అందమైన జా లైన్ కోసం సులువైన చిట్కాలు.. ముఖంపై కొవ్వుకు చెక్ పెట్టండి!
అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే చాలామందిలో శరీరం సన్నగానే ఉన్నప్పటికీ, ముఖం, గడ్డం కింద కొవ్వు చేరి డబుల్ చిన్ ఏర్పడుతుంది. దీనివల్ల ముఖం ఉబ్బినట్లు కనిపించి, చిన్న వయసులోనే పెద్దవారిగా కనిపిస్తారు. పర్ఫెక్ట్ జా లైన్, సన్నని ముఖం పొందడానికి ఖరీదైన కాస్మెటిక్ సర్జరీలు అవసరం లేకుండా, సులువైన చిట్కాలు, ఫేస్ యోగా ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు.

శరీరం ఎంత ఫిట్‌గా ఉన్నప్పటికీ, ముఖంపై పేరుకుపోయిన కొవ్వు, డబుల్ చిన్ సమస్యల వల్ల ముఖం లావుగా కనిపిస్తుంది. దీనివల్ల వయస్సు ఎక్కువగా కనిపించడమే కాకుండా ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది. పర్ఫెక్ట్ జా లైన్, సన్నని ముఖం పొందడానికి జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించవచ్చు. ప్రతిరోజూ 10 నిమిషాల ఫేస్ యోగా, సరైన సమతుల్య ఆహారం, రోజూ 3 నుండి 4 లీటర్ల నీరు తాగడం, జంక్ ఫుడ్, ఉప్పు వాడకాన్ని తగ్గించడం ద్వారా ముఖంపై కొవ్వు కరిగి పర్ఫెక్ట్, షార్ప్ జా లైన్ సొంతమవుతుంది. పూర్తి డిటెల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఫేస్ యోగా వ్యాయామాలు
ఫిష్ ఫేస్ : చెంపలను లోపలికి పీల్చి చేపలా ముఖం పెట్టాలి. ఈ స్థితిలో 5 నుండి 10 సెకన్ల పాటు ఉండి నవ్వడానికి ప్రయత్నించాలి. రోజుకు 10-15 సార్లు చేయడం వల్ల చెంపలపై కొవ్వు కరుగుతుంది.
నెక్ లిఫ్ట్ / స్కై కిస్: తలను పైకి నిగిడ్చి ఆకాశాన్ని ముద్దు పెట్టుకుంటున్నట్లు పెదవులను కదిలించాలి. దీనివల్ల మెడ, గడ్డం కింద ఉన్న కండరాలు సాగి డబుల్ చిన్ తగ్గుతుంది.
జాలంధర బంధం / గడ్డం బయటకు చాచడం: క్రింది దవడను బయటకు నెట్టి, క్రింది పెదవిని పై పెదవిపైకి తీసుకురావడానికి ప్రయత్నించాలి. దీనివల్ల జా లైన్ షార్ప్‌గా మారుతుంది.
జీవనశైలి మార్పులు – ఆహార నియమాలు
హైడ్రేషన్ చాలా ముఖ్యం: శరీరంలో నీటి శాతం తగ్గితే ముఖం ఉబ్బినట్లు మారుతుంది. అందుచేత ప్రతిరోజూ కనీసం 3 నుండి 4 లీటర్ల నీరు తాగాలి.
ఉప్పు, జంక్ ఫుడ్ తగ్గించాలి: ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో నీరు నిల్వ ఉండి ముఖం లావుగా కనిపిస్తుంది. అలాగే ప్రాసెస్ చేసిన ఆహారాలు, నూనె పదార్థాలను పూర్తిగా పక్కన పెట్టాలి.
సరైన పోశ్చర్: నిరంతరం మొబైల్ లేదా ల్యాప్‌టాప్ చూస్తూ తల వంచడం వల్ల గడ్డం కింద కొవ్వు పెరుగుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ మెడను తిన్నగా ఉంచడం అలవాటు చేసుకోవాలి.
ఈ సులువైన చిట్కాలను, ఫేస్ యోగాను రోజూ క్రమం తప్పకుండా పాటిస్తే కేవలం కొద్ది రోజుల్లోనే మీ ముఖం సన్నబడి పర్ఫెక్ట్ జా లైన్ సొంతమవుతుంది.




