ఇంట్లోనే సులభంగా రవ్వ కేసరి.. స్వీట్ షాప్‌ను మించిన రుచితో ఇలా చేసేయండి!
Prasanna Yadla
13 october 2026
Pic credit - Pinterest
రవ్వ కేసరిని ఎంతో మంది ఇష్టంగా తింటారు దీనిని ఎంతో ఈజీగా చేయొచ్చు. ఎలా తయారు చేయాలంటే?
రవ్వ కేసరి
ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుని దానిలో ఒక కప్పు పంచదార, ఇంకా దీనిలో 4 కప్పుల నీళ్లు, రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి
స్టెప్ 1
ఇప్పుడు ముందుగా పాన్ తీసుకుని దానిలో కొంచం నెయ్యి వేసి దానిలో నాలుగు జీడిపప్పు, నాలుగు కిస్మిస్‌లను వేయించి పక్కన పెట్టుకోవాలి.
స్టెప్ 2
అదే పాన్ లో కొద్దిగా రవ్వ వేసి మీడియం మంటపై ఉంచి మంచి సువాసన వచ్చే వరకు దీనిని బాగా వేయించుకోవాలి.
స్టెప్ 3
ఇప్పుడు ఇంకో పాత్రలో కొద్దిగా నీళ్లు పోసి వాటిని బాగా మరిగించి, కావాలంటే దీనిలో కుంకుమపువ్వు కొద్దిగా ఫుడ్ కలర్ కలపాలి.
స్టెప్ 4
ఇప్పుడు బాగా మరుగుతున్న నీటిలో వేయించిన రవ్వలో కొద్దీ కొద్దిగా పోస్తూ ఇది అసలు ఉండలు లేకుండా కలుపుకోవాలి.
స్టెప్ 5
ఇంకా ఈ రవ్వ నీటిని బాగా పీల్చుకుని అది మెత్తగా అయినా తర్వాత దీనిలో పంచదార వేసి దీనిని బాగా కలపాలి.
స్టెప్ 6
ఇప్పుడు దీనిలో పంచదార బాగా కరిగిన తర్వాత దీనిలో మిగిలిన నెయ్యిని కొంచం కొంచం వేస్తూ బాగా కలుపుకోవాలి. దీనిలో చిటికెడు యాలకుల పొడి రుచి వచ్చేలా కలపాలి.
స్టెప్ 6
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ నీళ్లతో బీపీ, షుగర్ కంట్రోల్.. బుడ్డి గ్లాసెడు తాగితే చాలు
చాణక్య నీతి.. వీరిని పెళ్లి చేసుకుంటే.. జీవితాంతం ఏడవాల్సిందే!
తులసి మొక్క గుబురుగా పెరగాలంటే ఈ ఒక్కటి వేస్తే చాలు..