AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాత్‌రూమ్‌లో ప్లాస్టిక్ బకెట్లు, మగ్గులపై పేరుకుపోయిన మొండి మరకలను ఈజీగా వదిలించుకోండి!

ఇల్లు ఎంత శుభ్రంగా ఉన్నప్పటికీ, బాత్‌రూమ్‌లో ఉండే ప్లాస్టిక్ బకెట్లు, మగ్గులపై పేరుకుపోయిన తెల్లటి మరకాలు, మురికి చూసేందుకు చాలా అసహ్యంగా కనిపిస్తాయి. నిత్యం నీటిని నిల్వ చేయడం వల్ల నీటిలోని కాల్షియం, మెగ్నీషియం వంటి మినరల్స్ ప్లాస్టిక్ ఉపరితలంపై గట్టిగా అతుక్కుపోతాయి. దీనివల్ల కొనుగోలు చేసిన కొత్త బకెట్లు, మగ్గులు కూడా కొద్దిరోజులకే పాతవిగా మారిపోతుంటాయి. మార్కెట్లో లభించే రసాయన క్లీనర్లు వాడితే చేతులు పాడవ్వడంతో పాటు వాటి ఖర్చు కూడా ఎక్కువే. కాబట్టి మన వంటింట్లో లభించే సహజ సిద్ధమైన పదార్థాలతో బాత్‌రూమ్ సామాన్లను ఎలా శుభ్రం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బాత్‌రూమ్‌లో ప్లాస్టిక్ బకెట్లు, మగ్గులపై పేరుకుపోయిన మొండి మరకలను ఈజీగా వదిలించుకోండి!
Plastic Bucket Cleaning Hacks
Jyothi Gadda
|

Updated on: Oct 12, 2026 | 8:40 PM

Share

బాత్‌రూమ్‌లో నిత్యం ఉపయోగించే ప్లాస్టిక్ బకెట్లు, మగ్గులపై నీటిలోని మినరల్స్ వల్ల తెల్లటి మరకాలు, మురికి పేరుకుపోతుంటాయి. వీటిని ఎంత రుద్దినా త్వరగా పోవు. అయితే కొన్ని సింపుల్ ఇంటి చిట్కాలతో వీటిని కొత్తవాటిలా తళతళలాడించవచ్చు. ఈ చిట్కాలు పాటిస్తూ కడిగితే ప్లాస్టిక్ సామాన్లపై ఉన్న సంవత్సరాల నాటి మొండి మరకాలు కూడా ఇట్టే మాయమై సరికొత్తగా మెరుస్తాయి.

బేకింగ్ సోడా, నిమ్మరసం జాదు:

క్లీనింగ్‌లో బేకింగ్ సోడా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక గిన్నెలో రెండు స్పూన్ల బేకింగ్ సోడా తీసుకుని, అందులో తగినన్ని నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని బకెట్లు, మగ్గులపై మరకలు ఉన్న ప్రదేశంలో బాగా రుద్ది, సుమారు 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత ఒక బ్రష్ లేదా స్పాంజ్ సహాయంతో రుద్ది నీటితో కడిగితే మురికి సులభంగా వదిలిపోతుంది.

వెనిగర్, డిటర్జెంట్ పౌడర్:

తెల్లటి మరకలను తొలగించడంలో వెనిగర్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఒక బాటిల్‌లో సమానపాళ్లలో నీరు, వెనిగర్ పోసి, అందులో కొద్దిగా వాషింగ్ పౌడర్ లేదా డిష్ సోప్ కలపాలి. ఈ ద్రావణాన్ని బకెట్లు, మగ్గులపై స్ప్రే చేసి పది నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత స్క్రబ్బర్‌తో రుద్దితే పేరుకుపోయిన జిడ్డు, మరకాలు పూర్తిగా మాయమవుతాయి.

ఇవి కూడా చదవండి

టూత్‌పేస్ట్ ఉపయోగించి క్లీనింగ్:

సాధారణంగా మనం పళ్లు తోముకోవడానికి వాడే తెల్లటి టూత్‌పేస్ట్ బాత్‌రూమ్ మగ్గుల మెరుగుకు బాగా ఉపయోగపడుతుంది. మొండి మరకలు ఉన్న చోట టూత్‌పేస్ట్ రాసి కొద్దిసేపు ఉంచిన తర్వాత బ్రష్‌తో రుద్దితే మంచి ఫలితం ఉంటుంది. ఇది ప్లాస్టిక్‌కు ఎలాంటి హాని చేయకుండా సరికొత్త మెరుపును ఇస్తుంది.

ఈ చిన్నపాటి ఇంటి చిట్కాలను పాటిస్తే ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా, ఎక్కువ శ్రమ పడకుండా మీ బాత్‌రూమ్‌లోని ప్లాస్టిక్ బకెట్లు, మగ్గులను తళతళలాడేలా మార్చుకోవచ్చు. కాబట్టి ఈసారే ఈ సింపుల్ ట్రిక్స్ ట్రై చేయండి!

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us