AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డిసెంబర్ 3న దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్.. ఖాతాదారులకు బిగ్ అలర్ట్..

Bank Strike: డిసెంబర్ 3వ తేేదీన దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్ కానున్నాయి. ఐడీబీఐ బ్యాంకును ప్రైవేట్ సంస్థకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంక్ సంఘాలు సమ్మెకు దిగనున్నాయి. ఈ సమ్మెలో అన్ని బ్యాంకుల ఉద్యోగులు పాల్గొననున్నారు. దీంతో బ్యాంక్ సేవలకు అంతరాయం కలగనుంది. సమ్మె గురించి బ్యాంకుల యూనియన్లు ప్రకటన చేశాయి.

డిసెంబర్ 3న దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్.. ఖాతాదారులకు బిగ్ అలర్ట్..
Banks
Venkatrao Lella
|

Updated on: Nov 23, 2026 | 11:26 AM

Share

ఐడిబిఐ బ్యాంకును ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ డిసెంబర్ 3న దేశవ్యాప్త సమ్మెకు బ్యాంకుల యూనియన్ పిలుపునిచ్చింది. AIBEA,AIBOA, BEFI బ్యానర్ కింద అన్ని బ్యాంకుల ఉద్యోగులు, అధికారులు ఈ నిరసనల్లో పాల్గొననున్నట్లు వెల్లడించింది. బ్యాంకును విదేశీ పెట్టుబడిదారునికి విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ AIBEA, AIBOA, BEFI ఉద్యోగ సంఘాలు నిరసనలు చేపట్టనున్నాయి. దీంతో ఆ రోజు బ్యాంక్ సేవల్లో అంతరాయం కలగనుంది. అన్ని బ్యాంకుల కస్టమర్లపై ఇది పడనుంది.

ప్రస్తుతం ప్రభుత్వం, LIC కలిపి IDBI బ్యాంకులో 94 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 60 శాతం వాటాను విదేశీ సంస్థ ఫెయిర్‌ఫాక్స్‌కు విక్రయించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తద్వారా ఫెయిర్‌ఫాక్స్ IDBI బ్యాంక్‌కు ప్రమోటర్ కంపెనీగా మారనుంది. దీనిని ఐడీబీఐ బ్యాంక్ ఉద్యోగులు వ్యతిరేకిస్తుడగా.. వారికి బ్యాంకింగ్ యూనియన్లు మద్దతు తెలుపుతున్నాయి. గతంలోనే ఐడీబీఐ బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపట్టగా.. ప్రభుత్వం దిగి రాలేదు. దీంతో ఇప్పుడు మరోసారి సమ్మెకు దిగుతుండగా.. వారికి ఇతర బ్యాంక్ ఉద్యోగులు కూడా మద్దతు ప్రకటించనున్నారు.

ఐడీబీఐ బ్యాంకులో సుమారు రూ. 3.50 లక్షల కోట్ల మొత్తం డిపాజిట్లు, రూ. 2.50 లక్షల కోట్ల అడ్వాన్సులు ఉన్నాయి. మొత్తం వ్యాపారం రూ. 6 లక్షల కోట్లు. ఒకవేళ ఈ బ్యాంకును ఫెయిర్‌ఫాక్స్‌కు అమ్మితే.. ఈ స్వదేశీ బ్యాంకు విదేశీ బ్యాంకుగా మారిపోతుంది. దీంతో బ్యాంకును ఒక విదేశీ పెట్టుబడిదారునికి అమ్మాలనే ఈ నిర్ణయం పూర్తిగా అనవసరమని బ్యాంకుల సంఘం భావిస్తోంది. నిర్వహణ లోపాల కారణంగా అనేక ప్రైవేట్ బ్యాంకులు మూతపడ్డాయి. విఫలమైన ఈ ప్రైవేట్ బ్యాంకులన్నింటినీ ఆ తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకులు స్వాధీనం చేసుకున్నాయి. మన బ్యాంకులను ప్రైవేట్ మరియు విదేశీ పెట్టుబడులకు అమ్మే బదులు.. మన ప్రైవేట్ బ్యాంకులన్నింటినీ జాతీయం చేయాల్సిన అవసరం ఉందని బ్యాంకింగ్ సంఘాలు కోరుతున్నాయి. మన బ్యాంకులను ప్రైవేట్ చేతులకు అమ్మడం అంటే ప్రజల భారీ పొదుపును ప్రైవేట్ చేతులకు అప్పగించడమేనని అంటున్నారు. “బ్యాంకుల్లోని భారీ మొండి బకాయిలకు ఇప్పటికే ప్రైవేట్ కార్పొరేట్ రంగమే కారణం. ఈ రుణాలను వసూలు చేయకపోగా.. ఎగవేతదారులకు భారీ రాయితీలు ఇస్తూ వాటిని మాఫీ చేస్తున్నారు. దీనివల్ల బ్యాంకులు నష్టపోతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం మన బ్యాంకులను అదే ప్రైవేట్ కార్పొరేట్ రంగానికి అప్పగించాలని చూడటం వింతగా ఉంది. ఈ సమస్య తీవ్రతను, ఐడీబీఐ అన్యాయమైన అమ్మకాన్ని వ్యతిరేకించాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని సమ్మెకు AIBEA, AIBOA, BEFI సంస్థలు సమ్మెకు పిలుపునిచ్చాయి” అని సంఘం తెలిపింది.

Follow Us