AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జుట్టుకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా? అప్లై చేసే సరైన విధానం ఇదే!

భారతీయ సంప్రదాయంలో గోరింటాకు కేవలం చేతులకు పెట్టుకోవడానికే కాకుండా, జుట్టు సంరక్షణలోనూ అనాదిగా వాడబడుతోంది. గోరింటాకులో సహజమైన కండిషనింగ్ గుణాలు ఉండటం వల్ల జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా, ఇది తెల్ల జుట్టును సహజంగా నల్లగా లేదా గోధుమ రంగులోకి మార్చడానికి, స్కాల్ప్‌లో చుండ్రును నివారించడానికి ఎంతగానో సహాయపడుతుంది. మెహందీలో కొన్ని రకాల పదార్థాలు కలిపి జుట్టుకు పట్టించి, రెండు గంటల తర్వాత తలస్నానం చేస్తే జుట్టు సిల్కీగా, షైనీగా, ఒత్తుగా మారుతుంది.

జుట్టుకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా? అప్లై చేసే సరైన విధానం ఇదే!
Henna Hair BenefitsImage Credit source: News 9
Jyothi Gadda
|

Updated on: Oct 12, 2026 | 8:00 PM

Share

మన దేశంలో గోరింటాకు కి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. పండుగలు, శుభకార్యాల సమయంలో చేతులకు గోరింటాకు పెట్టుకోవడం మన ఆచారం. అయితే, చేతులకు అందాన్ని ఇవ్వడమే కాకుండా, గోరింటాకు మన జుట్టుకు కూడా అద్భుతమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది. రసాయనాలతో కూడిన హెయిర్ డైస్‌లను వాడే బదులు, సహజసిద్ధమైన గోరింటాకును ఉపయోగించడం వల్ల జుట్టు ఎంతో ఆరోగ్యంగా, బలంగా మారుతుంది. జుట్టుకు మెహందీ పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలు, దానిని తయారు చేసుకునే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గోరింటాకు వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు:

గోరింటాకు జుట్టుకు అద్భుతమైన నేచురల్ కండిషనర్‌లా పనిచేస్తుంది. ఇది జుట్టులోని తేమను లాక్ చేసి, జుట్టు చిట్లడాన్ని నివారిస్తుంది. స్కాల్ప్‌లో పేరుకుపోయిన అధిక జిడ్డు, మురికి చుండ్రు సమస్యను తగ్గించడంలో మెహందీ గ్రేట్ రిజల్ట్ ఇస్తుంది. ఇది యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంటుంది. జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి, జుట్టు రాలడాన్ని క్రమంగా తగ్గిస్తుంది. దీనివల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. PPD లేదా అమ్మోనియా వంటి కఠినమైన సింథటిక్ రసాయనాలు లేకుండా తెల్ల జుట్టును సురక్షితంగా ప్రకాశవంతమైన రాగి-ఎరుపు రంగులోకి మారుస్తుంది. జుట్టు క్యూటికల్‌లో తేమను నిలుపుతుంది. జుట్టును మృదువుగా కనిపించేలా చేస్తుంది. మెహందీలో సూక్ష్మక్రిమి నిరోధక గుణాలు ఉన్నాయి. ఇవి తల దురదకు ఉపశమనం కలిగించి, చుండ్రును నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది ప్రతి వెంట్రుక మందాన్ని పెంచి, జుట్టుకు ఆరోగ్యకరమైన, మెరిసే రూపాన్ని ఇస్తుంది.

హెయిర్ మెహందీ తయారు చేసే విధానం:

గోరింటాకు పొడిని నేరుగా నీటిలో కలిపి రాసే బదులు, కొన్ని సహజ పదార్థాలను కలిపితే మరింత మంచి ఫలితం ఉంటుంది. ఒక గిన్నెలో తగినంత గోరింటాకు పొడిని తీసుకోండి. అందులో సరిపడా టీ డీకాషన్ , ఒక స్పూన్ నిమ్మరసం, కొద్దిగా పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రంతా అలాగే నాననివ్వాలి. మరుసటి రోజు ఉదయం తలకు పట్టించే ముందు ఇందులో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె కలపవచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా పట్టించాలి. సుమారు 2 నుంచి 3 గంటల పాటు ఆరనిచ్చిన తర్వాత, కేవలం మంచి నీటితో కడగాలి. మరుసటి రోజు మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా నెలకు ఒకసారైనా చేయడం వల్ల మీ జుట్టు సిల్కీగా, ప్రకాశవంతంగా మారుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
రివేంజ్ గేమ్‌కు రెడీ.. మరోసారి తలపడనున్న భారత్ vs పాకిస్థాన్
రివేంజ్ గేమ్‌కు రెడీ.. మరోసారి తలపడనున్న భారత్ vs పాకిస్థాన్
ట్యూబ్ టైర్ vs ట్యూబ్‌లెస్ టైర్: మీ వాహనానికి ఏది బెటర్‌? తేడాలు
ట్యూబ్ టైర్ vs ట్యూబ్‌లెస్ టైర్: మీ వాహనానికి ఏది బెటర్‌? తేడాలు
కళ్యాణ్ రామ్ భార్య గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
కళ్యాణ్ రామ్ భార్య గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసి గుండెను కాపాడే ఛూమంత్రం..
కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసి గుండెను కాపాడే ఛూమంత్రం..
డిసెంబర్ 3న దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్.. అలర్ట్..
డిసెంబర్ 3న దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్.. అలర్ట్..
ఫోన్ రిపేర్ కోసం మహిళ.. ఫొటోలపై కన్నేశాడు! అమెరికాలో అరెస్ట్
ఫోన్ రిపేర్ కోసం మహిళ.. ఫొటోలపై కన్నేశాడు! అమెరికాలో అరెస్ట్
క్రమశిక్షణతోనే విజయం.. చదువుపై ఏకాగ్రత పెరగాలంటే ఈ 4 చేయండి
క్రమశిక్షణతోనే విజయం.. చదువుపై ఏకాగ్రత పెరగాలంటే ఈ 4 చేయండి
చలికాలంలో నోటికి కమ్మదనాన్ని ఇచ్చే కోడిగుడ్డు ఎల్లిపాయ కారం.
చలికాలంలో నోటికి కమ్మదనాన్ని ఇచ్చే కోడిగుడ్డు ఎల్లిపాయ కారం.
ఓటమిని గెలుపుగా మార్చుకోవాలి.. బంగారు రెక్కల హంస కథ!
ఓటమిని గెలుపుగా మార్చుకోవాలి.. బంగారు రెక్కల హంస కథ!
ఇంటి పనులకు వచ్చిన జేసీబీ డ్రైవర్‌తో ప్రేమలోపడ్డ యువతి,కట్‌చేస్తే
ఇంటి పనులకు వచ్చిన జేసీబీ డ్రైవర్‌తో ప్రేమలోపడ్డ యువతి,కట్‌చేస్తే