AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫోన్ రిపేర్ కోసం వస్తే.. మహిళ ఫొటోలపై కన్నేశాడు! అమెరికాలో అరెస్ట్!

AirDrop photo transfer: ఫోన్‌లో చిన్న సమస్య వచ్చిందని ఓ మహిళ మొబైల్ స్టోర్‌కు వెళ్లింది. నెట్‌వర్క్ సెట్టింగ్స్ మార్చి ఇవ్వాలని అక్కడ పనిచేస్తున్న ఉద్యోగిని కోరింది. ఫోన్ పాస్‌కోడ్ కూడా నమ్మకంతో అతడికి ఇచ్చింది. కానీ ఆ ఉద్యోగి మాత్రం తనకు అప్పగించిన బాధ్యతను మరిచిపోయాడు. నెట్‌వర్క్ సెట్టింగ్స్ మార్చాల్సింది పోయి మహిళ ఫోన్‌లోని ప్రైవేట్ ఫొటోలపై కన్నేశాడు. ఆమెకు తెలియకుండా గ్యాలరీ తెరిచి, నగ్న చిత్రాలను తన ఫోన్‌కు పంపించుకునేందుకు ప్రయత్నించాడు. అంతేకాదు ఆమె సోషల్ మీడియా ఖాతాలోకి ప్రవేశించాడు. చివరకు ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది. కేసులో దోషిగా తేలిన ఆ వ్యక్తిని తాజాగా అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఫోన్ రిపేర్ కోసం వస్తే.. మహిళ ఫొటోలపై కన్నేశాడు! అమెరికాలో అరెస్ట్!
Indian Origin Texas Store Employee Arrested By Ice For Stealing Customer Intimate Photos
Sharada V
|

Updated on: Nov 23, 2026 | 11:25 AM

Share

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన రఘుల్ ఆనందకృష్ణన్ (29) అక్కడి క్యాపిటల్ ప్లాజా షాపింగ్ సెంటర్‌లో ఉన్న టోటల్ వైర్‌లెస్ స్టోర్‌లో పనిచేసేవాడు. ఈ ఏడాది జూన్ 7న ఓ మహిళ తన ఐఫోన్‌లో నెట్‌వర్క్ సెట్టింగ్స్ మార్చుకునేందుకు ఆ స్టోర్‌కు వెళ్లింది.

ఆమె ఫోన్‌ను పరిశీలించేందుకు రఘుల్ పాస్‌కోడ్ అడిగాడు. ఆమె కూడా నమ్మకంతో ఫోన్‌ను అతడికి ఇచ్చింది. అయితే ఫోన్‌ను స్టోర్ వెనుక భాగానికి తీసుకెళ్లిన రఘుల్ నెట్‌వర్క్ సెట్టింగ్స్ చూడాల్సింది పోయి ఫొటో గ్యాలరీని తెరిచాడు. అందులో ఉన్న మహిళ వ్యక్తిగత నగ్న చిత్రాలను తన ఫోన్‌కు పంపించుకున్నాడు. ఇందుకోసం ఎయిర్‌డ్రాప్ ఫీచర్‌ను ఉపయోగించాడు.

ఎయిర్‌డ్రాప్ ద్వారా ఫొటోలు పంపించాడు

పోలీసుల విచారణలో రఘుల్ తన తప్పును అంగీకరించాడు. మహిళ తన ఫోన్ పాస్‌కోడ్ ఇచ్చిన మాట వాస్తవమేనని, అయితే నెట్‌వర్క్ సెట్టింగ్స్ మార్చేందుకు మాత్రమే అనుమతి ఇచ్చిందని అతడు అంగీకరించాడు. అయినప్పటికీ ఫోన్‌లోని ఫొటోలను తెరిచి రెండు నగ్న చిత్రాలను తన ఫోన్‌కు పంపించేందుకు ప్రయత్నించినట్లు తెలిపాడు. అయితే ఆ ఫొటోల బదిలీ పూర్తికాలేదని, ఆ తర్వాత ఫోన్‌ను మహిళకు తిరిగి ఇచ్చేశానని పోలీసులకు చెప్పాడు కానీ ఈ వ్యవహారం అక్కడితో ముగియలేదు.

షాకింగ్ విషయం గుర్తించిన మహిళ!

స్టోర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మహిళ తన ఫోన్‌లోని ఎయిర్‌డ్రాప్ వివరాలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. తనకు తెలియకుండానే రెండు ప్రైవేట్ ఫొటోలు రఘుల్ ఫోన్‌కు వెళ్లినట్లు గుర్తించింది. అంతేకాదు తన స్నాప్‌చాట్ ఎకౌంట్‌ లోకి అతడు ప్రవేశించి, తనను యాడ్ చేసుకున్నాడని ఆరోపించింది. తన వ్యక్తిగత ఫొటోలను చూడటానికి కానీ, వాటిని ఇతరులకు పంపడానికి కానీ తాను ఎలాంటి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేసింది. దీంతో ఆస్టిన్ పోలీసులకు ఫిర్యాదు చేసి, అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.

జైలు శిక్ష తర్వాత తాజాగా ICE కస్టడీలోకి!

ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు రఘుల్‌పై విజువల్ రికార్డింగ్, సెక్యూరిటీ ఉల్లంఘన అభియోగాలు నమోదు చేశారు. మహిళ అనుమతి లేకుండా ఆమె ఫోన్‌లోని ఫొటోలను యాక్సెస్ చేయడం ఈ కేసులో కీలకంగా మారింది.

తర్వాత రఘుల్ ఇన్వేసివ్ విజువల్ రికార్డింగ్‌కు ప్రయత్నించిన కేసులో దోషిగా తేలాడు. ఈ కేసులో కౌంటీ జైలులో శిక్ష కూడా అనుభవించాడు.  తాజాగా అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) అధికారులు అతడిని కస్టడీలోకి తీసుకున్నారు. ఇమ్మిగ్రేషన్ కోర్టులో అతడి కేసు విచారణ పూర్తయ్యే వరకు అదుపులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. మొబైల్ రిపేర్ లేదా సెట్టింగ్స్ కోసం ఫోన్‌ను ఇతరుల చేతికి ఇచ్చే సమయంలో వ్యక్తిగత సమాచార భద్రత ఎంత ముఖ్యమో ఈ ఘటన గుర్తుచేస్తోంది.

Follow Us