AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాషింగ్ మెషీన్‌ కొంటున్నారా.. ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ ఏది బెస్ట్ తెలుసా?

ప్రతి ఇంటి అవసరాల్లో వాషింగ్ మిషన్ ఇప్పుడు అత్యంత కీలకమైన భాగమైంది. ఉరుకుల పరుగుల జీవితంలో చేత్తో బట్టలు ఉతికే తీరిక ఎవరికీ ఉండటం లేదు. కొత్తగా మిషన్ కొనాలనుకునే వారికి ఇప్పుడు ఒకే సందిగ్ధత వేధిస్తోంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న రెండు రకాలైన ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ మిషన్లలో ఏది ఎంచుకోవాలో అర్థం కాక చాలా మంది తికమకపడుతుంటారు. బట్టల నాణ్యతను కాపాడటంలో ఏది మెరుగైన ఫలితాలను ఇస్తుందో తెలుసుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యం.

వాషింగ్ మెషీన్‌ కొంటున్నారా.. ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ ఏది బెస్ట్ తెలుసా?
Washing Machine
Nikhil
|

Updated on: May 25, 2026 | 11:00 PM

Share

ఆధునిక కాలంలో గృహోపకరణాల కొనుగోలు చేసేటప్పుడు కేవలం ధరను మాత్రమే కాకుండా, వాటి పనితీరు, నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగా బట్టలు ఉతికేందుకు వాషింగ్​ మెషీన్​ కొనేటప్పుడు చాలామంది టాప్​లోడ్​ కొనాలా లేదా ఫ్రంట్​ లోడ్​ కొనాలా? అని తికమకపడుతుంటారు. బట్టల రకాన్ని బట్టి ఏ మిషన్ ఎంచుకుంటే ఎక్కువ కాలం మన్నుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

బట్టల శుభ్రత, నాణ్యతలో ఫ్రంట్ లోడ్..

టాప్ లోడ్ మిషన్లతో పోలిస్తే ఫ్రంట్ లోడ్ మిషన్లే బట్టలను చాలా శుభ్రంగా ఉతుకుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ మిషన్లలో బట్టలు గుండ్రంగా తిరుగుతూ, ఒకదానిపై ఒకటి పడటం ద్వారా చేత్తో ఉతికినట్లుగా క్లీన్ అవుతాయి. టాప్ లోడ్ విషయానికి వస్తే.. ఇందులో బట్టలు నీటిలో మునిగి, అజిటేటర్ సాయంతో అటు ఇటు తిరుగుతాయి. ఇది కూడా బాగున్నా, ఫ్రంట్ లోడ్ ఇచ్చే పర్‌ఫెక్ట్ ఫినిషింగ్ ఇందులో లభించదు. ఖరీదైన దుస్తులు ఎక్కువ కాలం మన్నాలంటే ఫ్రంట్ లోడ్ మిషన్ బెస్ట్ ఛాయిస్. టాప్ లోడ్ మిషన్లలో బట్టలు గట్టిగా ముడుచుకుపోవడం వల్ల దారాలు త్వరగా బలహీనపడే అవకాశం ఉంటుంది. ఫ్రంట్ లోడ్ మిషన్లలో బట్టలు సున్నితంగా ఉతకబడటం వల్ల కొత్తవిలా మెరిసిపోతాయి.

ఏది ఎవరికి అనుకూలం?

పొదుపు విషయానికి వస్తే ఫ్రంట్ లోడ్ మిషన్లు చాలా తక్కువ నీటిని వాడుకుంటాయి. డ్రమ్ సగం కంటే తక్కువ నీటితోనే క్లీనింగ్ ప్రాసెస్ పూర్తవుతుంది. దీనివల్ల డిటర్జెంట్ కూడా ఆదా అవుతుంది. అయితే విద్యుత్ బిల్లు, సమయం విషయాల్లో టాప్ లోడ్ మిషన్లదే పైచేయి. టాప్ లోడ్ మిషన్లలో వాషింగ్ సైకిల్ చాలా వేగంగా అయిపోతుంది. తక్కువ బడ్జెట్‌లో అందుబాటులో ఉండటం వీటి ప్రత్యేకత.

ఫ్రంట్ లోడ్ మిషన్లలో నీటిని వేడి చేసే ఇన్‌బిల్ట్ హీటర్లు ఉండటం వల్ల విద్యుత్ ఖర్చు కాస్త ఎక్కువగా ఉండొచ్చు. ఫ్రంట్ లోడ్ మిషన్లకు వంగి బట్టలు వేయాల్సి ఉంటుంది, ఇది వృద్ధులకు లేదా నడుం నొప్పి ఉన్నవారికి ఇబ్బందిగా మారవచ్చు. బడ్జెట్ పరిమితి లేని వారికి ఫ్రంట్ లోడ్ ఉత్తమం, తక్కువ బడ్జెట్‌లో వేగవంతమైన వాషింగ్ కోరుకునే వారికి టాప్ లోడ్ సరైన ఎంపిక. మీ అవసరాలను బట్టి సరైన నిర్ణయం తీసుకోండి.

Follow Us
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
సూర్యవంశీకి షాకిచ్చిన.. టీమ్‌ లిస్ట్‌లో బుడ్డోడి పేరు గల్లంతు
సూర్యవంశీకి షాకిచ్చిన.. టీమ్‌ లిస్ట్‌లో బుడ్డోడి పేరు గల్లంతు
క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్..
క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్..
ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
మన పూర్వికులు బలానికి 100ఏళ్ల రహస్యం ఇదే..
మన పూర్వికులు బలానికి 100ఏళ్ల రహస్యం ఇదే..
బాత్రూమ్ టైల్స్‌పై మొండి మరకలా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
బాత్రూమ్ టైల్స్‌పై మొండి మరకలా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
రూ.5 ట్రాక్టర్ ఫొటో నోటు మీ దగ్గర ఉందా..? మీరే లక్షాధికారి..
రూ.5 ట్రాక్టర్ ఫొటో నోటు మీ దగ్గర ఉందా..? మీరే లక్షాధికారి..
సెప్టెంబర్‌లో పుట్టారా? మీలో ఈ గుణాలు కన్ఫర్మ్ గా ఉంటాయట!
సెప్టెంబర్‌లో పుట్టారా? మీలో ఈ గుణాలు కన్ఫర్మ్ గా ఉంటాయట!
ఇంట్లో డబ్బు, సంతోషం ఉండాలంటే డస్ట్‌బిన్‌ను ఇలా ఉంచాలట!
ఇంట్లో డబ్బు, సంతోషం ఉండాలంటే డస్ట్‌బిన్‌ను ఇలా ఉంచాలట!
ఆ స్టార్ హీరో సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. కానీ
ఆ స్టార్ హీరో సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. కానీ