శ్రీలీల గురించి తెలుగు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.. మొన్నటి వరకు చేతినిండా సినిమాలతో కెరీర్ పరంగా దూసుకెళ్లింది ముద్దుగుమ్మ.
ఓవైపు ఎంబీబీఎస్ చదువుతూనే మరోవైపు టాప్ హీరోల సరసన ఆఫర్స్ సొంతం చేసుకుంటూ టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
మొదటి సినిమాతోనే మంచి హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత మాస్ మహారాజ్ "ధమాకా" టాలీవుడ్ నిజమైన ధమాకా అనిపించుకుంది.
అక్కడ నుంచి ఒక టైం లో అయితే టాలీవుడ్ లోనే మోస్ట్ యంగ్ హీరోయిన్ కం అత్యధిక సినిమాలు కూడా చేతిలో ఉన్న ఇండియన్ హీరోయిన్ గా కూడా రికార్డు సెట్ చేసింది.
కానీ అదృష్టం కలిసి రాక చేసిన ప్రతీ సినిమా వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో కాస్త జోరు తగ్గించిన ఈ ముద్దుగుమ్మ సరైన కథ కోసం వేచి చూస్తోంది.
టాలీవుడ్ లో అవకాశాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో ఈ బ్యూటీ కోలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది. శివ కార్తికేయన్ సరసన 'పరాశక్తి' చిత్రంతో అదృష్టాన్ని పరీక్షించుకుంది
ఇప్పుడు ఏకంగా స్టార్ హీరో ధనుష్ సరసన ఆయన 55వ చిత్రంలో నటిస్తోంది. ధనుష్ సినిమాలు సాధారణంగా నటనకు ప్రాధాన్యత ఉన్నవిగా ఉంటాయి కాబట్టి, ఈ సినిమాతోనైనా శ్రీలీల కోరిక తీరుతుందేమో చూడాలి.