AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసి గుండెను కాపాడే ఛూమంత్రం.. జ‌స్ట్ ఈ టీ తాగితే చాలు..

జామ ఆకులు, జామ టీ అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జీర్ణక్రియకు సహాయపడి, క్యాన్సర్‌ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. జామ ఆకుల‌ అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకోండి.

కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసి గుండెను కాపాడే ఛూమంత్రం.. జ‌స్ట్ ఈ టీ తాగితే చాలు..
Guava Leaves Benefits
Shaik Madar Saheb
|

Updated on: Nov 23, 2026 | 11:26 AM

Share

జామ పండ్లు కేవలం రుచికరమైనవే కాదు, వాటి ఆకులు కూడా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. జామ ఆకులతో తయారుచేసిన టీ ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ ఆకుల్లో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరాన్ని అనేక వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి.

రక్తంలో చక్కెర నియంత్రణ:

జామ ఆకుల రసం లేదా టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను సమర్థవంతంగా నియంత్రించవచ్చు. భోజనం తర్వాత జామ ఆకుల టీని తీసుకుంటే దాదాపు రెండు గంటల పాటు బ్లడ్ షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇది డయాబెటిస్ ఉన్నవారికి లేదా డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉన్నవారికి గొప్ప వరం. దీని ద్వారా రక్తంలో గ్లూకోజ్ శోషణ నెమ్మదించి, ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది.

గుండె ఆరోగ్యం పెంపు:

జామ ఆకులు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు శరీరంలోని విష వ్యర్థాలను తొలగించి గుండెను రక్షిస్తాయి. పొటాషియం, కరిగిపోయే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. ఇది అధిక రక్తపోటును నియంత్రించడంలో కూడా తోడ్పడుతుంది, తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

జీర్ణక్రియ మెరుగుదల – నొప్పి నివారణ:

జామ ఆకుల రసం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. డయేరియా వంటి జీర్ణ సమస్యలకు చక్కటి పరిష్కారం చూపుతుంది. దీనిలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు ప్రేగులలోని హానికరమైన బాక్టీరియాను తొలగిస్తాయి. పీరియడ్స్ సమయంలో చాలా మంది మహిళలు ఎదుర్కొనే పొట్ట నొప్పిని తగ్గించడంలో కూడా జామ ఆకుల రసం ప్రభావవంతంగా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా ఈ రసం తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

క్యాన్సర్ నిరోధక లక్షణాలు:

క్యాన్సర్‌ను నిరోధించే గుణాలు జామ ఆకుల్లో ఉన్నాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుని, కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం, జామ ఆకుల రసం క్యాన్సర్ మందుల కంటే నాలుగు రెట్లు ఎక్కువ ప్రభావం చూపించగలదని తెలిసింది. ఈ లక్షణం క్యాన్సర్ రాకుండా ముందే జాగ్రత్త పడాలనుకునే వారికి ఎంతో ఆశను కలిగిస్తుంది.

చర్మ సౌందర్యం – యాంటీ ఏజింగ్:

కాలుష్యం, ఇతర కారకాల వల్ల దెబ్బతిన్న చర్మానికి జామ ఆకులు మంచి ఔషధంగా పనిచేస్తాయి. వీటిలో ఉండే పోషకాలు చర్మ మచ్చలు, కణుతులు వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. జామ ఆకుల రసం తాగడం, వాటిని చర్మంపై అప్లై చేయడం వల్ల ముడతలు తగ్గుతాయి, చర్మం యవ్వనంగా, కాంతివంతంగా మారుతుంది.

జామ ఆకుల టీ తయారీ విధానం:

జామ ఆకుల టీని తయారు చేయడం చాలా సులభం.

కొన్ని తాజా జామ ఆకులను శుభ్రంగా కడగాలి.

రెండు కప్పుల నీటిని ఒక గిన్నెలో తీసుకుని, రెండు నిమిషాలు వేడి చేయాలి.

కడిగిన జామ ఆకులను – కొద్దిగా సాధారణ టీ ఆకులను నీటిలో వేయాలి.

సుమారు 10 నిమిషాల పాటు నీటిని బాగా మరిగించాలి.

వడగట్టి, కొద్దిగా తేనె కలిపి తాగితే, జామ ఆకు టీ సిద్ధం.

మార్కెట్‌లో జామ ఆకుల టీ ప్యాక్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. రుచిగా లేకపోయినా, జామ ఆకుల టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి దీనిని తాగడం శ్రేయస్కరం. ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా, జామ ఆకుల టీని ఆహారంలో చేర్చుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.

Follow Us
కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసి గుండెను కాపాడే ఛూమంత్రం..
కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసి గుండెను కాపాడే ఛూమంత్రం..
డిసెంబర్ 3న దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్.. అలర్ట్..
డిసెంబర్ 3న దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్.. అలర్ట్..
ఫోన్ రిపేర్ కోసం మహిళ.. ఫొటోలపై కన్నేశాడు! అమెరికాలో అరెస్ట్
ఫోన్ రిపేర్ కోసం మహిళ.. ఫొటోలపై కన్నేశాడు! అమెరికాలో అరెస్ట్
క్రమశిక్షణతోనే విజయం.. చదువుపై ఏకాగ్రత పెరగాలంటే ఈ 4 చేయండి
క్రమశిక్షణతోనే విజయం.. చదువుపై ఏకాగ్రత పెరగాలంటే ఈ 4 చేయండి
చలికాలంలో నోటికి కమ్మదనాన్ని ఇచ్చే కోడిగుడ్డు ఎల్లిపాయ కారం.
చలికాలంలో నోటికి కమ్మదనాన్ని ఇచ్చే కోడిగుడ్డు ఎల్లిపాయ కారం.
ఓటమిని గెలుపుగా మార్చుకోవాలి.. బంగారు రెక్కల హంస కథ!
ఓటమిని గెలుపుగా మార్చుకోవాలి.. బంగారు రెక్కల హంస కథ!
ఇంటి పనులకు వచ్చిన జేసీబీ డ్రైవర్‌తో ప్రేమలోపడ్డ యువతి,కట్‌చేస్తే
ఇంటి పనులకు వచ్చిన జేసీబీ డ్రైవర్‌తో ప్రేమలోపడ్డ యువతి,కట్‌చేస్తే
బంగారం ధరల్లో భారీ జంప్.. సోమవారం లేటెస్ట్ ధరలివే..
బంగారం ధరల్లో భారీ జంప్.. సోమవారం లేటెస్ట్ ధరలివే..
డ్రాతో డబ్ల్యూటీసీ పట్టికలో పెను మార్పులు.. భారత్ పరిస్థితి ఏంటి?
డ్రాతో డబ్ల్యూటీసీ పట్టికలో పెను మార్పులు.. భారత్ పరిస్థితి ఏంటి?
‘వావ్.. అద్భుతం!’ భారతీయ భాషా వైవిధ్యంపై పుతిన్ ఫిదా!
‘వావ్.. అద్భుతం!’ భారతీయ భాషా వైవిధ్యంపై పుతిన్ ఫిదా!