AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

8 నెలల కష్టం ఒక్క నెలలోనే వృథా.. మళ్లీ రంగంలోకి బిట్టు తబాహి!

మధ్యప్రదేశ్ రాజ్‌గఢ్ జిల్లాకు చెందిన 21 ఏళ్ల యువకుడు బిట్టు తబాహి (సురేంద్ర సింగ్ చౌదరి) అజనార్ నదిని ఎనిమిది నెలలు శ్రమించి ఒంటరిగా శుభ్రం చేశాడు. అయితే, ప్రజల నిర్లక్ష్యం వల్ల కేవలం ఒక్క నెలలోనే ఆ నది మళ్లీ ప్లాస్టిక్, చెత్తాచెదారంతో కలుషితమైంది. తన ఎనిమి నెలల కష్టం ముప్పై రోజుల్లోనే బూడిదైందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, నిరాశ చెందకుండా నదిని మళ్లీ శుభ్రం చేసే పనులను తిరిగి ప్రారంభించారు.

8 నెలల కష్టం ఒక్క నెలలోనే వృథా.. మళ్లీ రంగంలోకి బిట్టు తబాహి!
Ajnar River Before And Afte
Jyothi Gadda
|

Updated on: Oct 13, 2026 | 5:47 PM

Share

సమాజంలో మార్పు తేవడానికి ఒక్కరి సంకల్పం చాలనేది నిజమే అయినప్పటికీ, పౌర స్పృహ లోపించడం వల్ల మంచి పనులకు ఎలాంటి అడ్డంకులు ఎదురవుతాయో చెప్పే ఒక ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. మధ్యప్రదేశ్ రాజ్‌గఢ్ జిల్లాలో ప్రవహించే అజనార్ నదిని ఎనిమిది నెలల పాటు కష్టపడి ఒంటరిగా శుభ్రం చేసిన 21 ఏళ్ల యువకుడు బిట్టు తబాహి (సురేంద్ర సింగ్ చౌదరి) పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. అయితే, కొద్ది రోజుల క్రితం ఆయన పడిన కష్టమంతా కేవలం ఒక్క నెల వ్యవధిలోనే నీళ్లపాలైంది.

అజనార్ నదిని పూర్తిగా ప్రక్షాళన చేసిన బిట్టు తబాహి, సెప్టెంబర్ 1న ఆ పనులను విజయవంతంగా పూర్తి చేశారు. కానీ, కేవలం ఒక నెల తిరిగేసరికి ప్రజలు నదిలో ప్లాస్టిక్ కవర్లు, పూల మాలలు, వ్యర్థాలు పడేయడంతో నది మళ్ళీ మునుపటిలాగే కలుషితమైంది. ఈ పరిస్థితిని చూసి చలించిపోయిన బిట్టు తబాహి ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నా ఎనిమిది నెలల కష్టం ఇలా ముప్పై రోజుల్లో బూడిదవుతుందని కలలో కూడా ఊహించలేదు. దయచేసి నదిలో ప్లాస్టిక్, చెత్తాచెదారం వేయకండి. నదిని పాడు చేయడం చాలా సులభం, కానీ దాన్ని శుభ్రం చేయడానికి ఎంతో శ్రమ పడాల్సి వస్తుంది అని ఆయన ప్రజలను వేడుకున్నారు.

ఇవి కూడా చదవండి

తన శ్రమ వృథా అయినప్పటికీ, బిట్టు తబాహి నిరాశ చెంది కూర్చోలేదు. నదిని మళ్లీ పూర్వ వైభవానికి తీసుకురావాలని నిర్ణయించుకున్న ఆయన, ఒంటరిగా మళ్లీ నదిని శుభ్రం చేసే పనులకు శ్రీకారం చుట్టారు. ఈసారి ఉదయాన్నే నది వద్దకు చేరుకున్న ఆయన, ఈత రాకపోయినా ప్రాణాలను లెక్కచేయకుండా నీటిలోకి దిగి చెత్తను తొలగించడం ప్రారంభించారు. గంటల తరబడి శ్రమించి పెద్ద ఎత్తున ప్లాస్టిక్ వ్యర్థాలను పాలిథిన్ కవర్లలోకి ఏరివేశారు. నదిని పూర్తిగా, శాశ్వతంగా శుభ్రపరిచే వరకు ప్రతిరోజూ కొద్దికొద్దిగా ఈ పనులు కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు.

బిట్టు తబాహి పోస్ట్ చేసిన ఈ తాజా వీడియో చూసిన నెటిజన్లు భారతీయుల పౌర స్పృహ లోపంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నదిని మురికి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో, ఏమాత్రం వెనకడుగు వేయకుండా పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న బిట్టు తబాహి అంకితభావాన్ని అందరూ ఆకాశానికెత్తుతూ సెల్యూట్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
పాపికొండల విహారయాత్రకు అధికారుల గ్రీన్ సిగ్నల్
పాపికొండల విహారయాత్రకు అధికారుల గ్రీన్ సిగ్నల్
ఎలక్ట్రిక్ కారుపై సోలార్ ప్యానెల్స్‌.. ఛార్జింగ్ ఖర్చు తగ్గుతుందా
ఎలక్ట్రిక్ కారుపై సోలార్ ప్యానెల్స్‌.. ఛార్జింగ్ ఖర్చు తగ్గుతుందా
జ్ఞాపకాల కోసం 112 ఏళ్ల పురాతన ఇంటిని 9 కి.మీ. దూరం తరలించిన మహిళ!
జ్ఞాపకాల కోసం 112 ఏళ్ల పురాతన ఇంటిని 9 కి.మీ. దూరం తరలించిన మహిళ!
ఎరక్కపోయి ఇరుకున్నాడు.. యూట్యూబ్‌లో చూసి బంగారం కోసం వేట..
ఎరక్కపోయి ఇరుకున్నాడు.. యూట్యూబ్‌లో చూసి బంగారం కోసం వేట..
రవి, శుక్రుల యుతి..వీరికి కొత్త ఉద్యోగ ఆఫర్లు ఖాయం..!
రవి, శుక్రుల యుతి..వీరికి కొత్త ఉద్యోగ ఆఫర్లు ఖాయం..!
యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్..
యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్..
ప్రియుడి కోసం భారత్‌కు రష్యా యువతి
ప్రియుడి కోసం భారత్‌కు రష్యా యువతి
అరెరె ఇన్నాళ్లు తెలియకుండా తిన్నారా.. కరివేపాకు వీరికి యమడేంజర్..
అరెరె ఇన్నాళ్లు తెలియకుండా తిన్నారా.. కరివేపాకు వీరికి యమడేంజర్..
8 నెలల కష్టం ఒక్క నెలలోనే వృథా.. మళ్లీ రంగంలోకి బిట్టు తబాహి!
8 నెలల కష్టం ఒక్క నెలలోనే వృథా.. మళ్లీ రంగంలోకి బిట్టు తబాహి!
నెటిజన్ అసభ్యకరమైన కామెంట్స్.. కౌంటరిచ్చిన వేణు స్వామి భార్య
నెటిజన్ అసభ్యకరమైన కామెంట్స్.. కౌంటరిచ్చిన వేణు స్వామి భార్య