AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వయస్సు కేవలం నంబర్ మాత్రమే! 72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతూ సెన్సేషన్ సృష్టిస్తున్న బామ్మ!

కొత్త విషయాలు నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు జమ్మూకు చెందిన 72 ఏళ్ల విద్యా కౌర్. మాజీ ఉపాధ్యాయురాలిగా, ప్రిన్సిపాల్‌గా పని చేసిన ఆమెకు చిన్ననాటి నుంచి డ్రైవింగ్ చేయాలనే బలమైన కోరిక ఉండేది. అయితే 59 ఏళ్ల వయసులో డ్రైవింగ్ నేర్చుకోవడానికి వెళ్లగా, వయసు ఎక్కువైందని చెప్పి డ్రైవింగ్ స్కూల్ వారు నిరాకరించారు. అయినా నిరుత్సాహపడలేదు..ప్రస్తుతం ఆమె కార్లతో పాటు భారీ ట్రక్కులను కూడా సునాయాసంగా నడుపుతూ సోషల్ మీడియాలో యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆమె పట్టుదల చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

వయస్సు కేవలం నంబర్ మాత్రమే! 72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతూ సెన్సేషన్ సృష్టిస్తున్న బామ్మ!
72 Year Old Woman Driver
Jyothi Gadda
|

Updated on: Oct 12, 2026 | 6:14 PM

Share

ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి వయసుతో ఎలాంటి సంబంధం లేదు, మనలో పట్టుదల ఉంటే చాలు ఏ పనైనా సాధించవచ్చు అంటారు పెద్దలు. ఈ మాటను అక్షరాలా నిజం చేసి చూపించారు జమ్మూకు చెందిన 72 ఏళ్ల విద్యా కౌర్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ బామ్మ డ్రైవింగ్ చేస్తున్న వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఒకవైపు కార్లు, మరోవైపు భారీ ట్రక్కులను సైతం అవలీలగా నడుపుతూ ఆమె నెటిజన్లను విస్మయానికి గురిచేస్తున్నారు. వయసు పైబడిన తర్వాత చాలామంది ఇళ్లకే పరిమితమవుతుంటే, ఈ బామ్మ మాత్రం తన పాత కోరికను నెరవేర్చుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

విద్యా కౌర్ జీవితం కూడా ఎంతోమంది సాధారణ మహిళలలాగే కుటుంబ బాధ్యతలు, ఉద్యోగంతో గడిచింది. ఆమె ఉపాధ్యాయురాలిగా పనిచేసి, ఆ తర్వాత ప్రిన్సిపాల్ స్థాయికి ఎదిగారు. అయితే తన జీవితంలో ఎప్పటికైనా డ్రైవింగ్ నేర్చుకోవాలనే బలమైన కోరిక ఆమె మదిలో మెదులుతూనే ఉంది. ఎట్టకేలకు తన 59 ఏళ్ల వయసులో డ్రైవింగ్ స్కూల్‌కు వెళ్లి డ్రైవింగ్ నేర్చుకోవాలని ప్రయత్నించారు. కానీ, వయసు ఎక్కువగా ఉందని, ఈ వయసులో బిజీ రోడ్లపై డ్రైవింగ్ చేయడం కష్టమని చెప్పి డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులు ఆమెను వెనక్కి పంపేశారు.

ఇవి కూడా చదవండి

ఎవరో ఏదో అన్నారని విద్యా కౌర్ తన కలను వదులుకోలేదు. డ్రైవింగ్ స్కూల్ వారు నిరాకరించినప్పటికీ, ఆమె సొంతంగా ఒక కారును కొనుగోలు చేశారు. ఆ తర్వాత తన పొరుగువారి సహాయంతో డ్రైవింగ్ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. రోజూ క్రమం తప్పకుండా గేర్‌, బ్రేక్, క్లచ్, స్టీరింగ్ కంట్రోల్స్ మీద పట్టు సాధించారు. ఎంతో అంకితభావంతో కేవలం ఒక్క నెల రోజుల్లోనే ఆమె కారు నడపడం నేర్చుకున్నారు.

మొదట కారుతో ప్రారంభించిన ఆమె ప్రయాణం ఆ తర్వాత భారీ వాహనాల వైపు సాగింది. ప్రస్తుతం ఆమె కేవలం కార్లు మాత్రమే కాకుండా, జమ్మూ వీధుల్లో ట్రక్కులను కూడా నడుపుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ, ఎంతో ఆత్మవిశ్వాసంతో ప్యారలల్ పార్కింగ్ వంటి కష్టమైన టెక్నిక్స్‌ను కూడా సులభంగా చేస్తున్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు చీర పల్లును సవరించుకుంటూ ఆమె ఎంతో హుందాగా, ఉల్లాసంగా కనిపించే తీరు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

సోషల్ మీడియాలో ఆమె వీడియోలు చూసిన నెటిజన్లు వయసు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే అంటూ ఆమెను ప్రశంసిస్తున్నారు. కొందరు ఆమెను గో గర్ల్ అని, మరికొందరు బాడీ డాడీ అంటూ కొనియాడుతున్నారు. ఏపనైనా సాధించాలనే తపన ఉంటే వయసు ఎప్పుడూ అడ్డురాదని విద్యా కౌర్ నిరూపించి చూపించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!
ఉప్పల్ స్టేడియంలో కాటేరమ్మ కొడుకు రికార్డులు ఇవే..
ఉప్పల్ స్టేడియంలో కాటేరమ్మ కొడుకు రికార్డులు ఇవే..
అప్పట్లో కుర్రకారును ఉర్రూతలూగించిన సాంగ్..
అప్పట్లో కుర్రకారును ఉర్రూతలూగించిన సాంగ్..
కోహ్లీ కంటే ఖతర్నాక్.. బ్యాడ్‌లక్‌తో టీమిండియాకు దూరమైన ముగ్గురు
కోహ్లీ కంటే ఖతర్నాక్.. బ్యాడ్‌లక్‌తో టీమిండియాకు దూరమైన ముగ్గురు