం 18 నుండి 30 నిమిషాలు) పునరావృతం చేయాలి.

ఇది నిజంగా బరువు తగ్గడానికి సహాయపడుతుందా?

ఖచ్చితంగా సహాయపడుతుంది. సాధారణ నడక కంటే ఇంటర్వెల్ వాకింగ్ పద్ధతి బరువు తగ్గించడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని పరిశోధనలు నిరూపించాయి.

జీవక్రియ పెరుగుతుంది: వేగంగా, నెమ్మదిగా నడవడం వల్ల గుండె స్పందన రేటు మారుతూ ఉంటుంది. దీనివల్ల వర్కౌట్ పూర్తయిన తర్వాత కూడా శరీరం క్యాలరీలను కరిగిస్తూనే ఉంటుంది.

పొట్ట చుట్టూ కొవ్వు కరుగుతుంది: రోజువారీగా ఈ వాకింగ్ చేయడం వల్ల విసెరల్ ఫ్యాట్ పొట్ట ప్రాంతంలో పేరుకుపోయే కొవ్వు వేగంగా కరుగుతుంది.

స్టామినా, కండరాల బలం: కాలు కండరాలను బలోపేతం చేయడంతో పాటు రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

ఎవరు చేయవచ్చు?

బిగినర్స్, వయసు పైబడిన వారు, ఎక్కువ సమయం కేటాయించలేని ఉద్యోగులకు ఇది సరైన ఎంపిక. రోజుకు కేవలం 20-30 నిమిషాల పాటు వారానికి 4-5 రోజులు ఈ 3-3-3 పద్ధతిని క్రమం తప్పకుండా పాటిస్తూ, సమతుల్య ఆహారం తీసుకుంటే కొద్ది వారాల్లోనే స్పష్టమైన మార్పును గమనించవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us