అప్పుడు సోనియాపై సంచలన ఆరోపణలు.. ఇప్పుడు అదే కుటుంబంతో ఆత్మీయ భేటీ.. రీఎంట్రీ కోసమేనా?
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరంటారు. ఒకప్పుడు తనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానంపై తీవ్ర విమర్శలు చేసిన నేత.. ఇప్పుడు అదే పార్టీ అగ్రనేత సోనియా గాంధీ పక్కన కనిపిస్తే రాజకీయ వర్గాల్లో చర్చ జరగకుండా ఉంటుందా? పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం బీజేపీ నాయకుడిగా ఉన్న కెప్టెన్ అమరీందర్ సింగ్ విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరుకావడం కొత్త రాజకీయ చర్చకు తెరలేపింది.

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరంటారు. ఒకప్పుడు తనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానంపై తీవ్ర విమర్శలు చేసిన నేత.. ఇప్పుడు అదే పార్టీ అగ్రనేత సోనియా గాంధీ పక్కన కనిపిస్తే రాజకీయ వర్గాల్లో చర్చ జరగకుండా ఉంటుందా? పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం బీజేపీ నాయకుడిగా ఉన్న కెప్టెన్ అమరీందర్ సింగ్ విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరుకావడం కొత్త రాజకీయ చర్చకు తెరలేపింది.
ఐదేళ్ల క్రితం కాంగ్రెస్‌కు గుడ్‌బై..!
2021లో పంజాబ్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న అమరీందర్ సింగ్ కాంగ్రెస్ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా సోనియా గాంధీ, ఆమె పిల్లలు రాహుల్, ప్రియాంక గాంధీలపై ఆరోపణలు చేస్తూ ఏడు పేజీల రాజీనామా లేఖ రాశారు. తనను పదవి నుంచి తొలగించేందుకు అర్ధరాత్రి కుట్ర జరిగిందని ఆరోపించారు. అనంతరం పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో సొంత పార్టీని స్థాపించారు. 2022లో ఆ పార్టీని బీజేపీలో విలీనం చేసి కమలదళంలో చేరారు.
సోనియా పుస్తకావిష్కరణలో అమరీందర్
సోమవారం (నవంబర్ 16) ఢిల్లీలో సోనియా గాంధీ రచించిన ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ ఆత్మకథ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. వారిలో బీజేపీ నేత అమరీందర్ సింగ్ ముందు వరుసలో కూర్చోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఐదేళ్ల క్రితం కాంగ్రెస్‌ను వీడిన ఆయన ఇప్పుడు అదే కుటుంబం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తించింది.
రాహుల్ గాంధీ ప్రస్తావనతో ఆసక్తికర సన్నివేశం!
ఈ కార్యక్రమంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన తల్లిదండ్రులు రాజీవ్ గాంధీ, సోనియా గాంధీల మధ్య ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు. ఒకసారి తన తల్లిదండ్రుల మధ్య చిన్నపాటి గొడవ జరిగిందని, ఆ సమయంలో తన తండ్రి రాజీవ్ గాంధీ ఫోన్‌లో అమరీందర్ సింగ్‌తో మాట్లాడుతున్నారని గుర్తుచేశారు. అనంతరం అమరీందర్ వైపు చూస్తూ ఆ సంఘటన గుర్తుందా అని అడిగారు. దీంతో అమరీందర్ చిరునవ్వు చిందించారు. గతంలో కూడా రాహుల్ గాంధీ అమరీందర్‌ను తనకు ఇష్టమైన బీజేపీ నాయకుడిగా అభివర్ణించడం గమనార్హం. ఆయనతో తనకు మంచి అనుబంధం ఉందని, ఆయన చాలా కూల్‌గా ఉంటారని ప్రశంసించారు.
#WATCH | Delhi: At the launch event of Sonia Gandhi’s memoir, ‘Belonging: A Journey of Love’, Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, “I see Amrinder Singh Ji here… We saw them (Rajiv Gandhi and Sonia Gandhi) argue, but we only saw them fight once. The coincidence of coincidences, my father was speaking to Amrinder Singh on the phone when it happened… That was the only time we ever saw them fight. I’ve never seen this in another house. Every meal, there would be Papa, and on Papa’s lap, there would be Mamma. I thought this was a normal thing, so I would go to my friend’s house, and they wouldn’t be sitting in each other’s laps. I’d ask my friends, “Guys, what is going on? Why is your mother not sitting on your father’s lap?” At lunchtime, dinnertime, Mamma was sitting on Papa’s lap…”
(Source: Congress)
— ANI (@ANI) November 16, 2026
కాంగ్రెస్‌లోకి తిరిగి వస్తారా?
ఈ పరిణామాల నేపథ్యంలో 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అమరీందర్ కాంగ్రెస్‌లోకి తిరిగి వస్తారనే ప్రచారం మొదలైంది. అయితే ఈ ఊహాగానాలను ఆయన ఖండించారు. తాను కేవలం సామాజిక కార్యక్రమానికి మాత్రమే వచ్చానని స్పష్టం చేశారు. సోనియా గాంధీ గతంలో తన పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమాలకు మూడుసార్లు హాజరయ్యారని, ఆమె ఆహ్వానానికి మర్యాదపూర్వకంగా స్పందించానని వివరించారు. తనను కాంగ్రెస్‌లో చేరాలని ఎవరూ అడగలేదని కూడా తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ మాత్రం అమరీందర్ తిరిగి పార్టీలోకి వస్తే సంతోషిస్తామని వ్యాఖ్యానించారు. అంబికా సోని కూడా ఆయన హాజరును వ్యక్తిగత సంబంధాలతో ముడిపెట్టారు.
వీడియో ఇక్కడ చూడండి..
#WATCH | Delhi: At the launch event of Sonia Gandhi’s memoir, ‘Belonging: A Journey of Love’, Former Punjab CM and BJP leader Captain Amarinder Singh says, “We have come here for a social event. How do political issues come into this? This is a social event. For instance, when I launched my books, Sonia-ji attended three of the launches…In many other countries, people continue to interact socially, regardless of their political affiliations…”
On being asked if he would rejoin Congress, he says, “…Once you have made a decision, you shouldn’tgo away and complain. I don’t believe in that. As for me, I have simply come here for a social event. I have known this family for many years. We share a very close bond…No one has ever asked me whether or not I should join them. My interactions with them have been purely social. They have never asked me to join them or advised me against joining them…”
— ANI (@ANI) November 16, 2026
మారనున్న పంజాబ్ రాజకీయ సమీకరణాలా?
ప్రస్తుతం పంజాబ్‌లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య రాజకీయ పోటీ కొనసాగుతోంది. అమరీందర్‌కు పంజాబ్ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. అయితే ఆయన కాంగ్రెస్‌లోకి తిరిగి వస్తారనే విషయంపై ఎలాంటి అధికారిక చర్చ జరిగినట్లు ఆధారాలు లేవు. ఆయన మాత్రం బీజేపీలోనే కొనసాగుతానని గతంలో స్పష్టం చేశారు. మొత్తానికి ఐదేళ్ల క్రితం రాజకీయ విభేదాలతో కాంగ్రెస్‌ను వీడిన అమరీందర్.. ఇప్పుడు గాంధీ కుటుంబంతో ఆత్మీయంగా కనిపించడం చర్చనీయాంశమైంది. ఇది కేవలం వ్యక్తిగత అనుబంధమా? లేక భవిష్యత్తులో పంజాబ్ రాజకీయాల్లో కొత్త పరిణామాలకు సంకేతమా? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
